తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Army Recruitment Rally : ఇండియన్ ఆర్మీలో చేరాలనుకుంటున్నారా?

Army Recruitment Rally : ఇండియన్ ఆర్మీలో చేరాలనుకుంటున్నారా?

HT Telugu Desk HT Telugu

01 November 2022, 18:31 IST

    • Indian Army Jobs Update : తెలుగు రాష్ట్రాల నుంచి ఇండియన్ ఆర్మీలో చేరాలనుకునే వారికి గుడ్ న్యూస్. ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో పాల్గొనేందుకు అవకాశం ఉంది.
ఇండియన్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ 2022
ఇండియన్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ 2022

ఇండియన్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ 2022

తెలంగాణ(Telangana), ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) నుంచి ఇండియన్ ఆర్మీ(Indian Army)లో చేరాలి అనుకునేవారి కోసం శుభవార్త. ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో పాల్గొని తమ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు. ఆన్ లైన్ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దేశ సేవ చేయాలనుకునే అర్హత కలిగిన అభ్యర్థులు www.indianarmy.nic.in వెబ్‌సైట్లో ఆన్‌లైన్(Online) ద్వారా అప్లికేషన్ పంపించాలి.

ట్రెండింగ్ వార్తలు

Ganja Smuggling : చింతపండు బస్తాల మాటున గంజాయి రవాణా- గుట్టు రట్టు చేసిన వరంగల్ పోలీసులు

IRCTC Srilanka Tour Package : హైదరాబాద్ నుంచి శ్రీలంక రామాయణ యాత్ర- 5 రోజుల ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలివే!

Mysore Ooty Tour : మైసూర్ టూర్ ప్లాన్ ఉందా..? బడ్డెట్ ధరలోనే ఊటీతో పాటు ఈ ప్రాంతాలను చూడొచ్చు, ఇదిగో ప్యాకేజీ

Maoist Kasaraveni Ravi : అస్తమించిన ‘రవి’ - ముగిసిన 33 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం

ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ(Army Recruitment Rally)లకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అభ్యర్థులు నవంబర్ 15 నుంచి నవంబర్ 29వ తేదీలోపు తమ పేరు నమోదు చేసుకోవాలని డిఫెన్స్ విభాగం తెలిపింది. అభ్యర్థులు www.joinindianarmy.nic.inలో సంబంధిత ర్యాలీ నోటిఫికేషన్‌లో జాబితా చేసిన పత్రాలను తీసుకురావాలని కోరారు.

రిక్రూట్‌మెంట్ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉంటుందని అధికారులు చెప్పారు. అభ్యర్థులు ఎవరైనా ఉత్తీర్ణత సాధించడానికి లేదా నమోదు చేసుకోవడానికి సహాయం చేస్తామని చెప్పే మోసగాళ్ల నుండి తప్పనిసరిగా జాగ్రత్త వహించాలి.

చెన్నై(Chennai)లోని ఇండియన్ ఆర్మీ రిక్రూటింగ్ కార్యాలయం తమిళనాడులోని వేలూరు(Veluru)లోని జిల్లా క్రీడా సముదాయంలో ర్యాలీలను నిర్వహిస్తుంది. అభ్యర్థులను అగ్నివీర్ (పురుషులు), అగ్నివీర్ (మహిళా మిలిటరీ పోలీసులు) ఇతర పోస్టులలో చేర్చుకుంటారు.