తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Cricket: సరికొత్త చరిత్రకు న్యూజిలాండ్ నాంది.. స్త్రీ, పురుషులకు సమాన వేతనం

Cricket: సరికొత్త చరిత్రకు న్యూజిలాండ్ నాంది.. స్త్రీ, పురుషులకు సమాన వేతనం

05 July 2022, 14:15 IST

    • క్రికెట్‌లో స్త్రీ, పురుషులిద్దరికీ సమాన వేతనం ఇచ్చేందుకు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు అంగీకరించింది. ఇందుకోసం ఐదేళ్ల పాటు అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో ఇరు వర్గాల క్రికెటర్లకు సమాన వేతనం ఇచ్చేలా ఒప్పందంపై సంతకం చేసింది.
మహిళా, పురుషుల క్రికెటర్లకు సమాన వేతనం ఒప్పందంపై సంతకం చేసిన న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు
మహిళా, పురుషుల క్రికెటర్లకు సమాన వేతనం ఒప్పందంపై సంతకం చేసిన న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు (Twitter/Blackcaps)

మహిళా, పురుషుల క్రికెటర్లకు సమాన వేతనం ఒప్పందంపై సంతకం చేసిన న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు

క్రికెట్‌.. జెంటిల్మెన్ గేమ్ అని పిలుస్తారు. పేరులోనే మెన్ ఉన్నట్లు.. పురుషుల క్రికెట్‌కు ఉండేంత ఫాలోయింగ్, ప్రాధాన్యత మహిళల క్రికెట్‌కు ఉండదనే విషయం జగమెరిగిన సత్యం. ఇది ఒక్క మనదేశంలోనే అనుకుంటే పొరపాటే.. క్రికెట్ ఆడుతున్న చాలా దేశాల్లో ఇదే పరిస్థితి. గతంతో పోలిస్తే ఇటీవల కాలంలో ఈ స్థితి కాస్త మెరుగైనప్పటికీ.. ఇంకా స్త్రీ, పురుషుల ఆటగాళ్ల మధ్య చాలా విషయాల్లో వ్యత్యాసం చూపిస్తున్నారు. ప్రధానంగా మహిళా క్రికెటర్లు, పురుషుల క్రికెటర్ల మ్యాచ్ ఫీజుల విషయంలోనే ఈ తారతమ్యం ఎక్కువగా ఉంది. చాలాకాలంగా ఈ విషయంపై వుమెన్ క్రికెటర్లు, మాజీలు పోరాడుతున్నప్పటికీ ఫలితం శూన్యం. తాజాగా న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు(NZC) ఆ దిశగా ముందడుగు వేసింది. మహిళలు, పురుషుల క్రికెటర్లకు సమాన వేతనం ఇచ్చేందుకు శ్రీకారం చుట్టింది.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

ఇందుకోసం ఐదేళ్ల ఏళ్ల పాటు ఇరు వర్గాల క్రికెటర్లకు సమాన వేతనం ఇవ్వాలని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు, ప్లేయర్స్ అసోసియేషన్ మంగళవారం నాడు ఒప్పందంపై సంతకం చేశాయి. దీని ప్రకారం, స్త్రీ, పురుషుల క్రికెటర్లకు సమాన వేతనం లభిస్తుంది. ఈ ఒప్పందం అన్ని ఫార్మాట్‌లు, పోటీల్లో పురుషులతో సమానంగా మహిళా క్రికెటర్లు మ్యాచ్ ఫీజును అందుకుంటారు.

"ఇది మా ఆటలో అత్యంత ముఖ్యమైన ఒప్పందం. ఇది న్యూజిలాండ్, ఇతర ప్రధాన అసోసియేషన్లు, ఆటగాళ్లను ఒకే చోట బంధిస్తుంది. క్రికెట్‌కు నిధులు సమకూర్చడానికి, అభివృద్ధి చేయడానికి ఈ ఒప్పందం పునాదిని ఏర్పరస్తుంది." అని న్యూజిలాండ్ క్రికెట్ ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ వైట్ అన్నారు. ఇది ఓ సహకార ఒప్పందమని ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా మహిళా క్రికెట్‌లో తమ పెట్టుబడిని పెంచుకుంటూ పోవడం వల్ల ఇదో ముఖ్యమైన ముందడుగుగా మారుతుందని స్పష్టం చేశారు.

ఈ తాజా ఒప్పందం ప్రకారం దేశీయ కాంట్రాక్టుల సంఖ్య 54 నుంచి 72కి పెరుగుతుది. అయితే ఎక్కువ సంఖ్యలో ఆడిన మ్యాచ్‌లు, పోటీ చేసిన ఫార్మాట్‌లు, శిక్షణ, ఆడిన సమయం కారణంగా పురుషులు అధికంగా సంపాదిస్తారు. అంటే మ్యాచ్ ఫీజు సమానమే అయినప్పటికీ.. ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన వారికి ఎక్కువ మొత్తం లభిస్తుంది.

"అంతర్జాతీయ, దేశీయ స్థాయిలో మహిళా క్రీడాకారులను, పురుషులతో సమానంగా ఒప్పందంలో గుర్తించడం గొప్ప విషయం. ఇదో గొప్ప ముందడుగు. యువతులు, బాలికలకు భవిష్యత్తులో మేలును చేకూరుస్తుంది" అని వైట్ ఫెర్న్స్ కెప్టెన్ సోఫీ డివైన్ అన్నారు.

టాపిక్

తదుపరి వ్యాసం