తెలుగు న్యూస్  /  Telangana  /  Irctc Announced Goa Tour From Hyderabad

IRCTC Goa Tour: హైదరాబాద్ నుంచి గోవా ట్రిప్ - ఐఆర్‌సీటీసీ తాజా ప్యాకేజీ చూడండి..

HT Telugu Desk HT Telugu

10 November 2022, 12:11 IST

    • goa tour package: గోవా టూర్ ప్యాకేజీ ప్రకటించింది ఐఆర్‌సీటీసీ టూరిజం. హైదరాబాద్ నుంచి ఫ్లైట్ జర్నీ ద్వారా ఆపరేట్ చేస్తోంది. ఇందుకు సంబంధించిన తాజా వివరాలను వెల్లడించింది.
గోవా టూర్ ప్యాకేజీ
గోవా టూర్ ప్యాకేజీ ( (www.irctctourism.com))

గోవా టూర్ ప్యాకేజీ

Goa Tour From Hyderabad: వేర్వురు ప్రదేశాలను దర్శించుకునేందుకు కొత్త కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. తాజాగా గోవాలోని పలు ప్రాంతాలను చూసేందుకు టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ‘GOAN DELIGHT’ పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. హైదరాబాద్ నుంచి ఫ్లైట్ జర్నీ ద్వారా సాగే ఈ టూర్ లో... పలు పర్యాటక ప్రాంతాలను చూపించనుంది. ప్రస్తుతం నవంబర్ 24వ తేదీన ఈ టూర్ అందుబాటులో ఉంది. 3 రాత్రులు 4 రోజుల టూర్ ప్యాకేజీ. వివరాలు చూస్తే.....

ట్రెండింగ్ వార్తలు

TS Govt Pleader: మహిళను వేధిస్తున్న పోకిరి ప్లీడర్ ఆటకట్టు, నిందితుడు మాజీ గవర్నమెంట్‌ ప్లీడర్

Siddipet District : తండ్రిని చూసుకోని తనయుడు...! కొండగట్టు ఆలయానికి ఆస్తిని రాసిచ్చేందుకు సిద్ధమైన తండ్రి

TS Inter Supply Exams 2024 : అలర్ట్... తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు, ఎప్పటివరకంటే..

Arunachalam Tour : ఈ నెలలో 'అరుణాచలం' ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా..? రూ. 7500కే 4 రోజుల టూర్ ప్యాకేజీ, ఇవిగో వివరాలు

Day 01: మొదటిరోజు సాయంత్రం 04.20 నిమిషాలకు శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి జర్నీ మొదలవుతుంది. సాయంత్రం 05.35 నిమిషాలకు గోవా విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ్నుంచి హోటల్ లోకి చెకిన్ అవుతారు. తర్వాత జురారీ నదికి వెళ్తారు. తిరిగి హోటల్ కి చేరుకుంటారు.

Day 02: బ్రేక్ ఫాస్ట్ తర్వాత సౌత్ గోవాలోని పలు ప్రాంతాల సందర్శన ఉంటుంది. ఓల్డ్ చర్చ్, వాక్స్ వరల్డ్ మ్యూజియం, శ్రీ మంగేషీ ఆలయం, మిరామిర్ బీచ్ కు వెళ్తారు. క్రూజ్ బోట్ లో జర్నీ ఉంటుంది. తర్వాత తిరిగి హోటల్ కి చేరుకుంటారు.

Day 03: టిఫిన్ తర్వాత నార్త్ గోవా టూర్ కు వెళ్తారు. Aguada ఫోర్టు, కండోలియం బీచ్, బాగా బీచ్ లో స్పోర్ట్ ఈవెంట్స్ లో పాల్గొంటారు. అంజునా బీచ్, వగాటర్ బీట్, చాపోరా బీచ్ సందర్శన తర్వాత తిరిగి హోటల్ కి వెళ్తారు.

Day 04: బ్రేక్ ఫాస్ట్ తర్వాత హోటల్ నుంచి ఉదయం 11 గంటలకు చెక్ అవుట్ అవుతారు. తర్వాత గోవా విమానాశ్రయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 02.15 నిమిషాలకు జర్నీ స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నం 03.30 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ చేరుకోవటంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.

టూర్ ధరలు ఇలా...

hyd goa tour cost: సింగిల్ షేరింగ్ కు రూ. 27,300 ధర ఉండగా.. డబుల్ షేరింగ్ కు రూ. 21,455 ధరగా ప్రకటించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ.20,980గా ఉంది. కంఫార్ట్ క్లాస్ లో ఈ ధరలు ఉంటాయి. 5 నుంచి 11 ఏళ్ల చిన్నారుకు కూడా టికెట్ ధరలు నిర్ణయించారు. పూర్తి వివరాలను కింద ఇచ్చిన జాబితాలో చూసుకోవచ్చు. ఇక టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ కవర్ అవవుతాయి.

ధరల వివరాలు

NOTE:

లింక్ పై క్లిక్ చేసి ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు.

వివరాలు తెెలుసుకునేందుకు 040-27702407 / 9701360701 ఈ నెెంబర్లను సంప్రదించవచ్చు.