ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ(IRCTC Tour Package)లు ప్రకటిస్తోంది. కొన్ని ప్రదేశాలకు చూడాలనుకునేవారికి.. ఈ ప్యాకేజీలు ఉపయోగపడుతున్నాయి. తక్కువ ధరలో వెళ్లి రావొచ్చు. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఐఆర్‌సీటీసీ తీసుకెళ్లి.. తీసుకొస్తుంది. తాజాగా షిరిడీ(Shirdi)కి ఓ ప్యాకేజీని ప్రకటించింది ఐఆర్‌సీటీసీ. విజయవాడ నుంచి వెళ్లి రావాలి. సాయి సన్నిధి(Sai Sannidhi) పేరుతో ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది. నవంబర్ 15వ తేదీన ప్రారంభమవుతుంది. ఈ టూర్ కు సంబంధించిన వివరాలివే..,IRCTC Sai Sannidhi Tour Package : ఐఆర్‌సీటీసీ సాయి సన్నిధి పేరిట టూర్ ప్యాకేజీ అందిస్తోంది. షిరిడీ వెళ్లాలనుకునేవారి కోసం మూడు రాత్రులు, 4 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. రైలు మార్గంలో షిరిడీకి తీసుకెళ్లి సాయిబాబా దర్శనానికి ఏర్పాట్లు చేస్తుంది. ఇందులో షిరిడీలో సాయిబాబా దర్శనం ఉంటుంది. శనిశిగ్నాపూర్ కూడా వెళ్లి రావొచ్చు.,IRCTC Shirdi Tour Package : ఐఆర్‌సీటీసీ టూరిజం షిరిడీ టూర్ ప్యాకేజీ మొదటి రోజు విజయవాడ(Vijayawada) రైల్వే స్టేషన్లో ప్రారంభమవుతుంది. ఉదయం 10.15 గంటలకు ప్రారంభమవుతుంది. నైట్ అంతా ప్రయాణం చేయాలి. రెండో రోజు ఉదయం 06.15 గంటలకు నాగర్‌సోల్(Nagarsol) వెళ్తుంది. ఆ తర్వాత షిరిడీకి వెళ్లాలి. హోటల్ వెళ్లిన తర్వాత.. షిరిడీ ఆలయ సందర్శనకు వెళ్లాల్సి ఉంటుంది. రాత్రి అక్కడే బస చేయాలి.,మరుసటి రోజు శనిశిగ్నాపూర్ సందర్శన ఉంటుంది. సాయంత్రం షిరిడీ వెళ్లి రూమ్ చెకౌట్ చేయాలి. ఆ తర్వాత నాగర్ సోల్ రైల్వే స్టేషన్(Railway Station) తీసుకొస్తారు. రాత్రి 7:30 గంటలకు ట్రైన్ ఉంటుంది. మరుసటి రోజు ఉదయం అంటే నాలుగో రోజు మధ్యాహ్నం 02.50 గంటలకు విజయవాడ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.,ఇక టూర్ ప్యాకేజీ ధర చూసుకుంటే.. స్టాండర్డ్ క్లాస్‌లో నలుగురి నుంచి ఆరుగురు ప్యాకేజీ(Package) బుక్ చేసుకోవచ్చు. డబుల్ ఆక్యుపెన్సీకి రూ.5960, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.5120 చెల్లించాలి. ఒకరి నుంచి ముగ్గురు బుక్ చేస్తే.. సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.13340, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.7460, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.5770గా ధర ఉంది.,కంఫర్ట్ క్లాస్‌లో నలుగురి నుంచి ఆరుగురు ఈ ప్యాకేజీ బుక్ చేసుకుంటే డబుల్ ఆక్యుపెన్సీకి రూ.8420, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.7580 చెల్లించాలి. ఒకరి నుంచి ముగ్గురు బుక్ చేసుకుంటే సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.15790గా ఉంది. డబుల్ ఆక్యుపెన్సీకి రూ.9910, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.8230గా పెట్టారు. లంచ్, డిన్నర్, ఎంట్రెన్స్ టికెట్స్, టూర్ గైడ్ ఈ ప్యాకేజీలో అందుబాటులో ఉంటాయి.,