England T20 World Cup Team: టీ20 వరల్డ్‌కప్‌కు టైమ్ దగ్గర పడుతుండటంతో వరుసగా ఒక్కో బోర్డు తమ టీమ్స్‌ను ప్రకటిస్తున్నాడు. గురువారం ఆస్ట్రేలియా తన టీమ్‌ను ప్రకటించగా.. శుక్రవారం (సెప్టెంబర్ 2) ఇంగ్లండ్ కూడా టీమ్‌ను అనౌన్స్ చేసింది. అక్టోబర్ చివరి వారంలో ప్రారంభం కాబోయే ఈ మెగా టోర్నీలో ఇంగ్లండ్ టీమ్‌కు జోస్ బట్లర్ కెప్టెన్‌గా ఉంటాడు.
అయితే స్టార్ ఓపెనర్ జేసన్ రాయ్‌కు టీమ్‌లో చోటు దక్కకపోవడమే కాస్త ఆశ్చర్యపరిచే విషయం. అతడు కొంతకాలంగా ఫామ్ కోసం తంటాలు పడుతున్నాడు. గతేడాది యూఏఈలో జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్ సెమీఫైనల్ వరకూ వచ్చింది. అయితే అక్కడ న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది. 2010లో చివరిసారి టీ20 వరల్డ్‌కప్ గెలిచింది ఇంగ్లండ్.
అప్పుడు పాల్ కాలింగ్‌వుడ్ కెప్టెన్‌గా ఉన్నాడు. ఆ టోర్నీలో కెవిన్ పీటర్సన్ 248 రన్స్ చేసి ఇంగ్లండ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. అతడే మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్‌గా నిలిచాడు. ఇక 2016 టీ20 వరల్డ్‌కప్‌లోనూ ఫైనల్ చేరినా.. అక్కడ వెస్టిండీస్ చేతుల్లో అనూహ్యంగా ఓటమి పాలైంది. చివరి ఓవర్లో విండీస్ బ్యాటర్ కార్లోస్ బ్రాత్‌వేట్ వరుసగా నాలుగు సిక్స్‌లు బాది విండీస్‌ను విశ్వవిజేతను చేశాడు. ఆ ఓవర్ వేసింది ఇప్పటి ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ కావడం విశేషం.
జోస్ బట్లర్ (కెప్టెన్), మొయిన్ అలీ (వైట్ కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, హ్యారీ బ్రూక్, సామ్ కరన్, క్రిస్ జోర్డాన్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మలన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, బెన్ స్టోక్స్, రీస్ టోప్లీ, డేవిడ్ విల్లీ, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్