TS TET 2024 : ముగిసిన టీఎస్ టెట్ దరఖాస్తు గడువు- 2,83,441 అప్లికేషన్లు, మే 20 నుంచి పరీక్షలు-hyderabad ts tet 2024 applications window closed exams starts from may 20th ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Tet 2024 : ముగిసిన టీఎస్ టెట్ దరఖాస్తు గడువు- 2,83,441 అప్లికేషన్లు, మే 20 నుంచి పరీక్షలు

TS TET 2024 : ముగిసిన టీఎస్ టెట్ దరఖాస్తు గడువు- 2,83,441 అప్లికేషన్లు, మే 20 నుంచి పరీక్షలు

Bandaru Satyaprasad HT Telugu
Apr 21, 2024 12:07 PM IST

TS TET 2024 : తెలంగాణ టెట్-2024 అప్లికేషన్ గడువు శనివారం ముగిసింది. టెట్ కు మొత్తం 2,83,441 మంది అప్లై చేసుకున్నారు.

 టీఎస్ టెట్ దరఖాస్తులు
టీఎస్ టెట్ దరఖాస్తులు

TS TET 2024 : తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TS TET-2024) అప్లికేషన్ల గడువు శనివారంతో ముగిసింది. టెట్ కు మొత్తం 2,83,441 మంది దరఖాస్తు చేసుకున్నారు. టెట్ పేపర్‌-1(TET Paper 1)కు 99,210, పేపర్‌-2(TET Paper 2)కు 1,84,231 మంది దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. టెట్ పరీక్షలను(TET Exams) మే 20 నుంచి జూన్ 3 వరకు కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించనున్నారు. అప్లికేషన్ ఎడిట్ కు అవకాశం ఇవ్వగా పేపర్‌-1లో 6,626 మంది, పేపర్‌-2లో 11,428 మంది సవరణలు చేసుకున్నారు. మే 15 నుంచి హాల్ టికెట్లు జారీ చేయనున్నారు. టీఎస్ టెట్ -2024 పరీక్ష ఫలితాలు జూన్‌ 12న విడుదల చేయనున్నారు.

మే 15 నుంచి టెట్ హాల్ టికెట్లు

తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(TS TET 2024) దరఖాస్తు గడువు నిన్నటితో ముగిసింది. టీఎస్ టెట్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 27న ప్రారంభం అయిన విషయం తెలిసిందే. మే 15 నుంచి అభ్యర్థుల హాల్‌టికెట్ల జారీ చేయనున్నారు. మే 20వ తేదీ నుంచి జూన్‌ 3 వరకు టెట్‌ పరీక్షలను నిర్వహించనున్నారు. జూన్‌ 12న టెట్‌ ఫలితాలు విడుదల చేయనున్నారు.

11 జిల్లాల్లో టెట్ పరీక్ష కేంద్రాలు

టీఎస్ టెట్ పరీక్షల(TS TET) నిర్వహణకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 11 జిల్లాల్లో టెట్‌ ను నిర్వహించనున్నారు. డీఎస్సీ పరీక్ష రాసేందుకు టెట్ లో అర్హత సాధించాలి. తెలంగాణలో ఉపాధ్యాయుల నియామకానికి డీఎస్సీ నోటిఫికేషన్(TS DSC Notification) విడుదలైన సంగతి తెలిసిందే. 11,062 టీచర్ పోస్టుల భర్తీకి మార్చి 4న మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైంది. జులై 17వ తేదీ నుంచి డీఎస్సీ పరీక్షలు(TS DSC Exams 2024) ప్రారంభమై జులై 31వ తేదీతో ఈ ఎగ్జామ్స్ ముగుస్తాయి.

టీఎస్ టెట్ పరీక్ష విధానం

టెట్ పేపర్‌-1 కు డీఈడీ(D.Ed) అర్హతతోపాటు జనరల్‌ అభ్యర్థులు ఇంటర్ 50 శాతం మార్కులు, ఇతరులకు 45 శాతం మార్కులు వచ్చి ఉండాలి. 2015 లోపు డీఈడీ చేసిన జనరల్ అభ్యర్థులకు ఇంటర్‌లో 45 శాతం మార్కులు, ఇతరులకు 40 శాతం మార్కులు వచ్చి ఉండాలి. టెట్‌ పేపర్‌-2కు డిగ్రీ అర్హతతోపాటు బీఈడీ పూర్తి చేసి ఉండాలి. జనరల్ అభ్యర్థులకు డిగ్రీలో 50 శాతం మార్కులు, ఇతరులకు 45 శాతం మార్కులు వచ్చి ఉండాలి. 2015 లోపు బీఈడీ చేసిన జనరల్ అభ్యర్థులు 50 శాతం మార్కులు, ఇతరులకు 40 శాతం మార్కులు పొంది ఉండాలి. టీఎస్ టెట్‌(TS TET 2024) లో రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపరును 150 మార్కులకు నిర్వహిస్తారు. పేపర్‌-1ను ఉదయం 9 నుంచి 11.30 వరకు, పేపర్‌-2ను మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 వరకు నిర్వహిస్తారు. టెట్ కు డీఎస్సీ(TS DSC 2024)లో 20 శాతం వెయిటేజీ ఇస్తారు. జనరల్‌ అభ్యర్థులు 90 మార్కులు, బీసీలు 75 మార్కులు, ఎస్సీ,ఎస్టీ, దివ్యాంగులు 60 మార్కులు సాధిస్తే టెట్ లో అర్హత పొందవచ్చు.

IPL_Entry_Point

సంబంధిత కథనం