తెలుగు న్యూస్  /  Sports  /  Rahul Dravid Says Do Not Feel Any Pressure In Terms Of Trying To Win An Icc Trophy

Rahul Dravid: ఇంత సాధించాం.. ఐసీసీ ట్రోఫీతో పనేముంది: కోచ్ ద్రవిడ్

Hari Prasad S HT Telugu

05 June 2023, 22:44 IST

    • Rahul Dravid: ఇంత సాధించాం.. ఐసీసీ ట్రోఫీతో పనేముంది అని అన్నాడు కోచ్ ద్రవిడ్. ఆస్ట్రేలియాతో డబ్ల్యూటీసీ ఫైనల్ బుధవారం (జూన్ 7) నుంచి జరగనున్న నేపథ్యంలో ద్రవిడ్ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్
టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ (AP)

టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్

Rahul Dravid: ఇండియన్ టీమ్ ఐసీసీ ట్రోఫీ గెలవక పదేళ్లవుతోంది. ఇప్పుడు డబ్ల్యూటీసీ ఫైనల్ రూపంలో మరోసారి ఓ ఐసీసీ ట్రోఫీ గెలిచే అవకాశం వచ్చింది. అయితే దానిని అందుకునే క్రమంలో తమపై ఎలాంటి ఒత్తిడి లేదని అన్నాడు టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్. గత రెండేళ్లలో ఎంతో సక్సెస్ సాధించామని, ఈ నేపథ్యంలో ఐసీసీ ట్రోఫీ గెలిచామా లేదా అన్నదానితో సంబంధం లేదని స్పష్టం చేశాడు.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

బుధవారం (జూన్ 7) నుంచి ఆస్ట్రేలియాతో డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనున్న నేపథ్యంలో ద్రవిడ్ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా ఐసీసీ ట్రోఫీని 2013 నుంచి గెలవలేకపోవడం అనేది జట్టుపై అదనపు ఒత్తిడి పెంచుతోందా అన్న ప్రశ్నకు అలాంటిదేమీ లేదని అన్నాడు.

"అసలు లేనే లేదు. ఐసీసీ ట్రోఫీ గెలవాలన్న ఒత్తిడి మాపై లేదు. గెలిస్తే చాలా మంచిదే. ఐసీసీ టోర్నమెంట్ గెలవడం ఎప్పుడూ ప్రత్యేకమే. కానీ ఇప్పుడు టీమ్ ఉన్న పరిస్థితి చూస్తే రెండేళ్లుగా సాధించిన విజయాలకు ఇది నిదర్శనం. ఆ రెండేళ్లలో ఎంతో సక్సెస్ సాధిస్తేనే ఇప్పుడీ స్థాయికి జట్టు చేరింది.

ఆస్ట్రేలియాలో సిరీస్ గెలవడం, ఇంగ్లండ్ లో డ్రా చేసుకోవడం, ఈ జట్టు గత ఐదారేళ్లుగా ప్రపంచంలో ఎక్కడ ఆడినా గట్టి పోటీ ఇస్తోంది. అందుకే ఐసీసీ ట్రోఫీ గెలిచినా, గెలవకపోయినా ఈ విజయాలైతే తక్కువ కావు కదా. అదే సమయంలో ఐసీసీ ట్రోఫీ గెలిస్తే బాగుంటుంది. నిజానికి ఏ క్రికెట్ మ్యాచ్ అయినా గెలిస్తే బాగానే ఉంటుంది. డబ్ల్యూటీసీ ఫైనల్ కావడంతో విజయమే మంచి ఫీలింగ్ కలిగిస్తుంది" అని ద్రవిడ్ స్పష్టం చేశాడు.

మరోవైపు సోమవారం (జూన్ 5) టీమిండియా నెట్స్ లో తీవ్రంగా చెమటోడ్చింది. మధ్యాహ్నం 1.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ఏకధాటిగా ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నారు. పుజారా గంటన్నర పాటు బ్యాటింగ్ చేయడం విశేషం. కెప్టెన్ రోహిత్ మాత్రం బ్యాటింగ్ ప్రాక్టీస్ కాకుండా ఫీల్డింగ్ డ్రిల్స్ తో గడిపాడు.