తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Saudi Arabia Club Offer To Cristiano Ronaldo: రొనాల్డోకు కళ్లు చెదిరే ఆఫర్.. ఏడాదికి రూ.612 కోట్లు

Saudi Arabia club offer to Cristiano Ronaldo: రొనాల్డోకు కళ్లు చెదిరే ఆఫర్.. ఏడాదికి రూ.612 కోట్లు

Hari Prasad S HT Telugu

28 November 2022, 16:03 IST

  • Saudi Arabia club offer to Cristiano Ronaldo: రొనాల్డోకు కళ్లు చెదిరే ఆఫర్ ఇచ్చింది సౌదీ అరేబియాకు చెందిన ఫుట్‌బాల్‌ క్లబ్‌ అల్ నసర్‌. ఏడాదికి 7.5 కోట్ల డాలర్లు (సుమారు రూ.612 కోట్లు) ఇవ్వడానికి సిద్ధమైంది.

క్రిస్టియానో రొనాల్డో
క్రిస్టియానో రొనాల్డో (AFP)

క్రిస్టియానో రొనాల్డో

Saudi Arabia club offer to Cristiano Ronaldo: స్టార్ ఫుట్‌బాలర్‌ క్రిస్టియానో రొనాల్డోకు ఓ బంపర్‌ ఆఫర్‌ వచ్చింది. అతన్ని మాంచెస్టర్‌ యునైటెడ్‌ క్లబ్‌ వదిలేసిన వారంలోపే సౌదీ అరేబియా క్లబ్‌ ఆఫర్‌ ఇచ్చింది. మూడేళ్లకుగాను 22.5 కోట్ల డాలర్లు (సుమారు రూ.1830 కోట్లు) ఇవ్వడానికి సౌదీ అరేబియా క్లబ్‌ అల్ నసర్‌ సిద్ధంగా ఉన్నట్లు సీబీఎస్‌ స్పోర్ట్స్‌ రిపోర్ట్‌ చేసింది. అంటే ఏడాదికి 7.5 కోట్ల డాలర్లు కావడం విశేషం.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

ప్రస్తుతం జరుగుతున్న ఫుట్‌బాల్‌ వరల్డ్‌కప్‌ ముగిసిన తర్వాత తమ క్లబ్‌తో చేరాల్సిందిగా రొనాల్డోను అల్‌ నసర్‌ కోరినట్లు సమాచారం. రికార్డు స్థాయిలో ఫిఫా వరల్డ్‌కప్‌లలో ఐదుసార్లు ఆడిన రొనాల్డో.. ఈ వరల్డ్‌కప్‌ ప్రారంభమైన మొదట్లోనే మాంచెస్టర్‌ యునైటెడ్‌ క్లబ్‌తో తెగదెంపులు చేసుకున్న విషయం తెలిసిందే. ఆ క్లబ్‌పై సంచలన ఆరోపణలు చేయడంతో యునైటెడ్‌ క్లబ్‌ రొనాల్డోను సాగనంపింది. ఆ తర్వాత క్లబ్‌ను కూడా అమ్మాకానికి పెట్టింది.

ప్రస్తుతం రొనాల్డో ఫ్రీ ఏజెంట్‌గా ఉన్నాడు. అతడు ఏ క్లబ్‌ వైపు వెళ్తాడన్నది ఆసక్తిగా మారింది. అల్‌ నసర్‌ క్లబ్‌ చాలా రోజులుగా అతనిపై కన్నేసింది. ఇంతకుముందే క్లబ్‌తో రొనాల్డో దీనిపై చర్చించినట్లు కూడా తాజా రిపోర్ట్‌ వెల్లడించింది. ఇద్దరూ డీల్‌కు అంగీకరిస్తే కాంట్రాక్ట్‌ ఫైనల్‌ అవడానికి ఎక్కువ రోజుల సమయం పట్టేలా లేదు. ఆసియాలో అల్‌ నసర్‌ క్లబ్‌ చాలా బలమైన టీమ్స్‌లో ఒకటి. ఇప్పటి వరకూ ఈ క్లబ్‌ తొమ్మిది లీగ్‌ టైటిల్స్‌ను గెలిచింది.

మాంచెస్టర్‌ యునైటెడ్‌ క్లబ్‌పై ఈ మధ్య రొనాల్డో సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. మేనేజర్‌ ఎరిక్‌ టెన్‌ హాగ్‌ను లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేశాడు. అతన్ని తాను గౌరవించనని అతడు చెప్పాడు. ఓ మ్యాచ్‌లో తనను సబ్‌స్టిట్యూట్‌గా రమ్మని మేనేజర్‌ చెప్పడం, అందుకు అతడు నిరాకరించడంతో తర్వాతి మ్యాచ్‌కు పక్కన పెట్టడంతో వీళ్ల గొడవ ముదిరింది.

ఓ ఇంటర్వ్యూలో రొనాల్డో.. క్లబ్‌ను లక్ష్యం చేసుకుంటూ తనను బయటకు పంపించడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారని ఆరోపించాడు. దీంతో యునైటెడ్‌ క్లబ్‌ తమ కాంట్రాక్ట్‌ను ముందుగానే ముగిస్తున్నట్లు ప్రకటించింది. అప్పటి నుంచీ రొనాల్డో ఫ్రీ ఏజెంట్‌గా మారాడు.