తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Indian Army Jobs: పది అర్హతతో సెంట్రల్ కమాండ్ హెడ్‌క్వార్టర్స్‌లో ఉద్యోగాలు!

Indian Army jobs: పది అర్హతతో సెంట్రల్ కమాండ్ హెడ్‌క్వార్టర్స్‌లో ఉద్యోగాలు!

HT Telugu Desk HT Telugu

11 August 2022, 20:58 IST

    • Indian Army Recruitment 2022 : ఇండియన్ ఆర్మీ.. సెంట్రల్ కమాండ్ హెడ్‌క్వార్టర్స్ 96 గ్రూప్ సి పోస్టులను రిక్రూట్ చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తులను పోస్ట్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులు 20 సెప్టెంబర్ 2022లోపు చేరుకోవాలి. 
Indian Army Recruitment 2022 :
Indian Army Recruitment 2022 :

Indian Army Recruitment 2022 :

ఇండియన్ ఆర్మీ సెంట్రల్ కమాండ్ హెడ్‌క్వార్టర్స్ 96 గ్రూప్ సి పోస్టుల రిక్రూట్ కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను కొరుతుంది. ఈ పోస్టులకు దరఖాస్తులను పోస్ట్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులు 20 సెప్టెంబర్ 2022లోపు చేరుకోవాలి. ఖాళీలలో బార్బర్, సఫాయివాలీ చౌకీదార్, ట్రేడ్స్‌మెన్ మేట్ ఖాళీలు ఉన్నాయి. పరీక్ష తేదీ, వేదిక తర్వాత తెలియజేయబడుతుంది.

లక్నో, అలహాబాద్, డెహ్రాడూన్, ఫతేగఢ్, ఫైజాబాద్, మోవ్, రాణిఖేత్, జబల్‌పూర్, గయా, రూర్కీ, వారణాసి, దానాపూర్, మీరట్, నమ్‌కుమ్ వంటి చోట్ల ఈ రిక్రూట్‌మెంట్‌లు జరుగుతాయి.

ఖాళీల వివరాలు: బార్బర్ 12, చౌకీదార్ 21, సఫాయివాలీ 43, ట్రేడ్స్ మన్ మేట్ 16 ఖాళీలు ఉన్నాయి.

అర్హత:10వ తరగతి ఉత్తీర్ణత, సంబంధిత పనిలో ఏడాది అనుభవం.

వయోపరిమితి: 18 నుండి 25 సంవత్సరాలు.

అన్ని రిజర్వేషన్ వర్గాలకు నిబంధనల ప్రకారం సడలింపు లభిస్తుంది.

అవసరమైన పత్రాలతో పాటు దరఖాస్తులను కింది చిరునామకు పంపాలి.

HQ సెంట్రల్ కమాండ్ (BOO-II),

మిలిటరీ హాస్పిటల్ రూర్కీ,

జిల్లా- హరిద్వార్ (ఉత్తరాఖండ్) PIN- 247667

20 సెప్టెంబర్ 2022 నాటికి రిజిస్టర్డ్ పోస్ట్ చేరుకోవాలి.

కమాండెంట్ ఎంహెచ్ రూర్కీ పేరుతో రూ.100 పోస్టల్ ఆర్డర్ కూడా దరఖాస్తుతో జతచేయాల్సి ఉంటుంది. దరఖాస్తుతోపాటు రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలు కూడా పంపాలి. వివరణాత్మక నోటిఫికేషన్‌ను ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ 6 ఆగస్టు - 12 ఆగస్టు పేజీ నంబర్ 34లో చూడవచ్చు.

టాపిక్

తదుపరి వ్యాసం