Michael Clarke on India vs Australia: ఇండియా 300 చేస్తే చాలు.. మళ్లీ బ్యాటింగ్ చేయాల్సిన అవసరం రాదు: క్లార్క్-michael clarke on india vs australia says if india scores 300 they might not have to bat again ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Michael Clarke On India Vs Australia Says If India Scores 300 They Might Not Have To Bat Again

Michael Clarke on India vs Australia: ఇండియా 300 చేస్తే చాలు.. మళ్లీ బ్యాటింగ్ చేయాల్సిన అవసరం రాదు: క్లార్క్

Hari Prasad S HT Telugu
Feb 10, 2023 10:06 AM IST

Michael Clarke in India vs Australia: ఇండియా 300 చేస్తే చాలు.. మళ్లీ బ్యాటింగ్ చేయాల్సిన అవసరం రాదని అన్నాడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్. నాగ్‌పూర్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా కేవలం 177 రన్స్ కే ఆలౌటైన విషయం తెలిసిందే.

ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్, స్పిన్నర్ నేథన్ లయన్
ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్, స్పిన్నర్ నేథన్ లయన్ (AFP)

Michael Clarke in India vs Australia: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఇండియా బోణీ చేయడం ఖాయమన్నట్లుగా మాట్లాడాడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్. అంతేకాదు ఇండియా తొలి ఇన్నింగ్స్ లో 280 నుంచి 300 చేస్తే ఇన్నింగ్స్ విజయం కూడా పక్కా అని చెప్పడం విశేషం. నాగ్‌పూర్ పిచ్ తొలి రోజే స్పిన్ కు అనుకూలించిన నేపథ్యంలో క్లార్క్ ఇలాంటి కామెంట్స్ చేశాడు.

ట్రెండింగ్ వార్తలు

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. ఏ దశలోనూ భారీ స్కోరు చేసేలా కనిపించలేదు. స్మిత్, లబుషేన్ మాత్రమే మూడో వికెట్ కు 82 పరుగులు జోడించి ఆశలు రేపినా.. వాళ్లు ఔటైన తర్వాత ఆసీస్ కుప్పకూలింది. చివరికి 177 రన్స్ కే ఆలౌటైంది. స్పిన్నర్లు జడేజా, అశ్విన్ కలిసే 8 వికెట్లు తీసుకున్నారు. తర్వాత తొలి రోజు ఇండియా కూడా రోహిత్ హాఫ్ సెంచరీతో తొలి ఇన్నింగ్స్ ను ఘనంగా ప్రారంభించింది.

ఈ నేపథ్యంలో బిగ్ స్పోర్ట్స్ బ్రేక్ ఫాస్ట్ తో మాట్లాడిన క్లార్క్.. ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్ స్మార్ట్ గా వ్యూహాలను రచించకపోతే మాత్రం ఇండియా ఇన్నింగ్స్ విజయం సాధించడం ఖాయమని అన్నాడు.

"మనం ఎక్కువ రన్స్ చేయలేదన్న విషయం తెలుసు. ఇదే కమిన్స్ పనిని ఇంకా క్లిష్టం చేస్తోంది. అందుకే అతడు బౌలర్లకు రక్షణాత్మక ఫీల్డింగ్ సెట్ చేస్తున్నాడు. కానీ బ్యాటర్లు రిస్క్ తీసుకునేలా చేయాలి. బ్యాటర్లు ఒకటీ రెండు షాట్లు పైనుంచి ఆడితే మళ్లీ ఫీల్డర్ ను అక్కడే ఉంచాలి.

కానీ కమిన్స్ తన వ్యూహాల విషయంలో చాలా స్మార్ట్ గా ఉండాలి. ఇండియా ఒకవేళ 280 నుంచి 300 చేస్తే మాత్రం వాళ్లు మళ్లీ బ్యాటింగ్ చేయాల్సిన అవసరం రాకపోవచ్చు" అని క్లార్క్ స్పష్టం చేశాడు.

తొలి రోజు కమిన్స్ వ్యూహాలు తనను ఆశ్చర్యానికి గురి చేసినట్లు కూడా క్లార్క్ చెప్పాడు. "వాళ్లు కేవలం 177 రన్సే చేసి ఉండొచ్చు. అయినా వికెట్ల కోసం ప్రయత్నించాలి. తొలి రోజు కమిన్స్ వ్యూహాలు ఆశ్చర్యపరిచాయి. నేథన్ లయన్, మర్ఫీ వేసిన ప్రతి ఓవర్లో లాంగాన్ ఫీల్డర్ ఉంచాడు.

నువ్వు అనుకుంటున్న బాల్ స్పిన్ అయితే బ్యాటర్లు మిడాన్ మీదుగా ఆడటానికి ప్రయత్నిస్తే అది ఇన్ సైడ్ ఎడ్జ్ తీసుకొని మిడ్ వికెట్ కు వెళ్లొచ్చే. లేదంటే స్టంప్, బౌల్డ్, బ్యాట్-ప్యాడ్ క్యాచ్ కూడా కావచ్చు" అని క్లార్క్ చెప్పాడు.

WhatsApp channel

సంబంధిత కథనం