తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Kohli Tributes To Ronaldo: అభిమాన ఆటగాడి కోసం కోహ్లీ అదిరిపోయే పోస్టు.. అతడు ఆల్ టైమ్ గ్రెటేస్ట్ అంటూ స్పష్టం

Kohli Tributes to Ronaldo: అభిమాన ఆటగాడి కోసం కోహ్లీ అదిరిపోయే పోస్టు.. అతడు ఆల్ టైమ్ గ్రెటేస్ట్ అంటూ స్పష్టం

12 December 2022, 12:34 IST

    • Kohli Tributes to Ronaldo: పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో గురించి విరాట్ కోహ్లీ అదిరిపోయే పోస్టును పెట్టాడు. తన అభిమాన ఆటగాడి కృషిని గుర్తు చేస్తూ.. అతడే తన ఆల్ టైమ్s గ్రేటెస్ట్ ప్లేయరని స్పష్టం చేశాడు.
రొనాల్డో-విరాట్ కోహ్లీ
రొనాల్డో-విరాట్ కోహ్లీ

రొనాల్డో-విరాట్ కోహ్లీ

Kohli Tributes to Ronaldo: ఫుట్‌బాల్ ఆటలో అత్యుత్తమ ఆటగాళ్లలో క్రిస్టియానో రొనాల్డో పేరును అంత సులభంగా మరువలేం. 16 ఏళ్ల తన కెరీర్లోఎన్నో విజయాలను అందుకున్న రొనాల్డోకు ప్రపంచకపప్ లోటు మాత్రం అలాగే ఉండిపోయింది. ఈ సారైన తన దేశమైన పోర్చుగల్‌ను విశ్వవిజేతగా నిలుపుదామని కోరుకున్నాడు. కానీ మొరాకోతో జరిగిన క్వార్టర్ ఫైనల్లోనే ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. దీంతో రొనాల్డో తన ఫుట్‌బాల్ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తాడనే వార్తలు ఊపందుకున్నాయి. ఈ విషయంపై రొనాల్డో కూడా ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ అభిమానులు మాత్రం సోషల్ మీడియా వేదికగా అతడి గురించి ఉవ్వెత్తున పోస్టులను పెడుతున్నారు. తాజాగా టీమండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ కూడా రొనాల్డోపై ప్రశంసలు కురిపిస్తూ అందమైన పోస్టును పెట్టాడు.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

"ఆట కోసం, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానులు కోసం నువ్వు చేసిన కృషి నుంచి ఏ ట్రోఫీ లేదా ఏ టైటిల్ ఏమి తీసిపోదు. ప్రపంచ వ్యాప్తంగా వ్యక్తులపై చూపిన నీ ప్రభావం గురించి ఏ టైటిల్ వివరించలేదు. నీ ఆట దేవుడిచ్చిన గొప్ప బహుమతి. ప్రతీ క్షణం ఎవరైతే మనస్ఫూర్తిగా ఆటను ఆడతారో అదే క్రీడాకారుడికి నిజమైన ప్రేరణ. అది ఆటగాడి అంకితభావం, కృషికి ప్రతిరూపం. మీరు నాకు ఎల్లప్పుడూ గొప్పవారే" అని విరాట్ కోహ్లీ తన పోస్టులో పేర్కొన్నారు.

ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్‌లో మొరాకో చేతిలో ఓడిన పోర్చుగల్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. అనంతరం సోషల్ మీడియా వేదికగా రొనాల్డో తన స్పందనను తెలియజేశాడు. "పోర్చుగల్ కోసం ప్రపంచకప్ గెలవడం నా కెరీర్‌లోనే అతిపెద్ద, అత్యంత ప్రతిష్టాత్మకమైన కల. అదృష్టవశాత్తూ, నేను పోర్చుగల్ సహా అనేక అంతర్జాతీయ టైటిల్‌లను గెలుచుకున్నాను." అని రొనాల్డో తన ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నాడు.

20222 ఫిఫా ప్రపంచకప్‌లో పోర్చుగల్ చివరగా ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ రొనాల్డోకు పెద్దగా ఆడేందుకు అవకాశం రాలేదు. స్విట్జర్లాండ్‌తో జరిగిన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్ సహా క్వార్టర్స్‌లో మొరాకోతో మ్యాచ్‌లోనూ అతడిని చివర్లో ఆడించారు.