తెలుగు న్యూస్  /  Sports  /  Rohit Sharma On Bumrah Says Poor Guy He Is Struggling Hard

Rohit Sharma on Bumrah: పాపం బాగానే కష్టపడుతున్నాడు కానీ.. బుమ్రాపై రోహిత్‌ కామెంట్స్‌

Hari Prasad S HT Telugu

09 January 2023, 19:45 IST

    • Rohit Sharma on Bumrah: పాపం బాగానే కష్టపడుతున్నాడు కానీ.. అంటూ పేస్‌ బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాపై ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశాడు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ. శ్రీలంకతో వన్డే సిరీస్‌కు ఎంపికైనా కూడా బుమ్రా ఇందులో ఆడటం లేదని బీసీసీఐ ప్రకటించింది.
రోహిత్ శర్మ
రోహిత్ శర్మ (Pitamber Newar)

రోహిత్ శర్మ

Rohit Sharma on Bumrah: టీమిండియా స్టార్‌ పేస్‌ బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా గాయంతో రిస్క్‌ తీసుకోదలచుకోవడం లేదని కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అన్నాడు. శ్రీలంకతో వన్డే సిరీస్‌కు అతన్ని ఎంపిక చేసినట్లు గత వారం ప్రకటించిన బీసీసీఐ.. సోమవారం (జనవరి 9) మాత్రం బుమ్రా ఈ సిరీస్‌లో ఆడటం లేదని స్పష్టం చేసింది. నేషనల్‌ క్రికెట్‌ అకాడెమీ (ఎన్సీఏ)లో రీహ్యాబిలిటేషన్‌కు వెళ్లిన బుమ్రా.. పూర్తి ఫిట్‌గా ఉన్నట్లు కూడా గతవారం బీసీసీఐ తెలిపింది.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

అయితే ఇప్పుడు మాత్రం బుమ్రా గాయం విషయంలో రిస్క్‌ తీసుకోదలచుకోలేదంటూ వన్డే సిరీస్‌కు పక్కన పెట్టింది. మంగళవారం (జనవరి 10) తొలి వన్డే జరగనుండగా.. రోహిత్‌ శర్మ సోమవారం మీడియాతో మాట్లాడాడు. బుమ్రా మరోసారి తన వెన్ను పట్టేసినట్లుగా ఉందని చెప్పాడని, అందుకే ఈ సిరీస్‌కు పక్కన పెట్టినట్లు రోహిత్‌ వెల్లడించాడు.

"ఇది అతని దురదృష్టం. పాపం.. చాలా రోజులుగా అతడు ఎన్సీఏలో కఠినంగా శ్రమిస్తున్నాడు. అతని తిరిగి వచ్చినప్పుడు పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నాడు. బౌలింగ్‌ కూడా చేశాడు. అయితే మళ్లీ తన వెన్ను కాస్త పట్టేసినట్లు ఉందని చెప్పాడు. గత రెండు రోజుల్లోనే ఇది జరిగింది. అయితే ఇది పెద్దదేమీ కాదు. బుమ్రానే చెప్పాడు కాబట్టి.. ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకోలేము. ఇప్పుడు మేము అదే చేశాము" అని రోహిత్‌ చెప్పాడు.

"అతన్ని ఈ సిరీస్‌ నుంచి తప్పించాలన్నది ముఖ్యమైన నిర్ణయం. ఎందుకంటే అతన్ని ఎంపిక చేసినప్పుడు బుమ్రా తన పనిభారంపై పని మొదలుపెట్టాడు. నెట్స్‌లో బౌలింగ్‌ కూడా చేశాడు. అతని విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. వరల్డ్‌కప్‌కు ముందు అతనికి పెద్ద గాయం అయింది. అందుకే జాగ్రత్తగా ఉండాలి" అని రోహిత్‌ అన్నాడు.

గతేడాది సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌ తర్వాత బుమ్రా మళ్లీ ఆడలేదు. ఆ తర్వాత జరిగిన వరల్డ్‌కప్‌కు కూడా దూరమయ్యాడు. న్యూజిలాండ్‌, బంగ్లాదేశ్‌ పర్యటనలకూ వెళ్లలేదు. శ్రీలంకతో వన్డే సిరీస్‌ ఆడతాడని అనుకున్నా.. చివరి నిమిషంలో అతన్ని పక్కన పెట్టారు. వచ్చే నెలలో ఆస్ట్రేలియాతో కీలకమైన టెస్ట్‌ సిరీస్‌ ఉండటంతో బీసీసీఐ రిస్క్‌ తీసుకోదలచుకోలేదని తెలుస్తోంది.