MI Capetown and MI Emirates: సౌతాఫ్రికా, యూఏఈ లీగ్స్‌లో ముంబై ఇండియన్స్ టీమ్స్ ఇవే
MI Capetown and MI Emirates: ఐపీఎల్ ఫ్రాంఛైజీ ముంబై ఇండియన్స్ తన రెండు కొత్త టీమ్స్ పేర్లు, బ్రాండ్లను బుధవారం (ఆగస్ట్ 10) రివీల్ చేసింది. ఈ ఫ్రాంఛైజీ సౌతాఫ్రికా, యూఏఈ లీగ్స్‌లో టీమ్స్ కొన్న విషయం తెలిసిందే.
ముంబై: ఐపీఎల్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్ ముంబై ఇండియన్స్. ఎవరికీ సాధ్యం కాని రీతిలో ఐదుసార్లు ఈ మెగా లీగ్ టైటిల్ గెలిచింది. రిలయెన్స్ అధినేత ముకేశ్ అంబానీకి చెందిన ఈ టీమ్.. 2022 ఐపీఎల్‌లో విఫలమైనా దీని బ్రాండ్ వాల్యూ మాత్రం ఓ రేంజ్‌లో ఉంది. అయితే తాజాగా ఈ ఫ్రాంఛైజీ అటు సౌతాఫ్రికా, ఇటు యూఏఈల్లో జరగబోయే టీ20 లీగ్స్‌లోని టీమ్స్‌నూ కొనుగోలు చేసింది.

ఈ టీమ్స్ పేర్లను బుధవారం (ఆగస్ట్ 10) రివీల్ చేసింది. క్రికెట్ సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో కొనుగోలు చేసిన టీమ్‌కు ఎంఐ కేప్‌టౌన్(MI Capetown)గా, యూఏఈలో జరిగే ఇంటర్నేషనల్ లీగ్ టీ20లో కొన్న టీమ్‌కు ఎంఐ ఎమిరేట్స్(MI Emirates) అనే పేర్లు పెట్టింది. వీటికి సంబంధించి కొన్ని వీడియోలను కూడా తన ట్విటర్‌లో పోస్ట్ చేసింది.
మా ఫ్యామిలీలోకి కొత్తగా వచ్చిన ఎంఐ ఎమిరేట్స్, ఎంఐ కేప్‌టౌన్‌లకు వెల్‌కమ్ చెప్పడానికి సంతోషిస్తున్నాను అని రిలయెన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ నీతా అంబానీ అన్నారు. తమ వరకూ ముంబై ఇండియన్స్ అంటే క్రికెట్‌కు మాత్రమే పరిమితం కాదని, జీవితంలో ఓ సానుకూల దృక్పథం, కలలు కనే సామర్థ్యానికి చిహ్నంగా నిలుస్తుందని ఆమె చెప్పారు. రెండు కొత్త టీమ్స్ కూడా ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు.