CSK Tribute to MS Dhoni: ధోనీకి సీఎస్‌కే ఎమోషనల్ ట్రిబ్యూట్.. 'తలా'తో అనుబంధానికి 15 ఏళ్లు పూర్తి-csk emotional tribute to ms dhoni on completing 15 years with franchise ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Csk Tribute To Ms Dhoni: ధోనీకి సీఎస్‌కే ఎమోషనల్ ట్రిబ్యూట్.. 'తలా'తో అనుబంధానికి 15 ఏళ్లు పూర్తి

CSK Tribute to MS Dhoni: ధోనీకి సీఎస్‌కే ఎమోషనల్ ట్రిబ్యూట్.. 'తలా'తో అనుబంధానికి 15 ఏళ్లు పూర్తి

Maragani Govardhan HT Telugu
Feb 21, 2023 11:55 AM IST

CSK Tribute to MS Dhoni: ధోనీకో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ అనుబంధానికి 15 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సీఎస్‌కే జట్టు ధోనీకి ఎమోషనల్ ట్రిబ్యూట్ ఇచ్చింది. తలా అని పేర్కొంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టును షేర్ చేసింది.

ధోనీ
ధోనీ

CSK Tribute to MS Dhoni: చెన్నై సూపర్ కింగ్స్ జట్టును, ఎంఎస్ ధోనీని వేరుగా చూడలేం. ఐపీఎల్ ఆరంభం నుంచి సీఎస్‌కే మన మహీ అనుబంధం అలాంటిది. చెన్నై జట్టులో ధోనీ లేకుండా అస్సలు ఊహించలేం. తాజాగా ఈ ఫ్రాంఛైజీతో 15 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి సీఎస్‌కే ఎమోషనల్ ట్రిబ్యూట్ ఇచ్చింది. ఈ మేరకు ట్విటర్ వేదికగా పోస్టును షేర్ చేసింది. తలా అని పేర్కొంటూ ధోనీకి అదిరిపోయే నివాళి ఇచ్చింది.

2023 ఐపీఎల్ సీజన్ మరి కొన్ని రోజుల్లో ఆరంభం కానున్న తరుణంలో ధోనీకి ఇదే చివరి సీజన్ కావచ్చు. గతేడాదే ఈ విషయంపై హింట్ ఇచ్చిన మిస్టర్ కూల్.. ఈ సీజన్ తర్వాత ఐపీఎల్ నుంచి వైదొలిగే అవకాశముంది. ఈ నేపథ్యంలో 2023 ఐపీఎల్ అత్యంత ప్రత్యేకంగా మారనుంది. ఇప్పటికే చెన్నై జట్టులో అత్యంత ముఖ్యమైన ఆటగాడిగా ధోనీని పరిగణిస్తున్నారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా పోస్టును షేర్ చేసింది.

"15 సంవత్సరాల క్రితం జరిగి అద్భుతమైన దృగ్విషయం! తలా మా జీవితంలోకి అడుగుపెట్టినప్పుడు #WhistlePodu #VaaThala #Yellove" అంటూ సీఎస్‌కే సోషల్ మీడియా వేదికగా పోస్టును జత చేసింది.

ధోనీ కెప్టెన్సీ చెన్నై సూపర్ కింగ్స్ నాలుగు సార్లు ఐపీఎల్ విజేతగా నిలిచింది. 2010, 2011, 2018, 2021 సీజన్‍‌లో చెన్నై ఐపీఎల్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ లెజెండరీ వికెట్ కీపర్ బ్యాటర్ 2008 నుంచి సీఎస్‌కే జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. గతేడాది పేలవ ప్రదర్శనతో గ్రూప్ దశలోనే నిష్క్రమించిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఈ ఏడాది మెరుగైన ప్రదర్శన చేయాలని భావిస్తోంది. గత సీజన్‌లో 14 మ్యాచ్‌లు ఆడితే కేవలం నాలుగు మాత్రమే గెలిచింది.

ఇటీవలే ఐపీఎల్ 2023 సీజన్ షెడ్యూల్‌ను విడుదల చేసింది బీసీసీఐ. ఇందులో భాగంగా ఈ సీజన్ ఆరంభ మ్యాచ్‌ మార్చి 31న డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది. ఫైనల్ మ్యాచ్ వచ్చి మే 28న జరగనుంది.

మే 14న చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ధోనీ తన చివరి మ్యాచ్ ఆడే అవకాశముంది. సీఎస్‌కే ప్లే ఆఫ్స్ అర్హత సాధించడంలో విఫలమైతే కోల్‌కతా నైట్ రైడర్స్‌తో చివరి మ్యాచ్ జరగనుంది. సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం ఐపీఎల్ 2023 సీజన్ ప్రారంభానికి ముందే ధోనీ తన ఐపీఎల్ రిటైర్మెంట్ నిర్ణయాన్ని అధికారికంగా తెలియజేయాలని సీఎస్‌కే భావిస్తోంది.

Whats_app_banner

సంబంధిత కథనం