తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Indian Army Recruitment : Ncc స్పెషల్ ఎంట్రీ 53వ కోర్సు కోసం దరఖాస్తులకు ఆహ్వానం

Indian Army Recruitment : NCC స్పెషల్ ఎంట్రీ 53వ కోర్సు కోసం దరఖాస్తులకు ఆహ్వానం

19 August 2022, 9:45 IST

    • Indian Army Recruitment 2022 : NCC స్పెషల్ ఎంట్రీ 53వ కోర్సు కోసం కొత్త ఖాళీలు ప్రకటించారు. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్​సైట్​ joinindianarmy.nic.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మరి దీని పేస్కేల్, అర్హత ప్రమాణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 
ఇండియన్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ 2022
ఇండియన్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ 2022

ఇండియన్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ 2022

Indian Army Recruitment 2022 : ఇండియన్ ఆర్మీ NCC స్పెషల్ ఎంట్రీ స్కీమ్ 53వ కోర్సు ఏప్రిల్ 2023 (55 ఖాళీలు) కోసం దరఖాస్తులు స్వీకరిస్తుంది. అవివాహిత పురుష, స్త్రీ అభ్యర్థులను ఆహ్వానిస్తోంది. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ సెప్టెంబర్ 15, 2022. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ joinindianarmy.nic.in ద్వారా అప్లై చేయవచ్చు.

ట్రెండింగ్ వార్తలు

Evening Walk Benefits : వేసవిలో సాయంత్రంపూట నడవండి.. ఆరోగ్య ప్రయోజనాలు పొందండి

Drumstick Chicken Gravy: మునక్కాడలు చికెన్ గ్రేవీ ఇలా చేసి చూడండి, ఆంధ్ర స్టైల్‌లో అదిరిపోతుంది

Bapatla Beach Tour : బాపట్ల టూర్.. తెలంగాణ వాళ్లు బీచ్ చూడాలనుకుంటే.. ఈ ఆప్షన్ బెస్ట్

Besan Laddu Recipe: శనగ పిండితో తొక్కుడు లడ్డూ ఇలా ఇంట్లోనే చేయండి, నెయ్యితో చేస్తే రుచి సూపర్

Indian Army Recruitment 2022 వివరాలు

పోస్ట్: NCC స్పెషల్ ఎంట్రీ స్కీమ్ 53వ కోర్సు (ఏప్రిల్ 2023)

ఖాళీల సంఖ్య: 55 (50 మంది పురుషులు, 05 మంది మహిళలు)

పే స్కేల్: లెవల్ 10

Indian Army Recruitment 2022 అర్హత ప్రమాణాలు

అభ్యర్థి తప్పనిసరిగా గుర్తింపు పొందిన యూనివర్సిటీ డిగ్రీ పొంది ఉండాలి. లేదా కనీసం 50% మార్కులతో సమానమైన డిగ్రీ ఉండాలి. దరఖాస్తుదారులు NCC ‘C’ సర్టిఫికేట్ కచ్చితంగా కలిగి ఉండాలి.

వయోపరిమితి: 19 నుంచి 25 సంవత్సరాలు

దరఖాస్తు ఎలా చేయాలంటే.. ఆసక్తిగల అభ్యర్థులు ఇండియన్ ఆర్మీ వెబ్‌సైట్ www.joinindianarmy.nic.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇండియన్ ఆర్మీ NCC స్పెషల్ ఎంట్రీ 53వ కోర్సు ఏప్రిల్ 2023: ముఖ్యమైన తేదీలు

ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు ప్రారంభ తేదీ: ఆగస్టు 17, 2022

ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ: సెప్టెంబర్ 15, 2022

ఇండియన్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ 2022 ఎంపిక ప్రక్రియ

షార్ట్‌లిస్టింగ్, SSB ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

టాపిక్