తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Yuvraj Singh On Suryakumar: సూర్యకుమార్‌కు యువీ మద్దతు.. బలంగా తిరిగొస్తాడని స్పష్టం

Yuvraj Singh on Suryakumar: సూర్యకుమార్‌కు యువీ మద్దతు.. బలంగా తిరిగొస్తాడని స్పష్టం

24 March 2023, 22:26 IST

  • Yuvraj Singh on Suryakumar: టీమిండియా స్టార్ ప్లేయర్ సూర్యకుమార్‌ను మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ సపోర్ట్ చేశాడు. ఇటీవల వన్డేల్లో విఫలమైన సూర్య.. తప్పకుండా బలంగా పునరాగమనం చేస్తాడని తెలిపాడు.

సూర్యకుమార్‌కు యువీ సపోర్ట్
సూర్యకుమార్‌కు యువీ సపోర్ట్

సూర్యకుమార్‌కు యువీ సపోర్ట్

Yuvraj Singh on Suryakumar: టీమిండియా క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో ఘోరంగా విఫలమైన సంగతి తెలిసిందే. మూడు మ్యాచ్‌ల్లో మూడు గోల్డెన్ డకౌట్‌గా నిలిచి చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. దీంతో అతడి ఆటపై సర్వత్రా విమర్శలు తలెత్తుతున్నాయి. సూర్యకుమార్ స్థానంలో వేరొకరికి అవకాశమివ్వాలనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. తాజాగా ఈ అంశంపై భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ స్పందించాడు. సూర్యకుమార్‌కు సపోర్టుగా మాట్లడుతూ.. అతడు బలంగా పుంజుకుని వస్తాడని స్పష్టం చేశాడు ఈ మేరకు ట్విటర్ వేదికగా పోస్టు పెట్టాడు.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

"ప్రతి ఆటగాడికి కెరీర్‌లో ఎత్తు, పల్లాలు ఉంటాయి. ఏదోక పాయింట్‌లో మేమంతా వాటన్నింటిని అనుభవించాము. టీమిండియాలో సూర్యకుమార్ చాలా కీలకమైన ఆటగాడని నేను నమ్ముతున్నాను. అతడికి అవకాశాలు ఇస్తే వరల్డ్ కప్‌లో కీలక పాత్ర పోషిస్తాడని అనుకుంటున్నాను. సూర్య మళ్లీ పుంజుకుంటాడు కాబట్టి మన ఆటగాళ్లకు సపోర్ట్ ఇవ్వండి." అని యువరాజ్ సింగ్ తన స్పందనను ట్విటర్ వేదికగా తెలియజేశాడు.

పొట్టి ఫార్మాట్‌లో టాప్ ప్లేయర్‌గా ఉన్న సూర్యకుమార్.. 50 ఓవర్ల గేమ్‌లో మాత్రం తేలిపోయాడు. మూడో వన్డేలో ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆష్టన్ ఆగర్ వేసిన 36వ ఓవర్లో అతడు తను ఎదుర్కొన్న తొలి బంతికే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ముంబయి వేదికగా జరిగిన తొలి వన్డేలో, విశాఖపట్నం వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో మిచెల్ స్టార్క్ ఎల్బీడబ్ల్యూ ట్రాప్‌లో సూర్యకుమార్ ఇరుక్కోగా.. మూడో వన్డేలో మాత్రం ఆష్టన్ అగర్ స్పిన్ మాయాజలానికి పెవిలియన్ చేరాడు.

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో ఘోరంగా విఫలమైన సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం తన దృష్టంతా ఐపీఎల్‌పైనే పెట్టాడు. మార్చి 31 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 2023 కోసం సిద్ధమవుతున్నాడు. ముంబయి ఇండియన్స్ తరఫున అతడు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 2018 నుంచి ముంబయి తరఫున ఆడుతున్న అతడు ఆ జట్టులో కీలక ఆటగాడిగా ఉన్నాడు. రోహిత్ శర్మ ఈ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.