తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ms Dhoni Biceps: కండలు చూపించి ఫ్యాన్స్ గుండెలు కొల్లగొడుతున్న ధోనీ.. ఫొటో వైరల్

MS Dhoni biceps: కండలు చూపించి ఫ్యాన్స్ గుండెలు కొల్లగొడుతున్న ధోనీ.. ఫొటో వైరల్

Hari Prasad S HT Telugu

16 March 2023, 20:42 IST

    • MS Dhoni biceps: కండలు చూపించి ఫ్యాన్స్ గుండెలు కొల్లగొడుతున్నాడు ధోనీ. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఐపీఎల్ కోసం ప్రాక్టీస్ చేస్తున్న ధోనీ.. నెట్స్ లో అదరగొడుతున్నాడు.
చెన్నై టీమ్ ప్రాక్టీస్ సెషన్ లో ధోనీ
చెన్నై టీమ్ ప్రాక్టీస్ సెషన్ లో ధోనీ

చెన్నై టీమ్ ప్రాక్టీస్ సెషన్ లో ధోనీ

MS Dhoni biceps: పైన ఉన్న ఫొటో చూశారు కదా. 41 ఏళ్ల వయసులో ఎమ్మెస్ ధోనీ ఫిట్‌నెట్ ఇదీ. ఇప్పటికీ క్రికెట్ లోకి కొత్తగా వచ్చిన ప్లేయర్ లాగా తన ఫిట్‌నెస్ ను, ఆటను మెయింటేన్ చేస్తున్నాడు. ఈ ఫొటోను చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ తమ ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగానే వైరల్ అయిపోయింది. చెన్నైలో ప్రాక్టీస్ చేస్తున్న ధోనీ ఇలా తన కండలను చూపిస్తూ ఫ్యాన్స్ గుండెలు కొల్లగొడుతున్నాడు.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

ప్రస్తుతం ఐపీఎల్లో తప్ప ఎక్కడా కనిపించని మిస్టర్ కూల్.. కొన్నాళ్లుగా ఐపీఎల్ 16వ సీజన్ కోసం చెన్నైలో ప్రాక్టీస్ చేస్తున్నాడు. అతని ప్రాక్టీస్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది చెన్నై సూపర్ కింగ్స్. అతడు చెన్నైలో అడుగు పెట్టినప్పటి నుంచీ ఫ్యాన్స్ రెగ్యులర్ గా ధోనీకి సంబంధించిన అప్‌డేట్స్ ఫాలో అవుతున్నారు.

తాజాగా గురువారం (మార్చి 16) సీఎస్కే పోస్ట్ చేసిన ఈ ఫొటో చూసి ఫ్యాన్స్ షాక్ తింటున్నారు. ధోనీ 41 ఏళ్ల వయసులోనూ ఇలా బైసెప్స్ మెయింటేన్ చేయడం చూసి నోరెళ్లబెడుతున్నారు. నిన్న చూపించిన దానికి ఇది ఒరిజినల్ అంటూ చెన్నై సూపర్ కింగ్స్ ఈ ఫొటోను షేర్ చేసింది. దీనిని చూసి అసలు ఇతడు నిజంగానే 41 ఏళ్లు ఉన్నాడా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇప్పటికే ఈ పోస్టుకు లక్షల సంఖ్యలో లైక్స్ వచ్చాయి. ధోనీ కెప్టెన్సీలోనే చెన్నై సూపర్ కింగ్స్ నాలుగుసార్లు ఐపీఎల్ టైటిల్ సాధించడంతో అతనికి చెన్నైలో ఫుల్ ఫాలోయింగ్ ఉంది. అయితే గతేడాది మాత్రం చెన్నై 9వ స్థానంతో సరిపెట్టుకుంది. ఇక ఇది ధోనీకి చివరి సీజన్ కావచ్చని భావిస్తున్న నేపథ్యంలో మరోసారి టైటిల్ తో అతనికి ఘనంగా వీడ్కోలు పలకాలని సీఎస్కే భావిస్తోంది.

చెన్నై సూపర్ కింగ్స్ మార్చి 31న డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటన్స్ తో తలపడనుంది. ఈ మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. గతేడాది గుజరాత్ టాప్ లో, చెన్నై 9వ స్థానంలో నిలిచాయి. ఇక ధోనీ ఇప్పటి వరకూ ఐపీఎల్లో 234 మ్యాచ్ లు ఆడి 4978 రన్స్ చేశాడు. ఐపీఎల్లో అత్యధిక మ్యాచ్ లు ఆడిన రికార్డు ఇప్పటికీ ధోనీ పేరిటే ఉంది.