TS TET 2024 : అభ్యర్థులకు అలర్ట్... ఇవాళ్టితో ముగియనున్న 'తెలంగాణ టెట్' దరఖాస్తులు
Telangana TET 2024 Updates: తెలంగాణ టెట్ దరఖాస్తుల గడువు ఇవాళ్టి(ఏప్రిల్ 19)తో పూర్తి కానుంది. మరోసారి గడువు పెంచే అవకాశం లేదని అధికారులు స్పష్టం చేశారు. మే 20వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
Telangana TET 2024 Updates: తెలంగాణ టెట్ ఆన్ లైన్ అప్లికేషన్లు(Telangana TET 2024 Applications) ఇవాళ్టి(ఏప్రిల్ 20)తో ముగియనున్నాయి. అర్హత గల అభ్యర్థులు ఏవరైనా ఉంటే వెంటనే అప్లయ్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మరోసారి గడువు పెంచే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం… ఏప్రిల్ 10వ తేదీనే ముగియాల్సి ఉంది. కానీ పలువురి నుంచి వచ్చిన విజ్ఞప్తుల ఆధారంగా ఈ తేదీని ఏప్రిల్ 20 వరకు పొడిగించారు. ఫలితంగా ఇవాళ్టితో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తి అవుతుంది. . https://schooledu.telangana.gov.in లింక్ పై క్లిక్ చేసి వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ ప్రాసెస్ చేసుకోవచ్చు. అభ్యర్థులు నిర్ణయించిన ఫీజును ముందుగానే చెల్లించాల్సి ఉంటుంది.
ఇక ఇప్పటికే దరఖాస్తు(Telangana TET 2024) చేసుకున్న అభ్యర్థులకు కూడా అప్డేట్ ఇచ్చింది విద్యాశాఖ. దరఖాస్తుల్లో ఏమైనా తప్పులు చేస్తే వెంటనే సరి చేసుకోవాలని అధికారులు సూచించారు. ఇందుకోసం వెబ్ సైట్ లో ఎడిట్ ఆప్షన్ ను తీసుకువచ్చినట్లు తెలిపారు. ఈ ఆప్షన్ ను ఉపయోగించుకోని వెంటనే ఎడిట్ చేసుకోవాలని… ఈ గడువు కూడా ఏప్రిల్ 20వ తేదీతోనే క్లోజ్ కానుందని స్పష్టం చేశారు. ఒక్కసారి ఎడిట్ చేసి సబ్మిట్ చేస్తే…. మరోసారి ఎడిట్ చేసుకునేందుకు అవకాశం ఉందని వివరించారు.
How to Apply TS TET 2024 : తెలంగాణ టెట్ కు ఇలా అప్లికేషన్ చేసుకోండి
- అర్హత గల అభ్యర్థులు https://schooledu.telangana.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లండి.
- పేమెంట్ ఆప్షన్ పై క్లిక్ చేసి ఫీజును చెల్లించాలి. ఈ ప్రక్రియ పూర్తి అయితేనే అప్లికేషన్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.
- హోంపేజీలో కనిపించే Application Submission అనే లింక్ పై నొక్కాలి. ఇక్కడ మీ వివరాలను నమోదు చేయాలి. సరైన సమాచారం ఇస్తే ఎడిట్ చేసుకోవాల్సిన అవసరం పడదు.
- ఫొటో, సంతకం తప్పనిసరిగా అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.
- అన్ని వివరాలను ఎంట్రీ చేశాక చివర్లో ఉండే సబ్మిట్ బటన్ పై నొక్కితే అప్లికేషన్ ప్రక్రియ పూర్తి అవుతుంది.
- 'Print Application' అనే ఆప్షన్ పై నొక్కితే మీ దరఖాస్తు కాపీనీ డౌన్లోడ్ లేదా ప్రింట్ తీసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ నెంబర్ ను జాగ్రత్తగా ఉంచుకోవాలి. హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకునేందుకు ఈ నెంబర్ ఉపయోగపడుతుంది.