తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ganguly Bold Statements On T20 Wc: వరల్డ్ కప్‌లో భారత జట్టు ప్రదర్శనపై గంగూలీ షాకింగ్ కామెంట్స్.. ఏమన్నాడంటే?

Ganguly Bold Statements on T20 WC: వరల్డ్ కప్‌లో భారత జట్టు ప్రదర్శనపై గంగూలీ షాకింగ్ కామెంట్స్.. ఏమన్నాడంటే?

01 November 2022, 9:38 IST

    • Ganguly Bold Statements on T20 WC: టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా ప్రదర్శనపై బీసీసీఐ అధ్యక్షులు సౌరవ్ గంగూలీ స్పందించారు. బెంగాల్ క్రికెట్ అసొసియేషన్ వార్షిక సమావేశంలో మాట్లాడిన ఆయన టీమిండియా ఫైనల్‌కు చేరేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
సౌరవ్ గంగూలీ
సౌరవ్ గంగూలీ (PTI)

సౌరవ్ గంగూలీ

Ganguly Bold Statements on T20 WC: ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించి.. ఆదివారం నాడు దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో మ్యాచ్‌లో ఓటమి పాలైన విషయం తెలిసిందే. దీంతో జట్టులో ప్రధాన సమస్యలపై అందరి దృష్టి మళ్లింది. ముఖ్యంగా జట్టు కూర్పు విషయంలో మాజీల నుంచి విమర్శలు తలెత్తుతున్నాయి. తాజాగా ఈ విషయంపై బీసీసీఐ మాజీ అధ్యక్షులు సౌరవ్ గంగూలీ స్పందించారు. బెంగాల్ క్రికెట్ అసొసియేషన్ వార్షిక సమావేశానికి హాజరైన ఆయన.. టీ20 వరల్డ్ కప్‌లో భారత్ ఫైనల్ అవకాశాలు, తదితర విషయాలపై మాట్లాడారు.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

"ఇండియా ఒక్క మ్యాచ్‌లోనే ఓడింది. నాకు తెలిసి తప్పకుండా సెమీస్‌కు అర్హత సాధిస్తుందని నేను ఆసిస్తున్నాను. ప్రతి ఒక్కరూ బాగా ఆడుతున్నారు. భారత్.. ఫైనల్‌ వరకు వెళ్తుందని ఆశిస్తున్నాను. ముందు వారిని సెమీస్‌కు క్వాలిఫై కానివ్వండి. చివరి రెండు మ్యాచ్‌ల్లో సత్తా చాటుతారని ఆశిస్తున్నాను. చివరి వరకు ఏదైనా జరిగే అవకాశముంది." అని గంగూలి స్పష్టం చేశారు.

బెంగాల్ క్రికెట్ అసొసియేషన్‌కు(CAB) ప్రస్తుతం నేతృత్వం వహిస్తున్న తన సోదరుడు స్నేహాశిష్‌కు దాదా శుభాకాంక్షలు చెప్పారు. "అక్టోబరు 31 నుంచి ఆయన ఆ బాధ్యతలు స్వీకరించారు.

"బెంగాల్ క్రికెట్ అసొసియేషన్‌కు నాయకత్వం వహించే కొత్త బృందానికి శుభాకాంక్షలు. ఇక్కడ ఉన్నవారంతా అనుభవజ్ఞులు. మంచి చేస్తారని ఆశిస్తున్నా. నేను వారికి ఎలాంటి సూచనలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏం చేయాలో ఆటగాళ్లకు తెలుసు." అని బీసీసీఐ మాజీ ఛీఫ్ స్పష్టం చేశారు.

షమీ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో భారత క్రికెట్ జట్టుతో ఉన్నాడు. ఈ అనుభవజ్ఞుడైన పేసర్‌ ఓపెనింగ్‌లో పాకిస్థాన్‌పై విజయం సాధించగా, నెదర్లాండ్స్‌పై మరో వికెట్ సాధించాడు. అతను దక్షిణాఫ్రికాతో జరిగిన ఓటమి సమయంలో భారతదేశం యొక్క అత్యుత్తమ బౌలర్, నాలుగు ఓవర్లలో ఒక వికెట్ తీసి 13 పరుగులు ఇచ్చాడు. గంగూలీ ఇటీవలే అక్టోబర్ 18న ముంబైలో బీసీసీఐ చీఫ్ పదవికి రాజీనామా చేశారు. రోజర్ బిన్నీ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

తదుపరి వ్యాసం