తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Suryakumar In T20 Rankings: టీ20 ర్యాంకింగ్స్‌లో సూర్యకుమార్‌కు కెరీర్ హై రేటింగ్

Suryakumar in T20 Rankings: టీ20 ర్యాంకింగ్స్‌లో సూర్యకుమార్‌కు కెరీర్ హై రేటింగ్

Hari Prasad S HT Telugu

01 February 2023, 16:29 IST

    • Suryakumar in T20 Rankings: టీ20 ర్యాంకింగ్స్‌లో సూర్యకుమార్‌కు కెరీర్ హై రేటింగ్ రావడం విశేషం. తాజాగా ఐసీసీ బుధవారం (ఫిబ్రవరి 1) రిలీజ్ చేసిన ర్యాంకింగ్స్ లో సూర్య అత్యుత్తమ రేంటింగ్ పాయింట్లు సాధించాడు.
సూర్యకుమార్ యాదవ్
సూర్యకుమార్ యాదవ్ (PTI)

సూర్యకుమార్ యాదవ్

Suryakumar in T20 Rankings: టీమిండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్.. టీ20 ర్యాంకింగ్స్ లో దూసుకెళ్తున్నాడు. ఇప్పటికే ఈ నంబర్ 1 ర్యాంక్ లో ఉన్న సూర్య.. తాజాగా కెరీర్ హై రేటింగ్ పాయింట్లు సాధించాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండు మ్యాచ్ లలోనూ అతడు రాణించాడు. రెండో మ్యాచ్ లో అతడు నెమ్మదిగా ఆడినా.. మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

తొలి మ్యాచ్ లో అతడు 47 రన్స్ చేసిన తర్వాత సూర్య 910 పాయింట్ల మార్క్ అందుకున్నాడు. అయితే రెండో మ్యాచ్ లో ఎంతో సహనంతో ఆడి 26 రన్స్ తో టీమ్ ను గెలిపించిన తర్వాత ఈ పాయింట్లు 908కు పడిపోయాయి. కానీ ఇది కూడా సూర్య కెరీర్ లో అత్యధిక రేటింగ్ పాయింట్లు కావడం విశేషం. న్యూజిలాండ్ తో మూడో టీ20లో వీటిని మరింత పెంచుకునే అవకాశం సూర్యకు ఉంది.

అంతేకాదు టీ20 ర్యాంకింగ్స్ లో ఇప్పటి వరకూ ఆల్ టైమ్ హై రేటింగ్ పాయింట్లకు కూడా సూర్య దగ్గర్లో ఉన్నాడు. ప్రస్తుతం ఈ రికార్డు ఇంగ్లండ్ ప్లేయర్ డేవిడ్ మలన్ పేరిట ఉంది. 2020లో అతడు 915 పాయింట్లు అందుకున్నాడు. ఇప్పుడీ రికార్డును సూర్య మూడో టీ20 ద్వారా అందుకునే అవకాశాలు ఉన్నాయి. గతేడాదే తొలిసారి సూర్య టీ20ల్లో నంబర్ వన్ ర్యాంక్ అందుకున్న విషయం తెలిసిందు.

మరోవైపు ఈ తాజా ర్యాంకింగ్స్ లో న్యూజిలాండ్ ప్లేయర్స్ మెరుగయ్యారు. ఫిన్ అలెన్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్ లాంటి ప్లేయర్స్ తాజా ర్యాంకింగ్స్ లో పైకి ఎగబాకారు. ఇక టీమ్ ర్యాంకింగ్స్ లో టీమిండియా నంబర్ వన్ ర్యాంక్ లోనే కొనసాగుతోంది. ఇండియా ఖాతాలో 267 పాయింట్లు ఉండగా.. ఇంగ్లండ్ 266 పాయింట్లతో ఆ వెంటే ఉంది.