తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Icc Rankings : మణిందర్ టూ సిరాజ్.. నంబర్ 1 స్థానాన్ని ఆక్రమించిన భారత బౌలర్లు వీరే

ICC Rankings : మణిందర్ టూ సిరాజ్.. నంబర్ 1 స్థానాన్ని ఆక్రమించిన భారత బౌలర్లు వీరే

Anand Sai HT Telugu

28 January 2023, 6:44 IST

google News
    • ICC ODI Rankings : నో డౌట్.. మహమ్మద్ సిరాజ్ బౌలింగ్ లో దుమ్మురేపుతున్నాడు. ఐసీసీ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో ఉన్నాడు. అయితే అతడి కంటే ముందు ఐదు మంది భారత బౌలర్లు వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్నారు. ఆ బౌలర్లు ఎవరో తెలుసా?
మహ్మద్ సిరాజ్
మహ్మద్ సిరాజ్ (AP)

మహ్మద్ సిరాజ్

ఐసీసీ ప్రకటించిన వన్డే బౌలర్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ అగ్రస్థానంలో నిలిచాడు. దీంతో ఈ ఘనత సాధించిన 6వ భారత బౌలర్‌గా నిలిచాడు. వన్డే ర్యాంకింగ్స్‌లో మహ్మద్ సిరాజ్ కంటే ముందు 5 మంది భారత బౌలర్లు అగ్రస్థానంలో నిలిచారు. ఆ బౌలర్లు ఎవరో ఇక్కడ తెలుసుకోండి..

మణిందర్ సింగ్ : టీమ్ ఇండియా తరఫున ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచిన తొలి బౌలర్ మణిందర్ సింగ్. 80వ దశకంలో భారత్ తరఫున ఆడిన మణిందర్ 1987లో అగ్రస్థానంలో నిలిచాడు. టీమిండియా తరఫున 59 వన్డేలు ఆడిన లెఫ్టార్మ్ స్పిన్నర్ మణిందర్ సింగ్ మొత్తం 66 వికెట్లు పడగొట్టాడు. వన్డే క్రికెట్లో ఎక్కువ కాలం కొనసాగలేదు.

కపిల్ దేవ్: మణిందర్ సింగ్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారత బౌలర్ కపిల్ దేవ్. టీమిండియా తరఫున 225 వన్డే మ్యాచ్‌లు ఆడిన కపిల్ మొత్తం 253 వికెట్లు పడగొట్టాడు. 1989లో అతను వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్ 1 బౌలర్‌గా నిలిచాడు.

అనిల్ కుంబ్లే: ఈ జాబితాలో అనిల్ కుంబ్లే కూడా ఉన్నాడు. 271 మ్యాచుల్లో 337 వికెట్లు తీసిన అనిల్ కుంబ్లే భారత్ తరఫున అత్యధిక వన్డే వికెట్లు తీసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 1996లో అనిల్ కుంబ్లే ఐసీసీ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో మెరిశాడు.

రవీంద్ర జడేజా: టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా 2013లో అద్భుతమైన ప్రదర్శన చేశాడు. దీంతో ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌లో నంబర్ 1 స్థానంలో నిలిచాడు.

జస్‌ప్రీత్ బుమ్రా: టీమిండియా యార్కర్ స్పెషలిస్ట్ జస్‌ప్రీత్ బుమ్రా అద్భుత ప్రదర్శనతో 2018లో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నంబర్ 1 బౌలర్‌గా నిలిచాడు.

మహ్మద్ సిరాజ్ : టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. శ్రీలంక, న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో మొత్తం 14 వికెట్లు పడగొట్టి ఇప్పుడు ఐసీసీ ర్యాంకింగ్స్ జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. ఈ ఘనత సాధించిన 6వ భారతీయుడిగా నిలిచాడు.

తదుపరి వ్యాసం