తెలుగు న్యూస్  /  Telangana  /  Delhi Police Denied Permission To Mlc Kavitha Protest

Shock to MLC Kavitha: కవితకు ఢిల్లీ పోలీసులు షాక్.. దీక్షకు అనుమతి నిరాకరణ!

HT Telugu Desk HT Telugu

09 March 2023, 15:05 IST

    • mlc kavitha protest at delhi: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు షాక్ ఇచ్చారు ఢిల్లీ పోలీసులు. మార్చి 11వ తేదీన తలపెట్టిన దీక్షకు అనుమతి రద్దు చేశారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత

denied permission to mlc kavitha protest at delhi: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు చివరి నిమిషంలో షాక్ ఇచ్చారు ఢిల్లీ పోలీసులు. చట్టసభల్లో 33 శాతం మహిళా రిజర్వేషన్‌ బిల్లు తీసుకురావాలనే డిమాండ్‌తో మార్చి 11వ తేదీన ఢిల్లీ వేదికగా దీక్ష చేయనున్నారు. అయితే కవిత తలపెట్టిన నిరసన దీక్షకు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు. లిక్కర్ కేసుపై శుక్రవారం మీడియాతో కవిత మాట్లాడుతుండగానే... సాంకేతిక కారణాలతో అనుమతి నిరాకరించినట్లు పోలీసులు సమాచారం అందించారు.

ట్రెండింగ్ వార్తలు

IRCTC Shirdi Tour : 3 రోజుల షిర్డీ ట్రిప్ - నాసిక్ కూడా వెళ్లొచ్చు, ట్రైన్ టూర్ ప్యాకేజీ వివరాలివే

TS Graduate MLC Election 2024 : గులాబీ పార్టీకి సవాల్ గా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నిక - ఈసారి గెలుపు సాధ్యమేనా..?

TS TET 2024 Updates : 'తెలంగాణ టెట్' పరీక్షల షెడ్యూల్ మారే ఛాన్స్...! కారణం ఇదే

Karimnagar District : కారం చల్లి... రోకలితో కొట్టి! కన్న కొడుకును కడతేర్చిన తండ్రి

అనుమతి రద్దుపై కవిత స్పందించారు. ముందు అనుమతి ఇచ్చి ఇప్పుడు ఎలా రద్దు చేస్తారని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఢిల్లీ పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించారు. దీక్షలో ఎలాంటి మార్పు లేదన్నారు. మీడియాతో మాట్లాడిన కవిత… పలు అంశాలపై స్పందించారు. ఈడీ విచార‌ణ‌కు వంద‌ శాతం స‌హ‌క‌రిస్తానని స్పష్టం చేశారు. తానే ఈడీ ముందుకు ధైర్యంగా వ‌చ్చి, విచార‌ణ ఎదుర్కొంటాన‌ని చెప్పారు. ఈడీ విచారణకు రెండు రోజుల సమయం అడిగామని… తమకు రెండు రోజుల సమయం ఇస్తే ఈడీకి వచ్చిన నష్టమేంటి? అని కవిత ప్రస్నించారు. తన ఇంటికి వచ్చి విచారణ చేయాలని ఈడీని కోరానని.. కానీ దీనికి ఈడీ అంగీకరించలేదన్నారు. మహిళలను ఇంట్లో విచారించాలని చట్టం చెబుతోందని.. ఇది తన ఒక్కరి సమస్య కాదని చెప్పుకొచ్చారు. ఈడీ ఎందుకింత హడావిడీగా వ్యవహరిస్తోందో అర్థం కావడం లేదన్న ఆమె,, విచారించే పద్దతిపై అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తామని చెప్పారు.

బీజేపీలో చేరిన నేత‌లపై ఈడీ, సీబీఐ కేసులు ఉండ‌వని.. బీజేపీని ప్ర‌శ్నించిన విప‌క్షాలపై ద‌ర్యాప్తు సంస్థ‌ల‌తో దాడులు, కేసులు పెడుతున్నారని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. త‌మ వైపు స‌త్యం, ధ‌ర్మం, న్యాయం ఉంది. ఏ విచార‌ణనైనా ధైర్యంగా ఎదుర్కొంటామన్నారు. బీజేపీకి ప్ర‌త్యామ్నాయం బీఆర్ఎస్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.

27 ఏళ్లుగా మహిళా రిజర్వేషన్‌ బిల్లు కోసం పోరాటాలు జరుగుతున్నాయని గుర్తు చేశారు కవిత. ఎన్ని ప్రభుత్వాలు మారినా దానికి మాత్రం ఆమోదం లభించలేని,,. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ బిల్లు కోసం తమ పోరాటం కొనసాగిస్తామని,,. 2014, 2019 ఎన్నికల్లోనూ మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై బీజేపీ హామీ ఇచ్చిందన్నారు. ఈనెల 10న మహిళా బిల్లుపై దీక్ష చేస్తామని మార్చి 2నే చెప్పామని స్పష్టం చేశారు. ఈ దీక్షకు 18 పార్టీలకుపైగా విపక్ష పార్టీలు మద్దతిస్తాయని చెప్పారు.