Mumbai Indians Central Team: ముంబై ఇండియన్స్ సెంట్రల్ టీమ్‌లో జహీర్, జయవర్దనె
Mumbai Indians Central Team: ముంబై ఇండియన్స్ తమ సెంట్రల్ టీమ్‌ను అనౌన్స్ చేసింది. ఈ టీమ్‌లో టీమిండియా మాజీ బౌలర్ జహీర్‌ఖాన్, శ్రీలంక మాజీ ప్లేయర్ జయవర్దనె ఉన్నారు.
Mumbai Indians Central Team: ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీతో సక్సెస్ సాధించిన రిలయెన్స్.. ఇప్పుడు గ్లోబల్ లెవల్లో తన మార్క్ చూపించాలని భావిస్తోంది. ఇప్పటికే సౌతాఫ్రికా, యూఏఈల్లో జరగబోయే లీగ్స్‌లోనూ రెండు టీమ్స్‌ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. వీటికి ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్, ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్ అనే పేర్లు కూడా పెట్టింది.
దీంతో వీటికి తగినట్లుగా ఓ సెంట్రల్ టీమ్ ఏర్పాటు చేయాలని ముంబై ఇండియన్స్ నిర్ణయించింది. వన్ ఫ్యామిలీ నినాదం వినిపించే ముంబై ఇండియన్స్‌లో కొత్తగా రెండు టీమ్స్ చేరడంతో వాటిలోనూ అదే రకమైన వాతావరణం కోసం ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే సెంట్రల్ టీమ్ నిర్ణయం తీసుకుంది. ఈ టీమ్‌లో కొత్త రోల్స్‌లో జహీర్ ఖాన్, మహేల జయవర్దనె కనిపించనున్నారు.
ఈ ఇద్దరూ చాలా సీజన్ల నుంచి ముంబై టీమ్‌తోనే ఉన్నారు. దీంతో ఆ టీమ్ గురించి వీళ్లకు పూర్తి అవగాహన ఉంది. అందువల్ల జయవర్దనెను గ్లోబల్ హెడ్ ఆఫ్ పర్ఫార్మెన్స్‌గా, జహీర్ ఖాన్‌ను గ్లోబల్ హెడ్ ఆఫ్ క్రికెట్ డెవలప్‌మెంట్‌గా ముంబై ఇండియన్స్ నియమించింది. అన్ని టీమ్‌ల హెడ్ కోచ్‌లతో సమన్వయంతో పని చేయడం, వ్యూహాత్మక ప్రణాళికలు రచించడంలాంటి బాధ్యతలు జయవర్దనె చూసుకుంటాడు.
ఇక ప్లేయర్ డెవలప్‌మెంట్, టాలెంట్‌ను గుర్తించడంలాంటి పనులను జహీర్‌ఖాన్‌కు అప్పగించారు. ఈ కొత్త బాధ్యతలతో జహీర్, జయవర్దనె ముంబై ఇండియన్స్‌లో మరింత కీలకపాత్ర పోషించనున్నారు. గ్లోబల్ టీమ్‌లో ఈ ఇద్దరూ ఉండటం చాలా ఆనందంగా ఉందని రిలయెన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ ఛైర్మన్ ఆకాశ్ అంబానీ అన్నారు.
ఐపీఎల్‌లో గత 15 ఏళ్లుగా నిలకడగా రాణిస్తున్న టీమ్‌గా ముంబై ఇండియన్స్ నిలిచింది. ఆ టీమ్ ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచింది. రెండుసార్లు ఛాంపియన్స్ లీగ్ టీ20 టైటిల్స్ గెలిచింది. ఇప్పుడు ఐపీఎల్‌ను దాటి గ్లోబల్ లీగ్స్‌లోనూ తనదైన ముద్ర వేయడానికి ముంబై ఇండియన్స్ సిద్ధమవుతోంది.