తెలుగు న్యూస్  /  Sports  /  Ugly Fight Broke Out Between Afghan And Pak Players And Fans During And After The Match

Pak vs Afg Ugly Fight: ఆఫ్ఘన్‌ ప్లేయర్‌ను బ్యాట్‌తో కొట్టబోయిన పాక్‌ బ్యాటర్‌.. కొట్టుకున్న ఫ్యాన్స్‌

Hari Prasad S HT Telugu

08 September 2022, 10:41 IST

    • Pak vs Afg Ugly Fight: ఆఫ్ఘన్‌ బౌలర్‌ను బ్యాట్‌తో కొట్టబోయాడు పాకిస్థాన్‌ బ్యాటర్‌ ఆసిఫ్‌ అలీ. అటు ఈ మ్యాచ్‌ తర్వాత ఆఫ్ఘన్‌, పాక్‌ అభిమానులు కూడా స్టేడియంలోనే కొట్టుకున్నారు.
ఆసిఫ్ అలీ, ఫరీద్ అహ్మద్ మధ్య ఫైట్
ఆసిఫ్ అలీ, ఫరీద్ అహ్మద్ మధ్య ఫైట్ (Twitter)

ఆసిఫ్ అలీ, ఫరీద్ అహ్మద్ మధ్య ఫైట్

Pak vs Afg Ugly Fight: ఆసియా కప్‌లో భాగంగా బుధవారం (సెప్టెంబర్‌ 7) పాకిస్థాన్‌, ఆఫ్ఘనిస్థాన్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో కొన్ని ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఫీల్డ్‌లో ప్లేయర్స్ అదుపు తప్పారు. స్టాండ్స్‌లో అభిమానులు రెచ్చిపోయారు. ఈ లోస్కోరింగ్‌ థ్రిల్లర్‌లో చివరికి పాకిస్థాన్‌ ఒక్క వికెట్‌తో గెలిచి ఫైనల్‌ చేరిన విషయం తెలిసిందే.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

పాక్‌ గెలుపుతో ఇటు ఆఫ్ఘనిస్థాన్‌, అటు ఇండియా రెండూ ఇంటిదారి పట్టాయి. పాక్‌ 11వ నంబర్‌ బ్యాటర్‌ నసీమ్‌ షా కొట్టిన రెండు అద్భుతమైన సిక్స్‌లతో పాక్‌ అనూహ్యం విజయం సాధించింది. అయితే అంతకుముందు పాక్‌ బ్యాటర్‌ ఆసిఫ్‌ అలీని ఔట్‌ చేసిన ఆనందంలో ఆఫ్ఘన్‌ బౌలర్‌ ఫరీద్‌ అహ్మద్‌ కాస్త ఎక్కువగానే సంబరాలు చేసుకున్నాడు.

ఆసిఫ్‌ అలీ ముందుకు వెళ్లి విజయనాదం చేశాడు. దీంతో ఆసిఫ్‌ అదుపు తప్పాడు. తన చేత్తో ఫరీద్‌ను వెనక్కి నెట్టాడు. ఆ తర్వాత ఫరీద్‌ ఏదో అనడంతో అతన్ని ఏకంగా బ్యాట్‌తో కొట్టబోయాడు. ఈ లోపు మిగతా ఆఫ్ఘన్‌ ప్లేయర్స్‌, అంపైర్లు వచ్చి వాళ్లను సముదాయించారు. ఆసిఫ్‌ అలీ పెవిలియన్‌కు వెళ్లిపోయాడు. ఆ సమయంలో అది కీలకమైన వికెట్‌ కావడంతో ఫరీద్‌ ఆవేషంగా ఆసిఫ్‌పైకి దూసుకెళ్లడంతో ఈ గొడవ జరిగింది.

ఫీల్డ్‌లో ప్లేయర్స్‌ మధ్య గొడవ ఇలా ఉంటే.. ఫీల్డ్‌ బయట స్టాండ్స్‌లో మ్యాచ్‌ తర్వాత ఆఫ్ఘనిస్థాన్‌ అభిమానులు వీరంగం సృష్టించారు. స్టేడియాన్ని ధ్వంసం చేశారు. కుర్చీలను పాకిస్థాన్‌ అభిమానులపైకి విసిరారు. కచ్చితంగా ఆఫ్ఘన్‌ గెలుస్తుందనుకున్న పరిస్థితుల్లో చివర్లో రెండు సిక్స్‌లు ఆఫ్ఘన్ అభిమానులకు షాకిచ్చాయి. దీంతో వాళ్ల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పాక్‌ ఫ్యాన్స్‌పైకి కుర్చీలు విసిరారు.

<p>స్టేడియంలో కొట్టుకుంటున్న పాక్, ఆఫ్ఘన్ అభిమానులు</p>

స్టేడియం బయటకు వచ్చిన తర్వాత కూడా రెండు జట్ల అభిమానులు కొట్టుకున్నారు. ఈ ఓటమిని ఆఫ్ఘన్‌ ఫ్యాన్స్‌ జీర్ణించుకోలేకపోయారు. ఫీల్డ్‌లో ప్లేయర్స్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితులను చూసిన అభిమానులు.. మ్యాచ్‌ తర్వాత మాటామాటా అనుకొని చివరికి కొట్టుకునేదాకా వెళ్లారు. ప్రస్తుతం ఈ వీడియోలో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. స్టేడియం అంతా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కుర్చీలను ఊడబీకి పాక్‌ ఫ్యాన్స్‌పైకి విసురుతుంటే.. వాటి నుంచి తప్పించుకోవడానికి పాక్‌ అభిమానులు ప్రయత్నించారు.

ఆఫ్ఘనిస్థాన్‌, పాకిస్థాన్‌ మధ్య జరిగిన ఆసియా కప్‌ సూపర్‌ 4 మ్యాచ్‌ ఎన్నో మలుపులు తిరుగుతూ ఎంతో ఉత్కంఠ రేపింది. చివరికి పాక్‌ వికెట్‌ తేడాతో గెలిచింది. చివరి ఓవర్లో విజయానికి 11 రన్స్ అవసరం కాగా.. తొలి రెండు బంతులకు నసీమ్‌ షా రెండు సిక్స్‌లు బాదాడు. ఈ ఊహించని పరిణామంతో ఆఫ్ఘన్‌ ప్లేయర్స్‌ గ్రౌండ్‌లోనే కుప్పకూలిపోయారు. కొందరు ఏడుస్తూ కనిపించారు.

టాపిక్