Yuvraj Singh on Rohit Sharma captaincy: రోహిత్‌ కెప్టెన్సీకి పదికి పది మార్కులు ఇచ్చిన యువరాజ్‌-yuvraj singh on rohit sharma captaincy rates him 10 out of 10 ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Yuvraj Singh On Rohit Sharma Captaincy: రోహిత్‌ కెప్టెన్సీకి పదికి పది మార్కులు ఇచ్చిన యువరాజ్‌

Yuvraj Singh on Rohit Sharma captaincy: రోహిత్‌ కెప్టెన్సీకి పదికి పది మార్కులు ఇచ్చిన యువరాజ్‌

Hari Prasad S HT Telugu
Dec 06, 2022 07:13 PM IST

Yuvraj Singh on Rohit Sharma captaincy: రోహిత్‌ కెప్టెన్సీకి పదికి పది మార్కులు ఇచ్చాడు యువరాజ్‌ సింగ్‌. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా వికెట్‌ తేడాతో ఓడిపోయిన తర్వాత యువీ ఇలాంటి రేటింగ్‌ ఇవ్వడం విశేషమే.

రోహిత్ శర్మ, యువరాజ్ సింగ్
రోహిత్ శర్మ, యువరాజ్ సింగ్ (Getty/PTI)

Yuvraj Singh on Rohit Sharma captaincy: టీమిండియా పూర్తిస్థాయి కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ ఇప్పటికే ఏడాది పూర్తి చేసుకున్నాడు. కోహ్లి తప్పుకున్న తర్వాత పగ్గాలు అందుకున్న అతని కెప్టెన్సీలో ఇండియన్‌ టీమ్‌ మంచి విజయాలే సాధించింది. పెద్ద టోర్నీల్లో బోల్తా పడుతుందన్న అపవాదు అలాగే ఉన్నా.. ఓవరాల్‌గా రోహిత్‌ విజయాల శాతం మెరుగ్గా ఉంది.

yearly horoscope entry point

గతేడాది నవంబర్‌లో టీ20, వన్డే టీమ్స్‌ కెప్టెన్‌ అయిన రోహిత్‌.. ఈ ఏడాది మూడు ఫార్మాట్ల కెప్టెన్సీని పూర్తిస్థాయిలో అందుకున్నాడు. అయితే అన్ని సిరీస్‌లకు అతడు అందుబాటులో లేడు. న్యూజిలాండ్‌, వెస్టిండీస్‌, శ్రీలంకలాంటి టీమ్స్‌పై ఇండియా విజయాలు సాధించింది. అయితే ఆసియాకప్, టీ20 వరల్డ్‌కప్‌లలో వైఫల్యం మాత్రం అతన్ని వేధిస్తూనే ఉంది.

తాజాగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి వన్డేలో వికెట్‌ తేడాతో ఓటమి రోహిత్‌ను మరింత కుంగదీసి ఉంటుంది. ఒక దశలో గెలుపు ఖాయం అనుకున్నా.. చివర్లో బౌలర్లు చేతులెత్తేయడంతో ఓటమి తప్పలేదు. దీంతో రోహిత్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌.. రోహిత్ కెప్టెన్సీకి రేటింగ్‌ ఇచ్చాడు.

స్పోర్ట్స్‌కీడా అడిగిన ప్రశ్నకు యువీ స్పందించడం విశేషం. రోహిత్ కెప్టెన్సీకి పదిలో ఎన్ని మార్కులు ఇస్తారు అని ప్రశ్నించగా.. పదికి పది అంటూ ట్విటర్‌లో యువీ సమాధానమిచ్చాడు. అయితే తాజా వైఫల్యాల కంటే రోహిత్‌ ఓవరాల్‌ కెప్టెన్సీని యువీ పరిగణనలోకి తీసుకున్నట్లు అతని ఫలితాలు చూస్తే స్పష్టమవుతుంది.

రోహిత్‌ ఇప్పటి వరకూ అన్ని ఫార్మాట్లలో కలిపి 70 మ్యాచ్‌లలో కెప్టెన్‌గా ఉన్నాడు. అందులో ఇండియా 54 మ్యాచ్‌లు గెలవడం విశేషం. అతని విజయాల శాతం 77.14. వన్డేల్లో 17 మ్యాచ్‌లలో 13 గెలిపించిన ఘనత రోహిత్‌ సొంతం. ఇక టీ20ల్లో అయితే 51 మ్యాచ్‌లలో 39 గెలిచింది. 12 ఓడిపోయింది. అయితే తాజాగా టీ20 వరల్డ్‌కప్‌లో వైఫల్యంతో త్వరలోనే ఈ ఫార్మాట్‌లో కెప్టెన్సీ మార్పు తప్పదనిపిస్తోంది.

Whats_app_banner