India tour of Bangladesh: జడేజా వచ్చేశాడు.. విహారి ఔట్‌.. బంగ్లాదేశ్‌ టూర్‌కు టీమిండియా-india tour of bangladesh as ravindra jadeja returned and vihari out of the team ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  India Tour Of Bangladesh As Ravindra Jadeja Returned And Vihari Out Of The Team

India tour of Bangladesh: జడేజా వచ్చేశాడు.. విహారి ఔట్‌.. బంగ్లాదేశ్‌ టూర్‌కు టీమిండియా

Hari Prasad S HT Telugu
Oct 31, 2022 08:13 PM IST

India tour of Bangladesh: జడేజా వచ్చేశాడు. బంగ్లాదేశ్‌ టూర్‌కు ప్రకటించిన టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. మరోవైపు ఆంధ్రా బ్యాటర్‌ హనుమ విహారికి టెస్ట్‌ టీమ్‌లో చోటు దక్కలేదు.

బంగ్లాదేశ్ తో వన్డే, టెస్ట్ సిరీస్ లకు తిరిగి వచ్చిన రవీంద్ర జడేజా
బంగ్లాదేశ్ తో వన్డే, టెస్ట్ సిరీస్ లకు తిరిగి వచ్చిన రవీంద్ర జడేజా (REUTERS)

India tour of Bangladesh: బంగ్లాదేశ్‌ టూర్‌కు వెళ్లే టెస్ట్‌, వన్డే టీమ్స్‌ను సోమవారం (అక్టోబర్‌ 31) బీసీసీఐ సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ ప్రకటించింది. న్యూజిలాండ్‌ టూర్‌కు విశ్రాంతి పొందిన కెప్టెన్‌ రోహిత్‌, వైస్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ ఈ టూర్‌కు తిరిగి రానున్నారు. ఇక మోకాలి గాయం కారణంగా వరల్డ్‌కప్‌కు కూడా దూరమైన ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా ఈ టీమ్‌లో చోటు దక్కించుకున్నాడు.

ట్రెండింగ్ వార్తలు

ఇక వరల్డ్‌కప్‌ ముగియగానే న్యూజిలాండ్‌ టూర్‌కు వెళ్లనున్న హార్దిక్‌ పాండ్యా, సూర్యకుమార్‌లకు రెస్ట్‌ ఇచ్చారు. వన్డే టీమ్‌లోకి రజత్ పటీదార్‌, యశ్‌ దయాల్‌ తొలిసారి వచ్చారు. ఆంధ్రా బ్యాటర్‌, చాన్నాళ్లుగా టెస్ట్‌ టీమ్‌ మిడిలార్డర్‌లో ఉన్న హనుమ విహారికి ఈసారి చోటు దక్కలేదు. అటు దేశవాళీ క్రికెట్‌లో టాప్‌ ఫామ్‌లో ఉన్న పృథ్వీ షా, సర్ఫరాజ్‌ ఖాన్‌లకు కూడా టీమ్‌లో చోటు దక్కలేదు.

ఈ విషయాన్ని చీఫ్‌ సెలక్టర్‌ చేతన్‌ శర్మను అడగగా.. వాళ్లకు తగిన సమయంలో అవకాశమిస్తామని చెప్పాడు. అటు సీనియర్‌ బ్యాటర్‌ అజింక్య రహానేకు ఈ సారి కూడా సెలక్టర్లు అవకాశం ఇవ్వలేదు. పుజారా మాత్రం చోటు దక్కించుకున్నాడు. 2015 తర్వాత బంగ్లాదేశ్‌లో టీమిండియా పర్యటించనుంది.

డిసెంబర్‌ 4 నుంచి డిసెంబర్‌ 26 వరకూ బంగ్లాదేశ్‌లో ఇండియా పర్యటించనుంది. డిసెంబర్‌ 4, 7, 10 తేదీల్లో మూడు వన్డేలు జరుగుతాయి. ఆ తర్వాత డిసెంబర్‌ 14 నుంచి 18 వరకూ తొలి టెస్ట్‌, డిసెంబర్ 22 నుంచి 26 వరకూ రెండో టెస్ట్‌ జరుగుతుంది.

బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌కు టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌ (వైస్‌ కెప్టెన్‌), విరాట్‌ కోహ్లి, ఇషాన్‌ కిషన్‌, రజత్‌ పటీదార్‌, రాహుల్‌ త్రిపాఠి, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, వాషింగ్టన్ సుందర్, మహ్మద్‌ షమి, మహ్మద్‌ సిరాజ్, యశ్‌ దయాల్‌, దీపక్‌ చహర్‌, శార్దూల్‌ ఠాకూర్‌, శిఖర్‌ ధావన్‌, రిషబ్‌ పంత్‌

బంగ్లాదేశ్‌తో టెస్ట్‌లకు టీమిండియా: రోహిత్‌, రాహుల్‌, శుభ్‌మన్‌ గిల్‌, పుజారా, విరాట్ కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌, రిషబ్‌ పంత్‌, కేఎస్‌ భరత్‌, ఆర్‌ అశ్విన్, జడేజా, అక్షర్‌ పటేల్‌, కుల్దీప్‌ యాదవ్‌, మహ్మద్‌ షమి, సిరాజ్‌, ఉమేష్‌ యాదవ్‌, శార్దూల్‌ ఠాకూర్‌

WhatsApp channel