తెలుగు న్యూస్  /  Sports  /  Team India Asks Virat Kohli To Lodge Official Complaint, His Answer Is Stunning

Virat Kohli about Hotel Incident: హోటెల్ ఘటనపై ఫిర్యాదు చేయడంపై కోహ్లీ క్లారిటీ.. ఏమన్నాడంటే?

01 November 2022, 12:15 IST

    • Virat Kohli about Hotel Incident: టీమిండియా మాజీ క్రికెటర్ విరాట్ కోహ్లీ హోటెల్ రూమ్ వివాదం ఇటీవల కాలంలో చర్చనీయాంశమైంది. తాజాగా ఈ వీడియోను తిరిగి షేర్ చేస్తూ.. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు విరాట్.
విరాట్ కోహ్లీ
విరాట్ కోహ్లీ (AP)

విరాట్ కోహ్లీ

Virat Kohli about Hotel Incident: క్రికెటర్లు, సినీ ప్రముఖులపైనే అందరి కళ్లు ఉంటాయనే విషయం అందరికీ తెలిసిందే. వాళ్లు ఎక్కడకు వెళ్తే అక్కడు వెళ్లడం, కొన్నిసార్లు శృతి మించి అభిమానులు ప్రవర్తించడం లాంటి కారణాల వల్ల సదరు సెలబ్రెటీలు కూడా ఇబ్బందికి గురైన విషయం తెలిసిందే. తాజాగా టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ కూడా ఇలాంటి ఇబ్బందికే గురయ్యాడు. అనుమతి లేకుండా తను ఉంటున్న హోటెల్ రూమ్‌కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో కోహ్లీ అసహనం వ్యక్తం చేశాడు. ఇటీవల ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ కావడంతో మరోసారి ఆ వీడియోను షేర్ చేస్తూ.. తన అసంతృప్తిని తెలియజేశాడు. ఎంత అభిమానమున్నా ఎవరి వ్యక్తిగత గోప్యానికి ఇబ్బంది కలగకూడదంటూ తన పోస్టులో పేర్కొన్నారు.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

"అభిమానులు తమకిష్టమైన ఆటగాళ్లను చూసి సంతోషపడటం, ఉత్సాహపడతారని నేను అర్థం చేసుకున్నాను. నేను ఆ విషయాన్ని ఎల్లప్పుడూ అభినందిస్తున్నాను. కానీ ఇక్కడ ఈ వీడియో దారుణంగా ఉంది. ఇది నా గోప్యత గురించి నాకు చాలా మతిస్థిమితం లేని అనుభూతిని కలిగించింది. నేను నా సొంత హోటెల్ రూంపో ప్రైవసీని కలిగి లేకపోతే.. నేను నిజంగా వ్యక్తిగత పరిధిని ఎక్కడ ఆశించగలను? ఈ రకమైన మతోన్మాదం, గోప్యతను గౌరవించండి. వారిని వినోదం కోసం వస్తువుగా పరిగణించవద్దు." అని అన్నారు.

"ఈ చర్యపై సదరు హోటెల్ యాజమాన్యం కూడా విరాట్‌కు క్షమాపణలు చెప్పింది. ఈ సంగటన జరిగినందుకు మేము చాలా నిరుత్సాహానికి గురయ్యాం. మా అతిథికి మేము నిస్సందేహంగా క్షమాణపలు కోరుతున్నాం. ఇందుకు తగిన చర్యలను ఇప్పుడే ప్రారంభిస్తాం. క్రౌన్ వెంటనే చర్యలు తీసుకుంది. విచారణ ప్రారంభించడం, పాల్గొన్న వ్యక్తులను నిలదీయడం క్రౌన్ నుంచి తొలగించడం లాంటి సమస్యలను సరిదిద్దుతున్నాం." అని తెలిపారు.

ఈ ఘటనపై అధికారిక ఫిర్యాదు చేస్తారా? అని కోహ్లీని జట్టు మేనేజ్మెంట్ అడుగ్గా.. ఈ విషయాన్ని మరింత ముందుకు కోహ్లీ తీసుకు వెళ్లదలచకోలేదని మీడియా వర్గాల సమాచారం. ఈ సమస్య ముందుకు సాగడం వల్ల ఫలితం లేదని రన్నింగ్ మెషిన్ భావించాడట.

టాపిక్