తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Army Public School Jobs 2024 : బొల్లారం ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో ఉద్యోగాలు - అప్లికేషన్ ప్రాసెస్, ఖాళీల వివరాలివే

Army Public School Jobs 2024 : బొల్లారం ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో ఉద్యోగాలు - అప్లికేషన్ ప్రాసెస్, ఖాళీల వివరాలివే

05 May 2024, 6:05 IST

    • APS Bolarum Recruitment 2024 Updates : సికింద్రాబాద్ బొల్లారం ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది.  ఇందులో భాగంగా టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులను భర్తీ చేయనుంది. ఆ వివరాలను ఇక్కడ చూడండి…..
బొల్లారం ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌లో ఉద్యోగాలు
బొల్లారం ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌లో ఉద్యోగాలు (https://www.apsbolarum.edu.in/)

బొల్లారం ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌లో ఉద్యోగాలు

Army Public School Bolarum Recruitment 2024 : టీచింగ్ పోస్టులతో పాటు పలు నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి సికింద్రాబాద్ బొల్లారంలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్(Army Public School Bolarum) ప్రకటన విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు మే 25వ తేదీలోపు దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.

ట్రెండింగ్ వార్తలు

Khammam Crime News : ఖమ్మం జిల్లాలో దారుణం.. ఆస్తి కోసం తల్లితో పాటు ఇద్దరు కుమార్తెల హత్య

TS Govt Jobs 2024 : ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఉద్యోగాలు... రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినెట్ ఖాళీలు, ముఖ్య తేదీలివే

TS EAPCET 2024 Results : తెలంగాణ ఎంసెట్ ఫలితాలు వచ్చేశాయ్ - ఈ డైరెక్ట్ లింక్ తో మీ ర్యాంక్ చెక్ చేసుకోండి

18 May 2024 హైదరాబాద్ వాతావరణం ఎలా ఉంటుంది? పూర్తి సమాచారం తెలుసుకోండి

దరఖాస్తు ఫారమ్ ను వెబ్ సైట్ నుంచి డౌన్లో చేసుకోని… ఆఫ్‌లైన్ విధానంలో సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ లో టీజీటీ, పీజీటీ, హెడ్‌మిస్ట్రెస్‌ (నర్సరీ - యూకేజీ), ప్రీ ప్రైమరీ టీచర్స్‌, అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌, ప్రీ ప్రైమరీ వింగ్‌ (క్లరికల్‌ స్టాఫ్‌, అకౌంట్స్‌ క్లర్క్‌,Adm Supervisor) ఉద్యోగాలను రిక్రూట్ చేయనున్నారు. https://www.apsbolarum.edu.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

ముఖ్య వివరాలు:

  • రిక్రూట్ మెంట్ ప్రకటన - బొల్లారం ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌‌(Army Public School Bolarum), సికింద్రాబాద్.
  • టీజీటీ, పీజీటీ, హెడ్‌మిస్ట్రెస్‌ (నర్సరీ - యూకేజీ), ప్రీ ప్రైమరీ టీచర్స్‌, అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌, ప్రీ ప్రైమరీ వింగ్‌ (clerical staff /Accounts Clerk, Adm Supervisor) ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
  • అర్హతలు - డిగ్రీతో పాటు బీఈడీ, పీజీ ఉండాలి. పోస్టును అనురించి అర్హతలను నిర్ణయించారు. టీచింగ్ ఉద్యోగాలకు టెట్ లేదా సెంట్రల్ టెట్ అర్హత పొంది ఉండాలి. కొన్ని పోస్టులకు కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి.
  • దరఖాస్తు విధానం - ఆఫ్ లైన్
  • దరఖాస్తు రుసుం- రూ.250
  • ఎంపిక విధానం - అనుభవం ఆధారంగా నియామకాలు జరుపుతారు.
  • దరఖాస్తులు ఫారమ్ - https://www.apsbolarum.edu.in/ వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి.
  • పూర్తి చేసిన దరఖాస్తు ఫారమ్ ను ప్రిన్సిపాల్, ఆర్మీ పబ్లిక్ స్కూల్, బొల్లారం, జేజే నగర్ పోస్ట్, సికింద్రాబాద్ - 500087 అడ్రస్ కు పంపాలి.
  • అర్హత పత్రాలను పరిశీలించిన తర్వాత… షార్ట్ లిస్ట్ చేస్తారు. వారిని మాత్రమే ఇంటర్వూలకు పిలుస్తారు. 
  • దరఖాస్తులను అసంపూర్ణంగా నింపితే రిజెక్ట్ చేస్తారు.
  • దరఖాస్తు చివరితేదీ - 25,మే, 2024.

ఈ కింద ఇచ్చిన PDFలో పోస్టుల ఖాళీల వివరాలతో పాటు మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు…

మెడికల్ కాలేజీల్లో ఉద్యోగాలు…

AP Medical Services Recruitment Board Updates : ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ట్యూటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు వివరాలను వెల్లడించింది. వీటిని కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు.

కొత్తగా ప్రారంభించిన అయిదు కళాశాలల్లో 158 ట్యూటర్ పోస్టుల(Tutors posts) భర్తీకి ఈ ప్రకటన జారీ అయింది. అర్హతల కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు మే 15వ తేదీని తుది గడువుగా ప్రకటించారు. https://dme.ap.nic.in వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

  • దరఖాస్తులు - ఆన్ లైన్ లోనే దరఖాస్తు చేసుకోవాలి.
  • దరఖాస్తులు ప్రారంభం - 4 మే 2024.
  • దరఖాస్తులకు తుది గడువు - 15 మే 2024.
  • దరఖాస్తు రుసుం - ఓసీ అభ్యర్థులు రూ. 1000 చెల్లించాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ. 500 చెల్లించాలి.
  • అధికారిక వెబ్ సైట్ - http://dme.ap.nic.in

తదుపరి వ్యాసం