Traffic accidents in India : ట్రాఫిక్​ ప్రమాదాలకు 1.73లక్షల మంది బలి-traffic accidents in india kill 1 73 lakh people in 2021 ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Traffic Accidents In India Kill 1.73 Lakh People In 2021

Traffic accidents in India : ట్రాఫిక్​ ప్రమాదాలకు 1.73లక్షల మంది బలి

Sharath Chitturi HT Telugu
Aug 29, 2022 09:30 PM IST

Traffic accidents in India : 2021లో దేశంలో జరిగిన ట్రాఫిక్​ ప్రమాదాలకు 1.73లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ డేటాను ఎన్​సీఆర్​బీ వెల్లడించింది.

ట్రాఫిక్​ ప్రమాదాలకు 1.73లక్షల మంది బలి
ట్రాఫిక్​ ప్రమాదాలకు 1.73లక్షల మంది బలి (Anshuman Poyrekar/HT PHOTO)

Traffic accidents in India : దేశంలో ట్రాఫిక్​ ప్రమాదాలు ఆందోళనకరంగా మారాయి. 2021లో మొత్తం మీద 4.22లక్షల ట్రాఫిక్​ ప్రమాదాలు జరగ్గా.. వాటిల్లో 1.73లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఉత్తర్​ప్రదేశ్​లో అత్యధికంగా 24,711 మంది ట్రాఫిక్​ ప్రమాదాలకు బలి అయ్యారు. ఈ వ్యవహారంలో 16,685 మరణాలతో తమిళనాడు రెండో స్థానంలో ఉంది.

ట్రెండింగ్ వార్తలు

దేశంలో ట్రాఫిక్​ ప్రమాదాలపై ఓ నివేదికను బయటపెట్టింది ఎన్​సీఆర్​బీ(నేషనల్​ క్రైమ్​ రికార్డ్స్​ బ్యూరో). 2020తో పోల్చుకుంటే 2021లో ట్రాఫిక్​ ప్రమాదాలు పెరిగాయి. 2020లో 3,68,828గా ఉన్న ప్రమాదాల సంఖ్య.. 2021లో 4,22,659కి చేరింది.

ఈ మొత్తం ట్రాఫిక్​ ప్రమాదాల్లో.. 4,03,116 రోడ్డు ప్రమాదాలు ఉన్నాయి. 17,993 రైల్వే ప్రమాదాలు, 1,550 రైల్వే క్రాసింగ్​ ప్రమాదాలు కూడా ఉన్నాయి. ఆయా ఘటనల్లో వరుసగా 1,55,622- 16,431- 1,807 మంది మరణించారు.

Traffic accident death toll : ట్రాఫిక్​ ప్రమాదాలు పెరిగిన రాష్ట్రాల్లో తమిళనాడు మొదటి స్థానంలో నిలిచింది(2020లో 46,443- 2021లో 57,090). మధ్యప్రదేశ్​(43,360-49,493), ఉత్తర్​ప్రదేశ్​(30,593-36,509), మహారాష్ట్ర(24,908- 30,086).. తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ ట్రాఫిక్​ ప్రమాదాల్లో మొత్తం మీద 3,73,884 మంది గాయపడ్డారు.

మొత్తం మీద 2021లో జరిగిన ట్రాఫిక్​ ప్రమాదాల్లో ఉత్తర్​ప్రదేశ్​ వాటా 14.2శాతం, తమిళనాడు వాటా 9.6శాతం, మహారాష్ట్రలో 9.5శాతంగా ఉంది.

2017 నుంచి 2019 వరకు విపరీతంగా పెరిగిన ట్రాఫిక్​ ప్రమాదాల మరణాలు.. 2020లో అనూహ్యంగా తగ్గిపోయాయి. కానీ 2021లో మళ్లీ పెరిగాయి.

Traffic accidents : కాగా.. అనేక రాష్ట్రాల్లో ట్రాఫిక్​ ప్రమాదాల వల్ల మరణాల కన్నా గాయపడిన వారే ఎక్కువమంది ఉన్నారు. కానీ మిజోరాం, పంజాబ్​, ఝార్ఖండ్​, ఉత్తర్​ప్రదేశ్​లో గాయపడిన వారి కన్నా మరణించిన వారి సంఖ్యే ఎక్కువగా ఉంది.

మిజోరాంలో 64 రోడ్డు ప్రమాదాలు జరగ్గా.. 64మంది మరణించారు, 28మంది గాయపడ్డారు. పంజాబ్​లో 6,097 రోడ్డు ప్రమాదాలు జరగ్గా.. 4,516మంది మరణిస్తే, 3,034మంది గాయపడ్డారు. ఝార్ఖండ్​లో 4,728 రోడ్డు ప్రమాదాల్లో 3,513మంది ప్రాణాలు కోల్పోగా.. 3,227మంది గాయపడ్డారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం