తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Chetan Sharma On Rohit And Virat: వచ్చే వరల్డ్‌కప్‌కు రోహిత్‌, విరాట్ టీమ్‌లో ఉంటారా.. చీఫ్‌ సెలక్టర్‌ మాట ఇదీ!

Chetan Sharma on Rohit and Virat: వచ్చే వరల్డ్‌కప్‌కు రోహిత్‌, విరాట్ టీమ్‌లో ఉంటారా.. చీఫ్‌ సెలక్టర్‌ మాట ఇదీ!

Hari Prasad S HT Telugu

31 October 2022, 21:48 IST

    • Chetan Sharma on Rohit and Virat: వచ్చే టీ20 వరల్డ్‌కప్‌కు రోహిత్‌, విరాట్ టీమ్‌లో ఉంటారా లేదా? ఈ వరల్డ్‌కప్‌ తర్వాత ఈ ఇద్దరూ టీ20ల నుంచి రిటైరయ్యే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో చీఫ్‌ సెలక్టర్‌ చేతన్‌ శర్మ వీళ్ల టీ20 భవిష్యత్తుపై స్పందించాడు.
రోహిత్, కార్తీక్, విరాట్ టీ20 భవిష్యత్తుపై స్పందించిన చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ
రోహిత్, కార్తీక్, విరాట్ టీ20 భవిష్యత్తుపై స్పందించిన చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ (AP)

రోహిత్, కార్తీక్, విరాట్ టీ20 భవిష్యత్తుపై స్పందించిన చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ

Chetan Sharma on Rohit and Virat: టీ20 ఫార్మాట్‌ యంగ్‌ ప్లేయర్స్‌ కోసమే అన్నది సాధారణంగా క్రికెట్‌ వర్గాల్లో ఉండే ఓ అభిప్రాయం. ఎంతటి గొప్ప ప్లేయర్‌ అయినా సరే ఈ ఫార్మాట్‌లో కాస్త వయసు మీద పడిందంటే మరో యువ ప్లేయర్‌ కోసం తప్పుకోవాల్సిందే. ఈ నేపథ్యంలో టీమిండియాలోనూ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిల టీ20 భవిష్యత్తుపై చర్చ జరుగుతోంది.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

ఈ ఇద్దరు సీనియర్‌ ప్లేయర్స్‌ ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్‌కప్ తర్వాత టీ20ల నుంచి తప్పుకొని కేవలం టెస్టులు, వన్డేల్లోనే కొనసాగే అవకాశం ఉందన్న వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం (అక్టోబర్‌ 31) న్యూజిలాండ్‌, బంగ్లాదేశ్‌ టూర్‌లకు జట్లను ఎంపిక చేసిన తర్వాత చీఫ్‌ సెలక్టర్‌ చేతన్‌ శర్మ దీనిపై స్పందించాడు. వాళ్ల టీ20 భవిష్యత్తుపై తాను రోహిత్‌, విరాట్‌, భువనేశ్వర్‌, అశ్విన్‌లతో మాట్లాడలేదని స్పష్టం చేశాడు.

ఈ ఏడాది వరల్డ్‌కప్‌ ముగిసిన తర్వాత మరో టీ20 వరల్డ్‌కప్‌ 2024లో జరుగుతుంది. ఇప్పటికే రోహిత్ 35, విరాట్‌ 33 ఏళ్లు ఉన్నారు. తర్వాతి వరల్డ్‌కప్‌ సమయానికి వీళ్లకు యువకుల నుంచి పోటీ తప్పదు. ఈ నేపథ్యంలో వీళ్ల టీ20 భవిష్యత్తుపై చర్చ జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో చేతన్‌ శర్మ స్పందిస్తూ.. అలాంటిదేమైనా ఉంటే ప్లేయర్సే మేనేజ్‌మెంట్‌కు చెబుతారని, ప్రస్తుతం మెగా టోర్నీ మధ్యలో తాను ఇలాంటి విషయంపై వాళ్లతో ఎలా మాట్లాడతానని అన్నాడు.

"టోర్నమెంట్‌ మధ్యలో సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌ ఎవరితో అయినా ఎలా మాట్లాడతాడు? టోర్నీ మధ్యలో నేను ఎవరితోనూ మాట్లాడను. వాళ్లు పెద్ద ప్లేయర్స్‌. ఒకవేళ వాళ్లకు అలాంటిదేమైనా అనిపిస్తే వాళ్లే నా దగ్గరికి వచ్చి మాట్లాడతారు. ఈ ప్లేయర్స్‌ టీమ్‌లో ఉంటే యువకులు వాళ్ల నుంచి ఎంతో నేర్చుకుంటారు. అందుకే టోర్నీ మధ్య వాళ్లతో నేను ఇలాంటి విషయాలు చర్చించను" అని చేతన్‌ శర్మ స్పష్టం చేశాడు.

ఇక టీ20 ఫార్మాట్‌లో అనుభవజ్ఞులు ఉండాలని కూడా అన్నాడు. "ఎవరికీ ఎప్పుడూ క్రికెట్‌ తలుపులు మూయడం జరగదు. పోటీలో ఉన్నప్పుడు వయసు కేవలం ఓ అంకె మాత్రమే అవుతుంది. మంచి ప్రదర్శన ఇవ్వగలిగే పరిస్థితుల్లో ఉంటే అనుభవజ్ఞులను ఎంపిక చేయడానికి సెలక్టర్లు ఎప్పుడూ సంతోషిస్తారు" అని చేతన్‌ స్పష్టం చేశాడు. అటు మరో సీనియర్‌ ప్లేయర్‌ దినేష్‌ కార్తీక్ గురించి కూడా చేతన్‌ స్పందించాడు. టీ20 వరల్డ్‌కప్‌ తర్వాత కూడా అతన్ని టీమ్‌ ఎంపికలో పరిగణనలోకి తీసుకుంటామని చెప్పాడు. ప్రస్తుతానికి న్యూజిలాండ్‌ టూర్‌కు అతనికి విశ్రాంతినిచ్చినట్లు తెలిపాడు.