తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Suryakumar In Icc Rankings: టీ20ల్లో నంబర్ వన్ ర్యాంక్‌కు చేరువైన సూర్యకుమార్

Suryakumar in ICC Rankings: టీ20ల్లో నంబర్ వన్ ర్యాంక్‌కు చేరువైన సూర్యకుమార్

Hari Prasad S HT Telugu

28 September 2022, 17:52 IST

google News
    • Suryakumar in ICC Rankings: టీ20ల్లో నంబర్ వన్ ర్యాంక్‌కు చేరువయ్యాడు టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ సూర్యకుమార్ యాదవ్‌. లేటెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో అతడు మరింత పైకి దూసుకెళ్లాడు.
సూర్యకుమార్ యాదవ్
సూర్యకుమార్ యాదవ్ (ANI)

సూర్యకుమార్ యాదవ్

Suryakumar in ICC Rankings: టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ ఫీల్డ్‌లో చెలరేగిపోతున్నాడు. దీంతో టీ20 ర్యాంకుల్లోనూ అతడు పైకి ఎగబాకుతూనే ఉన్నాడు. తాజాగా బుధవారం (సెప్టెంబర్‌ 28) ఐసీసీ రిలీజ్‌ చేసిన ర్యాంకుల్లో సూర్య రెండో ర్యాంక్‌కు చేరుకోవడం విశేషం. అంతేకాదు రేటింగ్‌ పాయింట్స్‌ కూడా 800 దాటాయి.

సూర్య ఇప్పుడు నంబర్‌ వన్‌ ర్యాంక్‌కు మరింత చేరువయ్యాడు. ప్రస్తుతం ఆ స్థానంలో పాకిస్థాన్‌ ఓపెనర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ ఉన్నాడు. ఇక సూర్య తర్వాత మూడోస్థానంలోనూ మరో పాక్‌ ఓపెనర్‌, ఆ టీమ్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం ఉండటం విశేషం. అటు బాబర్‌ కూడా నాలుగో స్థానం నుంచి మూడుకు చేరుకున్నాడు. ఇప్పుడు సూర్య, బాబర్‌ మధ్య కేవలం రెండు పాయింట్ల తేడా మాత్రమే ఉంది.

ఆస్ట్రేలియాతో హైదరాబాద్‌లో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో 36 బాల్స్‌లోనే 69 రన్స్‌తో మ్యాచ్‌ విన్నింగ్‌ ఇన్నింగ్స్‌ ఆడిన సూర్య లేటెస్ట్‌ ర్యాంకుల్లో పైకి ఎగబాకాడు.

ప్రస్తుతం సూర్యకుమార్‌ 801 రేటింగ్‌ పాయింట్స్‌తో రెండోస్థానంలో ఉన్నాడు. ఇక ఇండియన్‌ టీమ్‌ కెప్టెన్‌ రోహిత్ శర్మ కూడా ఒక స్థానం మెరుగుపరచుకొని 13వ ర్యాంక్‌కు చేరుకున్నాడు.

అయితే సూర్య ర్యాంక్‌కు బాబర్‌ నుంచి ముప్పు పొంచి ఉంది. ఇంగ్లండ్‌తో రెండో టీ20లో సెంచరీతో చెలరేగిన అతడు.. తాజా ర్యాంకుల్లో మూడో స్థానంలో ఉన్నాడు. 1155 రోజుల పాటు టీ20ల్లో నంబర్ వన్‌గా ఉన్న బాబర్‌ ఈ మధ్యే తన ర్యాంక్‌ను రిజ్వాన్‌కు కోల్పోయిన విషయం తెలిసిందే.

ఇక బౌలర్ల ర్యాంకుల విషయానికి వస్తే ఇండియా స్పిన్నర్లు అక్షర్‌ పటేల్‌ 33వ ర్యాంక్‌ నుంచి 18కి, చహల్‌ 28 నుంచి 26కు చేరుకున్నారు. ఈ లిస్ట్‌లో ఆస్ట్రేలియా పేస్‌బౌలర్‌ జోష్‌ హేజిల్‌వుడ్‌ టాప్‌లో కొనసాగుతున్నాడు.

తదుపరి వ్యాసం