తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Apsara Murder Case: గతంలో ప్రెగ్నెన్సీ..! ఓవైపు ఒత్తిడి.. మరోవైపు పూజారిలో టెన్షన్ - అప్సర కేసులో షాకింగ్ నిజాలివే

Apsara Murder Case: గతంలో ప్రెగ్నెన్సీ..! ఓవైపు ఒత్తిడి.. మరోవైపు పూజారిలో టెన్షన్ - అప్సర కేసులో షాకింగ్ నిజాలివే

09 June 2023, 16:06 IST

    • Apsara Murder Case Updates: పూజారి చేతిలో హత్యకు గురైన అప్సర కేసులో సంచలన విషయాలు బయటికి వస్తున్నాయి. ఇద్దరి మధ్య పరిచయం మొదలు నుంచి హత్య వరకు ఏం జరిగిందనే దానిపై కూపీ లాగుతున్నారు పోలీసులు. ఈ క్రమంలోనే షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి.
అప్సర హత్య కేసులో సంచలన విషయాలు
అప్సర హత్య కేసులో సంచలన విషయాలు

అప్సర హత్య కేసులో సంచలన విషయాలు

Saroornagar Apsara Murder:హైదరాబాద్ లో అప్సర అనే యువతిని పూజారి హత్య చేసిన ఘటన సంచలనంగా మారింది. హత్యకు గల ప్రధాన కారణాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. తనను పెళ్లి చేసుకోవాలని అప్సర సాయికృష్ణపై ఒత్తిడి తీసుకొచ్చిందని.. దీనితో ఈనెల 3న ఆమెను కారులో తీసుకెళ్తున్న క్రమంలోనే హత్య చేసినట్లు పోలీసులు ఇప్పటికే గుర్తించారు. ఈ క్రమంలోనే హత్య వెనక ఉన్న కారణాలపై కూడా ఆరా తీస్తున్నారు పోలీసులు. ఈ నేపథ్యంలో... పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ట్రెండింగ్ వార్తలు

Maoist Kasaraveni Ravi : అస్తమించిన ‘రవి’ - ముగిసిన 33 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం

Warangal : వరంగల్ శివారులో అమానుషం - పసికందును ప్రాణాలతోనే పాతిపెట్టారు..!

TS SET Notification 2024 : తెలంగాణ సెట్ నోటిఫికేషన్ విడుదల - మే 14 నుంచి దరఖాస్తులు, ముఖ్య తేదీలివే

Army Public School Jobs 2024 : బొల్లారం ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో ఉద్యోగాలు - అప్లికేషన్ ప్రాసెస్, ఖాళీల వివరాలివే

గతంలో ప్రెగ్నెన్సీ… సాయికృష్ణపై ఒత్తిడి

తాను ఒక్కడినే అప్సరను హత్య చేశానని పూజారి సాయికృష్ణ ఒప్పుకున్నట్లు సరూర్ నగర్ పోలీసులు తెలిపారు. అయితే యువతికి గతంలోనే ప్రెగ్సెన్సీ వచ్చి అబార్షన్ అయిందనే విషయాన్ని కూడా పోలీసుల వద్ద ప్రస్తావించాడు. ఈ క్రమంలోనే సాయికృష్ణపై తీవ్రమైన ఒత్తిడి తీసుకువచ్చింది అప్సర. ఇదే కాకుండా... ఇతరులతో చనువుగా ఉంటుందన్న కారణం కూడా హత్యకు పురిగొల్పినట్లు విచారణలో ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇక పూజారిగా అందరికి సుపరిచితుడైన సాయికృష్ణ... ఈ వ్యవహరం నుంచి ఎలాగైనా బయటపడాలని భావించాడు. ఈ విషయం బయటికి వస్తే తన పరువుపోతుందని భయపడినట్లు కూడా సమచారం అందుతోంది. భవిష్యత్ పరిణామాలను అంచనా వేసిన తర్వాతే.... సాయికృష్ణ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది.

అక్కయ్య… కోడలంటూ….

ఇక హత్య చేసిన సాయికృష్ణకి సంబంధించిన కీలక విషయాలు తెలిపింది అప్సర తల్లి. తన భర్త కాశీలో ఉన్నాడని.. అప్సరతో కలిసి తాను సరూర్ నగర్ లో నివాసం ఉంటున్నట్లు పేర్కొంది. ఇదే కాలనీలో ఉంటున్న సాయికృష్ణతో అప్సరకు గుడిలో పరిచయం ఏర్పడిందని.. తాము, సాయికృష్ణ వాళ్లు కూడా ఒకే సామాజికవర్గానికి చెందటం కూడా స్నేహానికి దారి తీసిందని చెప్పుకొచ్చారు. సాయికృష్ణ తనను అక్కయ్య అని పిలిచేవాడని, అప్సరను కోడలిగా పిలిచేవాడని వివరించింది. సాయికృష్ణ కుటుంబంతో తమకు ఎలాంటి బంధుత్వం లేదని తేల్చి చెప్పింది. మా ఇంట్లో చాలా సేపు సరదాగా గడిపేవాడని.. భోజనం పెట్టమని కూడా అడిగేవాడంటూ చెప్పుకొచ్చింది. అయితే.. వాళ్లిద్దరి మధ్య ఉన్న సంబంధం గురించి మాత్రం తనకు తెలియదని చెప్పుకొచ్చింది.

ఈ నెల 3వ తేదీన స్నేహితులతో కలిసి కోయంబత్తూర్ వెళ్తున్నానని అప్సర చెప్పి వెళ్లిందని తల్లి వెల్లడించింది. కానీ తనకేందుకో అనుమానం వచ్చి సాయి కృష్ణను ఆరా తీసినట్టు తెలిపింది. అయితే అప్సరను వాళ్ల స్నేహితులతో కలిసి భద్రాచలానికి పంపించానంటూ తనతో చెప్పాడని గుర్తు చేసింది. ఇందుకు సంబంధించిన సీసీ పుటేజీ చూద్దామని చెప్పటంతో కాస్త ఆందోళనగా కనిపించడాన్ని తెలిపింది. మిస్సింగ్ కేసు ఇచ్చామని వివరించింది. అయితే తమతో ఎంతో మంచిగా ఉండే పూజారి సాయికృష్ణ ఇలా చేస్తాడని అస్సలు ఊహించలేదని కన్నీరుమున్నీరు అయింది. ఇక సాయికృష్ణ తండ్రి ఈ ఘటనపై మాట్లాడాడు. తన కుమారుడు చాలా మంచివాడని చెప్పుకొచ్చారు. వారిద్దరి ప్రేమ విషయం తనకు తెలియదన్నారు. తన కొడుకుకి ఇప్పటికే పెళ్లి జరిగి పిల్లలు కూడా ఉన్నారని తెలిపారు.

మొత్తంగా సంచలనంగా మారిన అప్సర కేసును మరింత లోతుగా దర్యాప్తు చేసే పనిలో ఉన్నారు పోలీసులు. అయితే ఈ కేసుకు సంబంధించి మరిన్ని కీలక విషయాలు బయటికి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.