తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Naseem Shah In Hospital: హాస్పిటల్‌లో చేరిన పాకిస్థాన్‌ పేస్‌ బౌలింగ్‌ సెన్సేషన్

Naseem Shah in Hospital: హాస్పిటల్‌లో చేరిన పాకిస్థాన్‌ పేస్‌ బౌలింగ్‌ సెన్సేషన్

Hari Prasad S HT Telugu

28 September 2022, 15:54 IST

    • Naseem Shah in Hospital: హాస్పిటల్‌లో చేరాడు పాకిస్థాన్‌ పేస్‌ బౌలింగ్‌ సెన్సేషన్‌ నసీమ్‌ షా. దీంతో బుధవారం (సెప్టెంబర్‌ 28) ఇంగ్లండ్‌తో జరగబోయే ఐదో టీ20 మ్యాచ్‌కు అతడు దూరం కానున్నాడు.
పాకిస్థాన్ పేస్ బౌలర్ నసీమ్ షా
పాకిస్థాన్ పేస్ బౌలర్ నసీమ్ షా (AFP)

పాకిస్థాన్ పేస్ బౌలర్ నసీమ్ షా

Naseem Shah in Hospital: ఆసియాకప్‌ 2022తో వెలుగులోకి వచ్చిన పాకిస్థాన్‌ పేస్‌ బౌలింగ్‌ సెన్సేషన్‌ నసీమ్‌ షాను హుటాహుటిన హాస్పిటల్‌కు తరలించారు. అతడు తీవ్రమైన వైరల్‌ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతుండటమే ఇందుకు కారణం. దీంతో బుధవారం (సెప్టెంబర్ 28) ఇంగ్లండ్‌తో జరగబోయే ఐదో టీ20 మ్యాచ్‌కు నసీమ్‌ దూరం కానున్నాడు.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

మంగళవారం రాత్రి అతని ఆరోగ్యం క్షీణించడంతో వెంటనే లాహోర్‌లోని హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. బుధవారం అతని పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు మేనేజ్‌మెంట్‌ చెప్పింది. అయితే మిగతా సిరీస్‌లో అతడు ఆడతాడా లేదా అన్నది అనుమానంగా మారింది. వైరల్ ఇన్ఫెక్షన్‌ కారణంగానే అతన్ని హాస్పిటల్‌కు తీసుకెళ్లినట్లు పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు ఒక ప్రకటనలో వెల్లడించింది.

బుధవారం ఇంగ్లండ్‌తో జరగబోయే ఐదో టీ20లో అతడు ఆడబోవడం లేదని, మిగతా సిరీస్‌లో ఆడతాడా లేదా అన్నదానిపై డాక్టర్ల సలహా మేరకు తుది నిర్ణయం తీసుకుంటామని పీసీబీ స్పష్టం చేసింది. కొన్ని రోజులుగా పాకిస్థాన్‌లోని లాహోర్‌ నగరంలో డెంగ్యూ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రతి రోజూ వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి.

దీంతో ప్లేయర్స్‌ అందరికీ డెంగ్యూ టెస్టులు నిర్వహించారు. కరాచీలో తొలి నాలుగు టీ20 ముగించుకొని మంగళవారం పాకిస్థాన్‌, ఇంగ్లండ్‌ టీమ్స్‌ లాహోర్‌ చేరుకున్నాయి. అయితే అక్కడికి వచ్చిన తర్వాత తన ఛాతీలో నొప్పిగా ఉందని, జ్వరం కూడా ఉన్నట్లు నసీమ్‌ చెప్పాడు. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌ ఆడిన నసీమ్‌.. తర్వాత మూడు టీ20లకు దూరంగా ఉన్నాడు.

21 ఏళ్ల నసీమ్‌ షా ఆసియాకప్‌లో సంచలనం రేపిన విషయం తెలిసిందే. తన బౌలింగ్‌తోపాటు ఓ మ్యాచ్‌లో బ్యాట్‌తోనూ అద్భుతం చేశాడు. ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన కీలకమైన మ్యాచ్‌లో వరుసగా రెండు సిక్స్‌లు కొట్టి పాక్‌ను ఫైనల్‌ చేర్చాడు. ఆ తర్వాత ఈ బ్యాట్‌ను పాకిస్థాన్‌ వరదల వల్ల నష్టపోయిన వారికి సాయం చేసేందుకు వేలం వేయడానికి షాహిద్‌ అఫ్రిది ఫౌండేషన్‌కు ఇచ్చాడు. టీ20 వరల్డ్‌కప్‌ టీమ్‌లోనూ నసీమ్‌ షా చోటు సంపాదించాడు.