తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Rahul Dravid: రోహిత్‌ శర్మకు ఇంకా ఛాన్స్‌ ఉంది: కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌

Rahul Dravid: రోహిత్‌ శర్మకు ఇంకా ఛాన్స్‌ ఉంది: కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌

Hari Prasad S HT Telugu

29 June 2022, 21:15 IST

    • Rahul Dravid: ఇంగ్లండ్‌తో జరగబోయే టెస్ట్‌లో రోహిత్‌ శర్మ ఆడతాడా లేదా అన్నదానిపై కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ కీలకమైన అప్‌డేట్‌ ఇచ్చాడు. అతని కామెంట్స్‌తో అభిమానుల్లో ఆశలు రేగాయి.
టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్
టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ (AP)

టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్

బర్మింగ్‌హామ్‌: ఇంగ్లండ్‌తో ఐదో టెస్ట్‌లో రోహిత్‌ శర్మ ఆడటం లేదని, అతని స్థానంలో బుమ్రా కెప్టెన్సీ వహిస్తాడని వార్తలు వచ్చిన విషయం తెలుసు కదా. కరోనా బారిన పడిన రోహిత్‌కు బుధవారం ఆర్టీ-పీసీఆర్‌ టెస్ట్‌ నిర్వహించగా మరోసారి పాజిటివ్‌గా వచ్చిందని, దీంతో అతడు మ్యాచ్ ఆడే అవకాశం లేదని ఓ బీసీసీఐ అధికారి పీటీఐకి చెప్పారు. అయితే తాజాగా కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మాత్రం దీనిపై మరోలా స్పందించాడు.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

రోహిత్‌ శర్మకు ఇంకా ఛాన్స్‌ ఉందని, మ్యాచ్‌కు ఇంకా 36 గంటలు ఉన్న విషయాన్ని గుర్తు చేశాడు. "అతన్ని ఇండియన్‌ టీమ్‌ పర్యవేక్షిస్తోంది. రోహిత్‌ ఇంకా మ్యాచ్‌ నుంచి తప్పుకోలేదు. మ్యాచ్‌కు ఇంకా 36 గంటల సమయం ఉంది. బుధవారం రాత్రి, గురువారం ఉదయం మరోసారి పరీక్షలు నిర్వహిస్తారు. అతని విషయంలో మెడికల్‌ టీమ్‌, స్పోర్ట్స్‌ సైన్స్‌ తుది నిర్ణయం తీసుకుంటుంది" అని ద్రవిడ్‌ స్పష్టం చేశాడు.

ఒకవేళ రోహిత్‌ శర్మ ఆడకపోతే కెప్టెన్‌గా ఎవరుంటారు అన్న ప్రశ్నకు ద్రవిడ్‌ నేరుగా సమాధానం ఇవ్వలేదు. దీనిపై బీసీసీఐ సెలక్టర్ల నుంచి అధికారిక ప్రకటన వస్తుందని అన్నాడు. ఇక ఇంతమంది కెప్టెన్లతో పని చేయాల్సి రావడంపై ద్రవిడ్‌ స్పందిస్తూ.. "నేను బాధ్యతలు చేపట్టినప్పుడు ఇంతమంది కెప్టెన్లతో పని చేయాల్సి వస్తుందని అనుకోలేదు. కానీ దురదృష్టవశాత్తూ గాయాలయ్యాయి. కొన్నిసార్లు ప్లేయర్స్‌పై పని భారం తగ్గించాల్సి వచ్చింది. కెప్టెన్లు మారతారని ఊహించలేం కానీ.. మారినప్పుడు అందుకు తగినట్లు స్పందించి వాళ్లకు తగిన వ్యూహాలు రచించాల్సి ఉంటుంది" అని ద్రవిడ్‌ చెప్పాడు.