తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Virat Kohli T20 World Cup Record: టీ20 వరల్డ్‌కప్‌లో విరాట్ కోహ్లి సరికొత్త రికార్డు

Virat Kohli T20 World Cup Record: టీ20 వరల్డ్‌కప్‌లో విరాట్ కోహ్లి సరికొత్త రికార్డు

Hari Prasad S HT Telugu

02 November 2022, 14:48 IST

    • Virat Kohli T20 World Cup Record: టీ20 వరల్డ్‌కప్‌ చరిత్రలో విరాట్ కోహ్లి సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ మెగా టోర్నీలో ఇప్పుడు అతడు అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు.
టీ20 వరల్డ్ కప్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా విరాట్ కోహ్లి రికార్డు
టీ20 వరల్డ్ కప్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా విరాట్ కోహ్లి రికార్డు (AFP)

టీ20 వరల్డ్ కప్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా విరాట్ కోహ్లి రికార్డు

Virat Kohli T20 World Cup Record: టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మళ్లీ రికార్డుల బాట పట్టాడు. టీ20 వరల్డ్‌కప్‌ తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై విజయంలో కీలకపాత్ర పోషించిన అతడు.. ఆ తర్వాత నెదర్లాండ్స్‌పై కూడా హాఫ్‌ సెంచరీ చేశాడు. ఇప్పుడు బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీ20 వరల్డ్‌కప్‌లలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

ఈ క్రమంలో శ్రీలంక లెజెండరీ బ్యాటర్‌ మహేల జయవర్దనె రికార్డును అధిగమించాడు. బంగ్లాదేశ్‌పై 7వ ఓవర్లో 16 పరుగుల వ్యక్తిగత స్కోరు దగ్గర కోహ్లి ఈ రికార్డు అందుకున్నాడు. ఇన్నాళ్లూ టీ20 వరల్డ్‌కప్‌లో 1016 పరుగులతో జయవర్దనె టాప్‌లో ఉండగా.. ఇప్పుడా రికార్డు కోహ్లి ఖాతాలో చేరింది. మహేల 31 ఇన్నింగ్స్‌లో 1016 రన్స్‌ చేయగా.. విరాట్ కోహ్లి మాత్రం తన 25వ వరల్డ్‌కప్‌ ఇన్నింగ్స్‌లోనే ఈ రికార్డును బ్రేక్‌ చేయడం విశేషం.

2014, 2016 టీ20 వరల్డ్‌కప్‌లలో విరాట్‌ కోహ్లి పరుగుల వరద పారించాడు. ఇక 2014లో కోహ్లి 319 రన్స్‌ చేయడంతో ఇండియా ఫైనల్‌ చేరింది. అయితే ట్రోఫీ ఫైట్‌లో శ్రీలంక చేతుల్లో ఓడింది. ఆ టోర్నీలో అతడే అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌. ఇక 2016లో కోహ్లి అత్యధిక పరుగుల జాబితాలో రెండోస్థానంలో నిలిచాడు. అతడు 273 రన్స్‌ చేశాడు. ఈసారి ఇండియా సెమీఫైనల్‌ వరకూ వెళ్లింది.

తాజాగా టీ20 వరల్డ్‌కప్‌లలో అత్యధిక రన్స్‌ చేసిన బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పిన విరాట్ కోహ్లికి బీసీసీఐ శుభాకాంక్షలు చెప్పింది. ఈసారి వరల్డ్‌కప్‌లో కోహ్లి పాకిస్థాన్‌, నెదర్లాండ్స్‌లపై హాఫ్‌ సెంచరీలు చేశాడు. ముఖ్యంగా పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో అతడు ఆడిన అద్భుతమైన ఇన్నింగ్స్‌ వల్లే అసాధ్యమనుకున్న విజయం ఇండియా సొంతమైంది. ఇక సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో కోహ్లి కేవలం 12 రన్స్‌ చేసి ఔటయ్యాడు.