తెలుగు న్యూస్  /  Sports  /  Syed Kirmani Says If Someone Else In Kohli Place He Would Have Been Dropped From Team

Virat Kohli: కోహ్లీ స్థానంలో ఏ ఆటగాడున్నా జట్టు నుంచి తప్పించేవాళ్లు: కిర్మాణీ

20 July 2022, 7:56 IST

    • విరాట్ కోహ్లీ ఫామ్‌పై 1983 ప్రపంచకప్ సభ్యుడు, మాజీ క్రికెటర్ సయ్యద్ కిర్మాణీ స్పందించారు. కోహ్లీ స్థానంలో ఇంకో ఆటగడు ఉన్నట్లయితే ఇప్పటికే అతడిని జట్టు నుంచి తప్పించేవారని స్పష్టం చేశారు.
విరాట్ కోహ్లీ
విరాట్ కోహ్లీ (Action Images via Reuters)

విరాట్ కోహ్లీ

విరాట్ కోహ్లీ ఫామ్ గత కొన్నేళ్లుగా పేలవంగా సాగుతున్న సంగతి తెలిసిందే. గతేడాది వరకు విరాట్ సెంచరీ చేయలేదనే ఫిర్యాదు చేశారు. ఇప్పుడు కనీసం అర్ధశతకం కూడా చేయలేక ఇబ్బంది పడుతున్నాడు మన రన్నింగ్ మెషిన్‌. ఇంగ్లాండ్ పర్యటనలో కోహ్లీ ఆడిన ఆరు ఇన్నింగ్స్‌లో అతడి అత్యధిక వ్యక్తిగత స్కోరు 20 పరుగులే ఇందుకు ఉదాహరణ. విరాట్ ఇలా వరుసగా విఫలమవుతున్నప్పటికీ కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్ అతడికి మద్దతుగా నిలుస్తున్నారు. అయితే ఈ విషయంపై మాజీ క్రికెటర్ సయ్యద్ కిర్మాణీ స్పందించారు.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

"విరాట్ కోహ్లీకి ఎంతో అనుభవముంది. అతడు తప్పకుండా టీ20 ప్రపంచకప్‌లో ఉండాలి. ఒక్కసారి కోహ్లీ ఫామ్‌లోకి వచ్చాడంటే అతడిని ఆపడటం ఎవ్వరితరం కాదు. అతడు గేమ్ ఛేంజర్‌గా మారతాడు. కోహ్లీ లాంటి అనుభవం, నైపుణ్యం కలిగిన ఆటగాడు టీ20 ప్రపంచకప్ జట్టులో ఉండటం తప్పనిసరి." అని సయ్యద్ కిర్మాణీ అన్నారు.

ఇదే సమయంలో కోహ్లీ స్థానంలో ఐర్లాండ్, ఇంగ్లాండ్‌పై దీపక్ హుడా అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో పోటీ తీవ్రంగా నెలకొంది. ఈ విషయంపై కూడా సయ్యద్ కిర్మాణీ తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ""భారత జట్టులో ప్రస్తుతం పోటీ చాలా తీవ్రంగా ఉంది. కోహ్లీ కాకుండా అతడి స్థానంలో వేరోక ఆటగాడు ఉన్నట్లయితే ఇప్పటికే జట్టు నుంచి తప్పించేవాళ్లు. అయితే జట్టులో స్థిరపడిన ఆటగాడికి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అతడికి అవకాశం ఇవ్వాలి అని 1983 ప్రపంచకప్ జట్టు సభ్యుడు చెప్పారు

విరాట్ కోహ్లీని ప్రస్తుతం విశ్రాంతి పేరుతో జట్టుకు దూరంగా ఉంచారు. అతడిని జులై 22 నుంచి జరగనున్న వెస్టిండీస్ పర్యటనతో పాటు ఆ తర్వాత జింబాబ్వే సిరీస్‌కు తీసుకోలేదు. ఈ రెండు సిరీస్‌లు పూర్తయిన తర్వాత అంటే ఆగస్టు మధ్య నుంచి ఆసియా కప్ జట్టులో కలవనున్నాడు. ఈ సమయంలో కుటుంబంతో సమయాన్ని గడపనున్నాడు మన రన్నింగ్ మెషిన్.

టాపిక్