తెలుగు న్యూస్  /  Sports  /  Ricky Ponting On Jadeja Says He Will Be The Leading Wicket Taker In The Series

Ricky Ponting on Jadeja: ఇండియా, ఆస్ట్రేలియా సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసేది జడేజానే: పాంటింగ్

Hari Prasad S HT Telugu

10 February 2023, 15:43 IST

    • Ricky Ponting on Jadeja: ఇండియా, ఆస్ట్రేలియా సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసేది జడేజానే అని అన్నాడు మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్. ఆస్ట్రేలియా బ్యాటర్లకు అతడు పీడకలగా మారతాడని అభిప్రాయపడ్డాడు.
రవీంద్ర జడేజా
రవీంద్ర జడేజా (PTI)

రవీంద్ర జడేజా

Ricky Ponting on Jadeja: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాపై ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రస్తుతం ఇండియా, ఆస్ట్రేలియా సిరీస్ లో టాప్ వికెట్ టేకర్ గా జడేజానే నిలుస్తాడని స్పష్టం చేశాడు. ఐసీసీ రివ్యూలో అతడు మాట్లాడాడు. తొలి ఇన్నింగ్స్ లో జడేజా ఐదు వికెట్లు తీయడంతో ఆస్ట్రేలియా కేవలం 177 పరుగులకే ఆలౌటైంది.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

"సిరీస్ గడుస్తున్న కొద్దీ ఒకవేళ జడేజా పూర్తి ఫిట్ గా ఉండి.. నాలుగు టెస్టులూ ఆడగలిగితే, సిరీస్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ అతడే అవుతాడు" అని పాంటింగ్ అన్నాడు. "ఇలాంటి వికెట్లపై అతని బౌలింగ్ తీరు చూస్తే.. అదే అనిపిస్తుంది. అతని పేస్, రైట్ హ్యాండర్లకు వేసే లైన్, ప్రతిసారీ స్టంప్స్ కు సూటిగా పిచ్ చేసే బాల్, ఒకసారి టర్న్ అవుతుంది. ఓసారి నేరుగా దూసుకొస్తుంది" అని పాంటింగ్ చెప్పాడు.

ఈ సందర్భంగా ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవ్ స్మిత్ ను ఔట్ చేసిన విధానాన్ని అతడు వివరించాడు. ఒకే బాల్ ను జడేజా రెండు విధాలుగా వేశాడని, ఒకటి స్పిన్ కాగా.. మరొకటి నేరుగా వెళ్లి వికెట్లను గిరాటేసిందని చెప్పాడు. ఇక నాగ్‌పూర్ పిచ్ గురించి కూడా పాంటింగ్ మాట్లాడాడు.

"వికెట్ ఇలాగే ఉంటుందని నేను ముందే ఊహించాను. కొన్ని రోజుల కిందట నేను పిచ్ చూశాను. అప్పటి నుంచే పిచ్ గురించి చర్చ మొదలైంది. కానీ ఆస్ట్రేలియాను ఓడించాలంటే ఇండియాకు ఉన్న బెస్ట్ ఛాన్స్ స్పిన్ పిచ్ లను తయారు చేయడం. ఎందుకంటే ఆస్ట్రేలియా బ్యాటర్లకు ఆడటం కష్టం. అంతేకాదు ఆస్ట్రేలియా స్పిన్నర్ల కంటే వాళ్ల స్పిన్నర్లు మెరగని కూడా ఇండియా భావిస్తుంది" అని పాంటింగ్ చెప్పాడు.