తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Rahul Dravid: టీమిండియాతో చేరిన కోచ్‌ ద్రవిడ్‌.. గేమ్‌ప్లాన్‌పై చర్చ

Rahul Dravid: టీమిండియాతో చేరిన కోచ్‌ ద్రవిడ్‌.. గేమ్‌ప్లాన్‌పై చర్చ

Hari Prasad S HT Telugu

21 June 2022, 18:23 IST

    • టీమిండియా కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ ఇంగ్లండ్‌లోని టెస్ట్‌ టీమ్‌తో కలిశాడు. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌ ముగిసిన తర్వాత అతడు సోమవారం పంత్‌, శ్రేయస్‌ అయ్యర్‌లతో కలిసి యూకే వెళ్లాడు.
టీమ్ తో మాట్లాడుతున్న కోచ్ రాహుల్ ద్రవిడ్
టీమ్ తో మాట్లాడుతున్న కోచ్ రాహుల్ ద్రవిడ్ (BCCI Twitter)

టీమ్ తో మాట్లాడుతున్న కోచ్ రాహుల్ ద్రవిడ్

లీసెస్టర్‌షైర్‌: ఇండియన్‌ టీమ్‌ హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మంగళవారం లీసెస్టర్‌షైర్‌లో ఉన్న టీమిండియాతో కలిశాడు. ఇంగ్లండ్‌తో వచ్చే నెల 1 నుంచి జరగబోయే ఐదోటెస్ట్‌ కోసం టీమ్‌ అక్కడికి వెళ్లిన విషయం తెలిసిందే. టీమ్‌తో చేరగానే కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, ఇతర టీమ్‌ సభ్యులతో ద్రవిడ్‌ మాట్లాడాడు. మొదట లండన్‌ వెళ్లిన ప్లేయర్స్‌ అక్కడ రెండు రోజులు ప్రాక్టీస్‌ చేసిన తర్వాత లీసెస్టర్‌షైర్‌ చేరుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

సోమవారం నుంచి అక్కడే ప్రాక్టీస్‌ చేస్తున్నారు. కాస్త ఆలస్యంగా టీమ్‌తో కలిసి రోహిత్‌ శర్మ కూడా శుభ్‌మన్‌ గిల్‌తో కలిసి సోమవారం నెట్స్‌లో బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తూ కనిపించాడు. గతేడాది సౌతాఫ్రికా టూర్‌ తర్వాత ద్రవిడ్‌కు ఇది రెండో విదేశీ పర్యటన. గతేడాది ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగు టెస్ట్‌ల సమయంలో రవిశాస్త్రి కోచ్‌గా ఉన్న విషయం తెలిసిందే.

ఆ సిరీస్‌లో మిగిలిపోయిన టెస్ట్‌ ఇప్పుడు జరగనుంది. ఆ తర్వాత మూడు టీ20లు, మూడు వన్డేలు కూడా జరగనున్నాయి. సౌతాఫ్రికా సిరీస్‌లో ఎదురైన చేదు అనుభవం దృష్ట్యా ఇప్పుడు ఇంగ్లండ్‌ టూర్‌పై ద్రవిడ్‌ మరింత దృష్టి సారించాడు. ద్రవిడ్‌ టీమ్‌తో చేరకముందు బౌలింగ్‌ కోచ్‌ పరాస్‌ మాంబ్రే, బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాథోడ్‌లు ప్లేయర్స్‌ ప్రాక్టీస్‌ పర్యవేక్షించారు.

ఇంగ్లండ్‌తో టెస్ట్‌కు ముందు లీసెస్టర్‌షైర్‌తో ఈ నెల 24 నుంచి 27 వరకూ నాలుగు రోజుల వామప్‌ మ్యాచ్‌ ఆడనుంది టీమిండియా. గతేడాది రవిశాస్త్రి కోచింగ్‌లో ఇంగ్లండ్‌పై 2-1 లీడ్‌ తీసుకోవడంతో ఆ లీడ్‌ను కాపాడుతూ సిరీస్‌ గెలిపించే బాధ్యత ఇప్పుడు ద్రవిడ్‌పై ఉంది. అప్పటి ఇంగ్లండ్‌తో పోలిస్తే ఇప్పుడున్న టీమ్‌ చాలా బాగా ఆడుతోందని యూకే బయలుదేరే ముందు ద్రవిడ్‌ చెప్పాడు.