తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Troll On Mohammad Shami: షమీ దసరా చేసుకుంటే తప్పేంటి? ట్రోలింగ్‌పై కేంద్ర క్రీడల మంత్రి ఫైర్

Troll on Mohammad Shami: షమీ దసరా చేసుకుంటే తప్పేంటి? ట్రోలింగ్‌పై కేంద్ర క్రీడల మంత్రి ఫైర్

08 October 2022, 15:27 IST

    • Mohammad Shami Dussehra Wishes: టీమిండియా బౌలర్ మహమ్మద్ షమీ తన అభిమానులకు దసరా శుభాకాంక్షలు చెబుతూ ట్విటర్‌లో పోస్ట్ పెట్టారు. దీంతో అతడిపై కొంతమంది ట్రోలింగ్ చేయడం ప్రారంభించారు. ఈ ట్రోలింగ్‌పై కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
మహమ్మద్ షమీ
మహమ్మద్ షమీ (PTI)

మహమ్మద్ షమీ

Anurag Thakur backed Shami: టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ పెట్టిన పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ పోస్టుపై నెటిజన్లు విపరీతంగా ట్రోల్స్ చేస్తుండటంతో.. వాటిని అడ్డుకునేందుకు కేంద్ర క్రీడా శాఖామంత్రి అనురాగ్ ఠాకూర్ రంగంలోకి దిగారు. షమీపై వస్తున్న ట్రోల్స్‌పై విమర్శనాస్త్రాలను సంధించారు. తన అభిమానులు మహమ్మద్ షమీ దసరా శుభాకాంక్షలు చెబుతూ ట్విటర్ వేదికగా పోస్ట్ పెట్టాడు. దీంతో అతడిపై కొంతమంది మతం పేరుతో ట్రోల్స్ చేయడం ప్రారంభించారు.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

టీమిండియా క్రికెటర్‌గా షమీ తన అభిమానుల కోసం దసరా శుభాకాంక్షలు చెబుతూ.. శ్రీరాముడి ఫొటోను షేర్ చేశారు. అయితే కొంతమంది అతడిని మతం కోణంలో చూస్తూ.. హిందువుల పండుగకు అతడెలా శుభాకాంక్షలు చెబుతాడంటూ ట్రోల్ చేయడం ప్రారంభించారు.

దసరా పర్వదినాన ఆ శ్రీ రాముడు మీ జీవితంలోని కోరికన్నింటినీ నెరవేర్చాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మీ జీవితంలో సంతోషం, సంపద, విజయం అందించాలని నేను ప్రార్ధిస్తున్నాను. మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు అని మహమ్మద్ షమీ.. తన అభిమానులను ఉద్దేశించి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఈ పోస్టుకు కొంతమంది మతాన్ని ఆపాదిస్తూ షమీని ట్రోల్ చేయడం ప్రారంభించారు. ఈ విధంగా షమీపై వస్తున్న ట్రోల్స్‌పై కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించారు.

"దసరా పండుగను ప్రతి ఒక్కరూ ఆనందంగా జరుపుకునే వేడుక. భారత క్రికెటర్లకు కూడా ఈ పర్వదినాన్ని జరుపుకోవచ్చు. మహమ్మద్ షమీ ఈ పండుగను చేసుకుంటే వచ్చిన సమస్యేంటి? ఎవరైతే దీన్ని వ్యతిరేకిస్తున్నారో వారు ఈ దేశాన్ని విడగొట్టాలని చూస్తున్నారు. కానీ మేము అందరూ ఓ దేశం వలే అన్నీ పండుగలను జరుపుకోవాలని కోరుకుంటున్నాం." అని అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు.

భారత బౌలర్లలో ఆత్యుత్తమైనవారిలో షమీ ముందు వరుసలో ఉంటాడు. త్వరలో ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్ కోసం భారత తరఫున ఆడనున్నాడు. జస్ప్పీత్ బుమ్రా గాయం బారిన పడటంతో అతడి స్థానంలో షమీని జట్టులోకి తీసుకున్నారు. అంతకుముందు స్టాండ్ బై ప్లేయర్‌గా ఉన్నాడు. సెప్టెంబరు-అక్టోబర్‌లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాతో జరిగిన స్వదేశీ సిరీస్‌ల కోసం షమీ టీ20 జట్లలోనూ ఎంపికయ్యాడు, అయితే అతను కోవిడ్-19 బారిన పడిన తర్వాత అతను సిరీస్‌కు దూరమయ్యాడు.