తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Tet 2024 Updates : 'తెలంగాణ టెట్' పరీక్షల షెడ్యూల్ మారే ఛాన్స్...! కారణం ఇదే

TS TET 2024 Updates : 'తెలంగాణ టెట్' పరీక్షల షెడ్యూల్ మారే ఛాన్స్...! కారణం ఇదే

27 April 2024, 6:26 IST

    • Telangana TET Exam Updates 2024: తెలంగాణ టెట్ (TS TET 2024)పరీక్షలు మే 20 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. అయితే పరీక్షల షెడ్యూల్ లో స్వల్ప మార్పులు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
తెలంగాణ టెట్ పరీక్షలు - 2024
తెలంగాణ టెట్ పరీక్షలు - 2024

తెలంగాణ టెట్ పరీక్షలు - 2024

TS TET Exam Updates 2024 : తెలంగాణ టెట్(TS TET Exam) కు దరఖాస్తుల ప్రక్రియ పూర్తి అయిన సంగతి తెలిసిందే. మే 20వ తేదీ నుంచి పరీక్షలు కూడా ప్రారంభం అవుతాయని అధికారులు షెడ్యూల్ కూడా ప్రకటించారు. జూన్ 06వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగాల్సి ఉంటుంది. అయితే పరీక్షల షెడ్యూల్ లో స్వల్ప మార్పులు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందుకు కారణం లేకపోలేదు. మే 27వ తేదీన తెలంగాణలోని గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ(ఖమ్మం, నల్గొండ, వరంగల్) స్థానానికి ఉపఎన్నిక జరగనుంది. ఇదే తేదీన పోలింగ్ ఉంది. దీంతో ఈ రోజే జరగాల్సిన టెట్ పరీక్ష ఉంటుందా..? లేక వాయిదా షెడ్యూల్ మారుస్తారా అనేది ప్రశ్నగా మారింది.

ట్రెండింగ్ వార్తలు

Karimnagar News : రైతులకు నష్టం జరగనివ్వం, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం- పౌరసరఫరాల శాఖ కమిషనర్

Wines Shops Close : మందుబాబులకు బ్యాడ్ న్యూస్, మూడ్రోజుల పాటు వైన్ షాపులు బంద్

TS Inter Admissions 2024-25 :తెలంగాణ ఇంటర్ అడ్మిషన్ల షెడ్యూల్ విడుదల, రేపట్నుంచి అప్లికేషన్లు జారీ

Tirumala Tour : ఒకే ఒక్క రోజులో తిరుమల ట్రిప్, ఫ్రీగా శ్రీవారి శీఘ్రదర్శనం - తెలంగాణ టూరిజం నుంచి అదిరిపోయే ప్యాకేజీ

స్వల్ప మార్పులకు ఛాన్స్…!

మే 20న తెలంగాణ టెట్ పరీక్షలు(Telangana TET exam schedule) ప్రారంభమైన జూన 06వ తేదీన ముగుస్తాయి. ఈ మేరకు అధికారులు షెడ్యూల్ కూడా ప్రకటించారు. అయితే ఖమ్మం, నల్గొండ, వరంగల్ గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ స్థానానికి(ఉపఎన్నిక) సంబంధించి తాజాగా ఎన్నికల సంఘం షెడ్యూల్ ను విడుదల చేసింది. మే 27వ తేదీన పోలింగ్ ఉంటుందని ప్రకటించింది. అయితే ఈ మూడు జిల్లాల్లోని గ్రాడ్యూయేట్లు ఈ ఓటింగ్ లో పాల్గొంటారు. ఇందులో చాలా మంది టెట్ రాసేవారు ఉంటారు. అదే రోజు పోలింగ్… మరోవైపు ఎగ్జామ్ ఉంటే… ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఇదే అంశంపై విద్యాశాఖ అధికారులు కసరత్తు ప్రారంభించినట్లు తెలిసింది. పోలింగ్ లో పాల్గొనేందుకు ఇబ్బందులు లేకుండా… ముందుగా ప్రకటించిన షెడ్యూల్ లో స్వల్ప మార్పులు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.

ఇక ఈసారి నిర్వహించబోయే టెట్ పరీక్ష కోసం మొత్తం 2,83,441 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో పేపర్ 1 కోసం 99,210 మంచి నుంచి అప్లికేషన్లు రాగా… పేపర్‌-2(TET Paper 2)కు 1,84,231 మంది అప్లయ్ చేశారు.మరోవైపు తెలంగాణ టెట్ కు ప్రిపేర్ అయ్యే విద్యార్థుల కోసం విద్యాశాఖ ఉచితంగా మాక్ టెస్టులు రాసే అవకాశం కల్పించింది. ఈ మేరకు వెబ్ సైట్ లో ఆప్షన్ తీసుకొచ్చింది. https://schooledu.telangana.gov.in/ISMS/ వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ పరీక్షలను రాసుకొవచ్చు.

తెలంగాణ టెట్ మాక్ టెస్టులు - ప్రాసెస్ ఇదే

  • తెలంగాణ టెట్ కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://tstet2024.aptonline.in/tstet/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • హోంపేజీలో పైన కనిపించే TS TET Mock Test-2024 అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  • ఇక్కడ సైన్ ఇన్ కావాల్సి ఉంటుంది. ఆ తర్వాత వచ్చే ఆప్షన్లపై క్లిస్ చేస్తే… మీకు ప్రశ్నాపత్రం ఓపెన్ అవుతుంది.
  • ఇలా మీరు ఎన్నిసార్లు అయినా పరీక్షలను రాసుకొవచ్చు.
  • ఈ పరీక్షలను రాయటం ద్వారా… ఆన్ లైన్ లో రాసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా ఓ అవగాహనకు రావొచ్చు.

TS TET Key Dates 2024 : తెలంగాణ టెట్ ముఖ్య తేదీలు:

  • తెలంగాణ టెట్ - 2024
  • టెట్ హాల్ టికెట్లు - మే 15, 2024.
  • పరీక్షలు ప్రారంభం - మే 20, 2024.
  • పరీక్షల ముగింపు - జూన్ 06,2024.
  • టెట్ ఫలితాలు - జూన్ 12, 2024.
  • అధికారిక వెబ్ సైట్ - https://schooledu.telangana.gov.in/ISMS/