తెలుగు న్యూస్  /  Sports  /  Icc Odi Rankings Virat Kohli Moves To 4th Rank

Virat Kohli Odi Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ - టాప్ ఫైవ్‌లోకి దూసుకెళ్లిన కోహ్లి

18 January 2023, 12:53 IST

  • Virat Kohli Odi Rankings: ఐసీసీ తాజాగా విడుద‌ల‌చేసిన వ‌న్డే ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లి అద‌ర‌గొట్టాడు. టాఫ్ ఫైవ్‌లోకి చేరుకున్నాడు

విరాట్ కోహ్లి
విరాట్ కోహ్లి

విరాట్ కోహ్లి

Virat Kohli Odi Rankings: ఐసీసీ తాజాగా విడుద‌ల‌చేసిన వ‌న్డే ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లి టాప్ ఫైవ్‌లోకి దూసుకొచ్చాడు. శ్రీలంక‌తో సిరీస్‌లో అద‌ర‌గొట్టిన కోహ్లి వ‌న్డే ర్యాకింగ్స్‌లో బ్యాట్స్‌మెన్ జాబితాలో నాలుగో స్థానాన్ని ద‌క్కించుకున్నాడు. శ్రీలంక‌తో జ‌రిగిన మూడు మ్యాచ్‌ల వ‌న్డే సిరీస్‌లో కోహ్లి 283 ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

మూడో వ‌న్డేలో 166 ప‌రుగుల‌తో స‌త్తా చాటాడు. సూప‌ర్ ఫామ్‌లో ఉన్న కోహ్లి వ‌న్డే ర్యాంకింగ్స్‌లో 750 పాయింట్ల‌తో నాలుగో స్థానానికి చేరుకున్నాడు. ప్ర‌స్తుతం 887 పాయింట్ల‌తో బాబ‌ర్ ఆజామ్ ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్నాడు. 766 పాయింట్ల‌తో సౌతాఫ్రికా క్రికెట‌ర్ వాండ‌ర్ డుసెన్ రెండో స్థానంలో 759 పాయింట్ల‌తో డికాక్ మూడో స్థానంలో ఉన్నాడు.

747 పాయింట్ల‌తో డేవిడ్ వార్న‌ర్ ఐదో స్థానంలో నిలిచాడు. శ్రీలంకతో మూడో వ‌న్డేలో సెంచ‌రీతో ఆక‌ట్టుకున్న శుభ్‌మ‌న్ గిల్ వ‌న్డే ర్యాంకింగ్స్‌లో 26వ స్థానాన్ని ద‌క్కించుకున్నాడు.

సిరాజ్‌కు థర్డ్ ప్లేస్‌

శ్రీలంక సిరీస్‌లో బౌలింగ్‌లోనూ రాణించిన టీమ్ ఇండియా పేస‌ర్ మ‌హ్మ‌ద్ సిరాజ్ కెరీర్‌లో అత్యుత్త‌మ ర్యాంక్‌ను ద‌క్కించుకున్నాడు. వ‌న్డే ర్యాంకింగ్స్ బౌల‌ర్ల జాబితాలో 685 పాయింట్ల‌తో మూడో స్థానానికి చేరుకున్నాడు.ప‌దిహేను స్థానాల‌ను మెరుగుప‌రుచుకొని స‌త్తా చాటాడు.

బౌల‌ర్ల జాబితాలో న్యూజిలాండ్ పేస‌ర్ ట్రెంట్ బౌల్ట్ ఫ‌స్ట్ ప్లేస్‌లో జోస్ హెజిల్‌వుడ్ రెండో స్థానంలో నిలిచారు. బౌల‌ర్ల జాబితాలో కుల్దీప్ యాద‌వ్ 21వ స్థానంలో నిలిచాడు.

టాపిక్