తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Where To Watch Wtc Final: హాట్‌స్టార్, స్టార్ స్పోర్ట్స్ లేదా.. డబ్ల్యూటీసీ ఫైనల్ ఇలా ఫ్రీగా చూసేయండి

Where to watch WTC Final: హాట్‌స్టార్, స్టార్ స్పోర్ట్స్ లేదా.. డబ్ల్యూటీసీ ఫైనల్ ఇలా ఫ్రీగా చూసేయండి

Hari Prasad S HT Telugu

07 June 2023, 10:29 IST

    • Where to watch WTC Final: హాట్‌స్టార్, స్టార్ స్పోర్ట్స్ లేదా? మరేం ఫర్వాలేదు. డబ్ల్యూటీసీ ఫైనల్ ఇలా ఫ్రీగా చూసేయండి. ఇండియాలో అభిమానులు ఈ ఫైనల్ ను డీడీ స్పోర్ట్స్ లో ఫ్రీగా చూడొచ్చు.
డబ్ల్యూటీసీ ఫైనల్ విజేతకు ఇచ్చే గదతో రోహిత్ శర్మ, ప్యాట్ కమిన్స్
డబ్ల్యూటీసీ ఫైనల్ విజేతకు ఇచ్చే గదతో రోహిత్ శర్మ, ప్యాట్ కమిన్స్ (PTI)

డబ్ల్యూటీసీ ఫైనల్ విజేతకు ఇచ్చే గదతో రోహిత్ శర్మ, ప్యాట్ కమిన్స్

Where to watch WTC Final: ఇండియా, ఆస్ట్రేలియా మధ్య బుధవారం (జూన్ 7) నుంచి ప్రారంభం కాబోయే డబ్ల్యూటీసీ ఫైనల్ స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్ లలో బ్రాడ్‌కాస్ట్ కానుంది. అయితే ఈ రెండింటికీ మీకు యాక్సెస్ లేదా? మ్యాచ్ ఎలా చూడాలో తెలియక అయోమయానికి గురవుతున్నారా? అయితే ఈ రెండూ లేకపోయినా ఫ్రీగా ఈ మ్యాచ్ చూసే అవకాశం ఉంది.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

ఎందుకంటే ఇండియా, ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ ఫైనల్ ను దూరదర్శన్ కు చెందిన డీడీ స్పోర్ట్స్ ఛానెల్ కూడా ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఐసీసీ రిలీజ్ చేసిన ఓ నోట్ లో ఈ విషయాన్ని వెల్లడించింది. "ఇండియాలో ఇంగ్లిష్ తోపాటు హిందీ, తెలుగు, కన్నడ, తమిళం భాషల్లో స్టార్ స్పోర్ట్స్ లైవ్ కవరేజ్ చేయనుంది. వాళ్ల డిజిటల్ పార్ట్‌నర్ హాట్‌స్టార్ కూడా ఈ మ్యాచ్ ప్రసారం చేస్తుంది. ఇక ఇండియాకు చెందిన పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్ దూరదర్శన్ కూడా తమ డీడీ స్పోర్ట్స్ ఛానెల్ ద్వారా ప్రతి రోజూ లైవ్ ఇస్తుంది" అని ఐసీసీ స్పష్టం చేసింది.

ప్రపంచవ్యాప్తంగా సుమారు 70 కోట్ల మందికి ఈ డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ లైవ్ చేరుతుందని కూడా ఐసీసీ తెలిపింది. ప్రపంచంలోని 100 దేశాల్లో ఈ మ్యాచ్ చూడొచ్చు. రెండేళ్ల కిందట తొలి డబ్ల్యూటీసీ ఫైనల్లోనూ ఇండియన్ టీమ్ న్యూజిలాండ్ తో తలపడిన విషయం తెలిసిందే. అప్పుడు ఆ ఫైనల్ ఓడిపోగా.. ఇప్పుడు ఆస్ట్రేలియాతో మరోసారి తాడోపేడో తేల్చుకోనుంది.

ఈ ఫైనల్ మ్యాచ్ బుధవారం నుంచి ఐదు రోజుల పాటు భారత కాలమానం ప్రకారం ప్రతి రోజూ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతుంది. స్టార్ స్పోర్ట్స్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్, డీడీ స్పోర్ట్స్ లలో ఈ లైవ్ చూడొచ్చు. లండన్ లోని ఓవల్ మైదానంలో ఈ మ్యాచ్ జరుగుతుంది.