Ganpati Bappa Morya : ఈ ఏడాది వినాయక చవితి (Ganesh Chaturthi 2022) రానే వచ్చింది. భారతదేశం ఆ విఘ్నేశ్వరుడికి సాదర స్వాగతం పలికింది. ఊరూరా, వాడవాడలా గణనాథుడి విగ్రహాలు కొలువుదీరడంతో దేశవ్యాప్తంగా పండగ శోభ వచ్చింది. నేటి నుంచి పది రోజుల పాటు వినాయక మండపాల వద్ద సందడే సందడి ఉంటుంది. మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గోవా సహా ఇతర రాష్ట్రాలలో గణేష్ చతుర్థి ఘనంగా ప్రారంభమైంది. అతిపెద్ద హిందూ పండుగలలో ఒకటైన ఈ పండుగను భక్తజనం భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. బొజ్జ గణపయ్యపై తమ ప్రేమను కురిపిస్తూ ఉండ్రాళ్లు, నైవేద్యాలు సమర్పిస్తున్నారు. వినాయక చవితి సందర్భంగా ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, వైఎస్ జగన్ కూడా శుభాకాంక్షలు తెలిపారు. మరిన్ని వివరాల కోసం ఈ వీడియో చూడండి.