Asia Cup Final 2022: ఆసియా కప్ విజేతగా శ్రీలంక – ఫైనల్ లో పాకిస్థాన్‌పై 23 పరుగుల తేడాతో విజయం
Asia Cup Final 2022: ఏ మాత్రం అంచనాలు లేకుండా ఆసియా కప్‌లో అడుగుపెట్టిన శ్రీలంక టైటిల్ ఎగరేసుకుపోయింది. ఆదివారం జరిగిన ఫైనల్‌లో పాకిస్థాన్‌ను23 పరుగులతో తేడాతో ఓడించి విజేతగా నిలిచింది.
Asia Cup Final 2022: ఆసియా కప్2022 విజేతగా శ్రీలంక నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్‌లో పాకిస్థాన్‌ను23 పరుగుల తేడాతో ఓడించింది. శ్రీలంక నిర్ధేశించిన171 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బ్యాటింగ్ దిగిన పాకిస్థాన్ ఆదిలోనే కెప్టెన్ బాబర్ అజామ్,ఫకర్ జమాన్ వికెట్లను కోల్పోయింది. ఇఫ్తికార్ అహ్మద్‌తో కలిసి రిజ్వాన్ పాకిస్థాన్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యత తీసుకున్నాడు. వీరిద్దరు కలిసి మూడో వికెట్‌కు 71 రన్స్ జోడించారు.31 బాల్స్‌లో ఒక సిక్సర్,రెండు ఫోర్లతో32 రన్స్ చేసిన ఇఫ్తికార్ ఔట్ అయ్యాడు.
ట్రెండింగ్ వార్తలు
మిగిలిన బ్యాట్స్‌మెన్ ఎవరూ క్రీజులో నిలదొక్కుకోలేకపోవడంతో పాకిస్థాన్ ఓటమి ఖాయమైంది. ఓ వైపు వికెట్లు పడుతున్నా రిజ్వాన్ మాత్రం ఒంటరిపోరాటాన్ని కొనసాగించాడు.49 బాల్స్‌లో ఒక సిక్సర్ నాలుగు ఫోర్లతో55 రన్స్ చేసి ఔటయ్యాడు.
శ్రీలంక బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయలేకపోవడంతో రిజ్వాన్ (Rizwan) వేగంగా ఆడలేకపోయాడు. రన్ రేట్ పెరుగుతుండటంతో వేగంగా ఆడే ప్రయత్నంలో ఔటయ్యాడు. సరిగ్గా ఇరవై ఓవర్లలో147 పరుగులకు పాకిస్థాన్ ఆలౌట్ అయ్యింది.(Asia Cup Final 2022)
శ్రీలంక బౌలర్లలో మధుషాన్ నాలుగు,హసరంగ(Hasaranga) మూడు,కరుణరత్నే 2 వికెట్లు తీసుకున్నారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక ఇరవై ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి170 రన్స్ చేసింది. రాజపక్స71,హసరంగ36,డిసిల్వా 28 పరుగులతో రాణించారు. రాజపక్స ప్లేయర్ ఆఫ్ మ్యాచ్ అవార్డ్ అందుకోగా...ఆల్ రౌండర్ గా రాణించిన వహిందు హసరంగా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును సొంతం చేసుకున్నాడు.