govt jobs: ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్నారా?వెంటనే ఈ జాబ్స్‌కు అప్లై చేసుకోండి
04 July 2022, 15:43 IST
- Recruitment 2022: ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా?. అయితే మీ విద్యార్హతను బట్టి త్వరలో గడువు ముగియనున్నఈ ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి
govt Recruitment 2022
మీరు ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్నారా? అయితే ఇదే మంచి అవకాశం. ప్రస్తుతం రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతున్న పలు ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇటీవలే అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల కోసం UPSC విడుదల చేసిన నోటిఫికేషన్ల నుండి జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి పలు ప్రభుత్వ ఉద్యోగాల నియమాకాలెంటో ఇప్పుడు చూద్దాం.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ( UPSC ) ఉద్యోగాలు
UPSC Recruitment 2022: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ( UPSC ) రిక్రూట్మెంట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఇతర పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థులను దరఖాస్తు చేసుకోవడానికి ఆహ్వానిస్తుంది. ఆసక్తి గల అభ్యర్థులు upsc.gov.in లోని UPSC అధికారిక సైట్ ద్వారా పోస్ట్‌ల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తుదారులు జూలై 14, 2022 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్ట్ పేరు: అసిస్టెంట్ ప్రొఫెసర్
అధికారిక వెబ్సైట్: upsc.gov.in
గడువు తేదీ: జూలై 14, 2022
బ్యాంక్ ఆఫ్ బరోడా ఉద్యోగాలు
Bank of Baroda Recruitment 2022: బ్యాంక్ ఆఫ్ బరోడా(BOB) Dy పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానించింది. వైస్ ప్రెసిడెంట్ - డేటా సైంటిస్ట్, ఇతర పోస్టుల కోసం ఆసక్తి గల అభ్యర్థులు బ్యాంక్ అధికారిక వెబ్సైట్ bankofbaroda.in ద్వారా పోస్ట్‌ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు
పోస్ట్ పేరు: Dy. వైస్ ప్రెసిడెంట్ - డేటా సైంటిస్ట్
అధికారిక వెబ్సైట్: bankofbaroda.in
గడువు తేదీ: జూలై 07, 2022
ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ( ICF ) రైల్వే ఉద్యోగాలు
ICF Railway Recruitment 2022: : చెన్నైలోని ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ( ICF ) సంబందించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్‌ను ఇటీవలే విడుదలైంది. వివిధ అప్రెంటీస్ పోస్టులకు అభ్యర్థులను నియమించుకుంటారు. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ pb.icf.gov.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు .
పోస్ట్ పేరు: అప్రెంటిస్
అధికారిక వెబ్సైట్: pb.icf.gov.in
గడువు తేదీ: జూలై 26, 2022
సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఉద్యోగాలు
Supreme Court of India Recruitment 2022: భారత సుప్రీంకోర్టు జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానించింది. ఆసక్తి గల అభ్యర్థులు సుప్రీంకోర్టు అధికారిక వెబ్సైట్ sci.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు . రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూలై 10, 2022న ముగుస్తుంది.
పోస్ట్ పేరు: జూనియర్ కోర్ట్ అసిస్టెంట్
అధికారిక వెబ్సైట్: sci.gov.in
గడువు తేదీ: జూలై 10, 2022
టాపిక్