Mahesh Pithiya on Smith: రానున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాకు ఎదురు కానున్న ప్రధాన సవాలు స్పిన్ బౌలింగ్. అందులోనూ ఇండియన్ టీమ్ లో అశ్విన్ లాంటి క్వాలిటీ బౌలర్ ఉన్నాడు. అతనితో ముప్పు అని ముందుగానే ఊహించిన కంగారూలు.. అచ్చూ అశ్విన్ లాగే బౌలింగ్ చేసే మహేష్ పితియా అనే 21 ఏళ్ల యువ బౌలర్ ను గుజరాత్ నుంచి బెంగళూరుకు రప్పించింది.,ప్రత్యేకంగా తయారు చేసిన స్పిన్ పిచ్ లపై మహేష్ బౌలింగ్ లో ప్రాక్టీస్ చేసింది. దీంతో ఎవరీ మహేష్ పితియా అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఇప్పుడా బౌలరే ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ ను తాను తొలి రోజు ట్రైనింగ్ లోనే ఆరుసార్లు ఔట్ చేసినట్లు చెప్పడం విశేషం. ఈసారి సిరీస్ గెలవాలంటే ఆస్ట్రేలియాకు స్మిత్ చాలా కీలకం కానున్నాడు.,స్మిత్‌కి బౌలింగ్ చేయడమే నా పనిఆస్ట్రేలియా ట్రైనింగ్ క్యాంప్ లో జరిగిన ఆసక్తికరమైన విషయాలను మహేష్ పితియా పంచుకున్నాడు. తన పని కేవలం స్టీవ్ స్మిత్‌కు బౌలింగ్ చేయడమే అని ఈ సందర్భంగా అతడు చెప్పడం విశేషం. "నేను తొలి రోజే స్టీవ్ స్మిత్ ను ఆరుసార్లు ఔట్ చేశాను. ,ఆస్ట్రేలియా టీమ్ తో ట్రైనింగ్ చాలా అద్భుతంగా సాగింది. ఆస్ట్రేలియా నెట్స్ లో ప్రధానంగా నా పని స్టీవ్ స్మిత్ కు బౌలింగ్ చేయడమే. కచ్చితంగా ఇలా బౌలింగ్ చేయాలని స్మిత్ నాకేమీ చెప్పలేదు" అని మహేష్ వెల్లడించాడు.,అశ్విన్ ఆశీర్వాదం తీసుకున్నాఇక బెంగళూరు నుంచి నాగ్‌పూర్ వచ్చిన తర్వాత తన ఐడల్ అశ్విన్ ను నేరుగా కలిసే అవకాశం కూడా మహేష్ కు దక్కింది. "ఇవాళ నేను నా ఐడల్ నుంచి ఆశీర్వాదాలు తీసుకున్నాను. ,నేనెప్పుడూ అతనిలాగా బౌలింగ్ చేయాలని అనుకున్నాను. నేను అతన్ని కలిసినప్పుడు అతడు నెట్స్ లోకి వస్తున్నాడు. నేను అతని పాదాలను తాకాను. అతడు వెంటనే నన్ను హత్తుకొని, నేను ఆస్ట్రేలియన్లకు ఎలా బౌలింగ్ చేశానో అడిగాడు" అని మహేష్ చెప్పాడు.,అశ్విన్ లాగా తన దగ్గర దూస్రా, క్యారమ్ బాల్ లాంటి అస్త్రాలు ఏవీ లేవని కూడా ఈ సందర్భంగా మహేష్ తెలిపాడు. ఇక ఆస్ట్రేలియా స్పిన్నర్ నేథన్ లయన్ ను కలిసినప్పుడు తాను ఎన్నో కీలకమైన సూచనలు అందుకున్నట్లు చెప్పాడు. ,"నా గ్రిప్ చూపించమని లయన్ అడిగాడు. వేళ్లను తిప్పేటప్పుడు ఏం చేయాలో వివరించాడు. బంతిని ఎలా తిప్పాలి? ముందుగా ఎడమ కాలు ఎలా ల్యాండ్ చేయాలి అన్నవి చెప్పాడు. నా సామర్థ్యంపై విశ్వాసం ఉంచాలని అన్నాడు" అని మహేష్ వివరించాడు.,