Khairatabad Ganesh : ఈ ఏడాది ఖైరతాబాద్ గణేశుడి రూపం ఇదే.. ఎత్తు ఎంతో తెలుసా?-khairatabad clay ganesh idol 50 feet panchamukha maha laxmi ganapathi in this year ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Khairatabad Ganesh : ఈ ఏడాది ఖైరతాబాద్ గణేశుడి రూపం ఇదే.. ఎత్తు ఎంతో తెలుసా?

Khairatabad Ganesh : ఈ ఏడాది ఖైరతాబాద్ గణేశుడి రూపం ఇదే.. ఎత్తు ఎంతో తెలుసా?

HT Telugu Desk HT Telugu
Jun 27, 2022 07:46 PM IST

వినాయక చవితి వచ్చిందంటే.. చాలు.. భాగ్యనగరంలో ఏ మూల ఉన్న భక్తులైనా.. ఒక్కసారి వచ్చి.. ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకుని వెళ్తారు. చాలా ఏళ్లుగా ఇక్కడ వినాయకుడిని ప్రతిష్టిస్తూ వస్తున్నారు.

<p>ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలు</p>
ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలు

ఖైరతాబాద్ మహా గణపతి.. తెలుగు రాష్ట్రాలతోపాటుగా ఇతర రాష్ట్రాల్లోనూ చాలా ఫేమస్. ఇక్కడి వినాయకుడు, లడ్డు వేలం గురించి.. అందరికీ ఆసక్తి ఉంటుంది. అలా గణేశుడు ఈసారి.. మట్టి ప్రతిమగా రూపుదిద్దుకోనున్నాడు. పంచముఖ మహా లక్ష్మీగణపతిగా దర్శనమిస్తాడు. తాజాగా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ నమూనా ఫొటోను విడుదల చేసింది.

ఈసారి మెుత్తం 50 అడుగుల ఎత్తులో విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. మట్టి విగ్రహాలనే ప్రతిష్టించాలని గతేడాది సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు మట్టి విగ్రహాన్నే పెట్టేందుకు ఉత్సవ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఏటా అత్యంత వైభవంగా వినాయక చవితి నిర్వహణ బాధ్యతలు చూస్తుంటారు. ఈ ఏడాది శ్రీ పంచముఖ మహాలక్ష్మీ గణపతి అవతారంలో విశ్వరూప గణపతి విగ్రహ స్థాపన చేయాలని నిర్ణయించారు.

తాజాగా 2022లో కొలువుదీరనున్న మహా గణపతి రూపానికి సంబంధించిన ఫొటోను ఉత్సవ కమిటీ విడుదల చేసింది. పంచముఖ మహాలక్ష్మీ గణపతి విగ్రహానికి కుడి వైపున శ్రీ షణ్ముఖ సుబ్రమణ్య స్వామి విగ్రహం, ఎడమ వైపున త్రిశక్తి మహా గాయత్రి దేవి విగ్రహాలను ఏర్పాటు చేస్తారు. ఖైరతాబాద్ లో ఎక్కువ సార్లు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారుచేసిన గణేశుడి.. మహా ప్రతిమను ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. ఈసారి మాత్రం మట్టిగణపతినే ప్రతిష్ఠిస్తారు.

68 ఏళ్లుగా ఖైరతాబాద్ లో గణేశ్ విగ్రహాన్ని ప్రతిష్టిస్తున్నారు. ఒక అంగుళం ఎత్తున్న విగ్రహాన్ని మెుదట 1954లో ప్రతిష్ట చేశారు. అలా 2014 వరకు ఏటా ఒక అంగుళం పెంచుకుంటూ 60 ఫీట్ల అత్యంత ఎత్తైన గణేశ్ విగ్రహాన్ని నిర్మిస్తూ వచ్చారు. పర్యావరణ వేత్తల సూచనలు, తరలింపులో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా ఆ తర్వాత ఎత్తు తగ్గిస్తూ వచ్చారు. 2020లో కరోనా టైంలో 27 అడుగుల మట్టి గణపతిని ప్రతిష్టించారు.

<p>ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలు</p>
ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలు
Whats_app_banner