తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Vvs Laxman Interim Coach: టీమిండియా తాత్కాలిక హెడ్‌ కోచ్‌గా వీవీఎస్‌ లక్ష్మణ్‌

VVS Laxman Interim Coach: టీమిండియా తాత్కాలిక హెడ్‌ కోచ్‌గా వీవీఎస్‌ లక్ష్మణ్‌

Hari Prasad S HT Telugu

24 August 2022, 19:46 IST

    • VVS Laxman Interim Coach: ఆసియాకప్‌ కోసం దుబాయ్‌ వెళ్లిన టీమిండియాతో చేరాడు ఎన్సీయే డైరెక్టర్‌ వీవీఎస్ లక్ష్మణ్‌. దీంతో ఈ టోర్నీకి ద్రవిడ్‌ స్థానంలో హెడ్‌ కోచ్‌గా లక్ష్మణే ఉండనున్నాడు.
వీవీఎస్ లక్ష్మణ్, రోహిత్ శర్మ (ఫైల్ ఫొటో)
వీవీఎస్ లక్ష్మణ్, రోహిత్ శర్మ (ఫైల్ ఫొటో) (Action Images via Reuters)

వీవీఎస్ లక్ష్మణ్, రోహిత్ శర్మ (ఫైల్ ఫొటో)

VVS Laxman Interim Coach: ఆసియా కప్‌ కోసం ఇండియన్‌ టీమ్‌ హెడ్‌ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్‌ ఉండనున్నాడు. అతడు ఇప్పటికే దుబాయ్‌లో ఉన్న రోహిత్‌ శర్మ సారథ్యంలోని టీమ్‌తో చేరాడు. టీమిండియాతో హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ కరోనా బారిన పడటంతో అతడు టీమ్‌తో కలిసి దుబాయ్‌ వెళ్లలేకపోయాడు. అతడు టోర్నీ ప్రారంభమయ్యే సమయానికి కోలుకునే అవకాశం లేకపోవడంతో లక్ష్మణ్‌కు ఆ బాధ్యతలు అప్పగించినట్లు బీసీసీఐ వెల్లడించింది.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

ఈ మధ్యే ముగిసిన జింబాబ్వే సిరీస్‌కు ద్రవిడ్‌కు విశ్రాంతి ఇవ్వడంతో లక్ష్మణే కోచ్‌ బాధ్యతలు చేపట్టాడు. సిరీస్‌ ముగిసిన తర్వాత హరారె నుంచి కోచ్‌ లక్ష్మణ్‌, ఆసియాకప్‌లో ఉన్న టీమ్‌ సభ్యులు దుబాయ్‌లోనే ఉండిపోగా.. మిగతా వాళ్లు ఇండియాకు వచ్చేశారు. లక్ష్మణ్‌కు బాధ్యతలు అప్పగించడంపై బీసీసీఐ నుంచి బుధవారం సాయంత్రం అధికారిక ప్రకటన వెలువడింది.

"ఎన్సీఏ హెడ్‌గా ఉన్న వీవీఎస్‌ లక్ష్మణ్‌ టీమిండియా తాత్కాలిక హెడ్‌ కోచ్‌గా ఉంటాడు. రానున్న ఆసియా కప్‌ కోసం అతడు బాధ్యతలు తీసుకుంటాడు" అని బీసీసీఐ తన అధికారిక ప్రకటనలో వెల్లడించింది.

ఈ నెల 27 నుంచి సెప్టెంబర్ 11 వరకూ ఆసియాకప్‌ జరగనుంది. ద్రవిడ్‌ ప్రస్తుతం బీసీసీఐ మెడికల్‌ టీమ్ పర్యవేక్షణలో ఉన్నాడని, అతనికి స్వల్ప లక్షణాలు ఉన్నా నెగటివ్‌గా తేలిన తర్వాతే టీమ్‌తో చేరతాడని మంగళవారం ఒక ప్రకటనలో బోర్డు తెలిపింది. అప్పటి వరకూ లక్ష్మణ్‌ టీమ్‌ కోచింగ్‌ బాధ్యతలు చూసుకోనున్నాడు. ఇక బ్యాటింగ్‌, బౌలింగ్‌ కోచ్‌లు విక్రమ్‌ రాథోడ్‌, పరాస్‌ మాంబ్రేలు టీమ్‌తోనే ఉన్నారు.