తెలుగు న్యూస్  /  Sports  /  Mohammad Kaif Stunning Request To Pujara About Century Celebrations

Kaif and Pujara Chit Chat: పుజారా సెంచరీ సెలబ్రేషన్స్‌పై కైఫ్ సెన్సేషనల్ కామెంట్స్.. ఏమన్నాడంటే?

26 December 2022, 9:31 IST

    • Kaif and Pujara Chit Chat: బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో పుజారా సెంచరీ సెలబ్రేషన్స్‌పై పుజారా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సెంచరీ సంబరాలు చాల సింపుల్‌గా ఉన్నాయని, కాస్త ఉత్సాహంగా ఉండాల్సిందని పుజారాకు సలహా ఇచ్చాడు కైఫ్.
 మహమ్మద్ కైఫ్- పుజారా
మహమ్మద్ కైఫ్- పుజారా

మహమ్మద్ కైఫ్- పుజారా

Kaif and Pujara Chit Chat: బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో భారత్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఫలితంగా సిరీస్‌ను 2-0 తేడాతో టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. అనంతరం ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా పుజారా నిలిచాడు. పుజారా తొలి టెస్టులో అద్భుతమైన శతకంతో అదరగొట్టడంతో ఆ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. అంతేకాకుండా తన కెరీర్‌లోనే అత్యంత వేగంగా టెస్టు సెంచరీ చేసిన బ్యాటర్‌గా పుజారా నిలిచాడు. ఆ సెంచరీ పూర్తయిన ఆనందాన్ని కూడా పుజారా చాలా సింపుల్‌గా జరుపుకున్నాడు. ఇదే విషయాన్ని టీమిండియా మాజీ ఆటగాడు మహమ్మద్ కైఫ్ ఓ ఇంటర్వ్యూలో అతడిని అడిగాడు.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

"సెంచరీ చేసిన తర్వాత నీ సెలబ్రేషన్స్ కూడా చాలా సింపుల్‌గా ఉన్నాయి. ఏదైనా చేయొచ్చు కదా.. బ్యాట్‌ను గాల్లోకి లేపడమో, గాల్లో పంచ్ చేయడమో, సంతోషంతో పరుగెత్తడమో చేస్తే బాగుండేది. ఎందుకంటే ఆ విజువల్స్‌ను టీవీలో ఎక్కువగా చూపిస్తారు కాబట్టి పుజారా పరుగులు చేశాడని ప్రజలకు గుర్తుపెట్టుకుంటారు. లేదంట్ టాక్ ఎప్పుడూ నిదానంగానే ఉంటుంది. ట్రోఫీ లభించిన వెంటనే ట్రోఫీని ముద్దాడండి. దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయండి. మీరు సూపర్ కమ్ బ్యాక్ ఇచ్చారని ప్రజలకు చెప్పండి ప్లీజ్." అంటూ పూజారాకు కైఫ్ మార్గనిర్దేశం చేశాడు.

ఇందుకు పుజారా స్పందిస్తూ.. "నేను పరుగులు చేస్తున్నానంటే చాలు నా బ్యాటే మాట్లాడుతుంది. సెలబ్రేషన్స్ కంటే కూడా నేను పరుగులు చేయడం, అవి జట్టు విజయంలో భాగస్వామ్యం కావడాన్ని నమ్ముతాను. సంబరాలు అతిగా జరుపుకోవడం నా స్వభావంలో భాగం కాదు." అంటూ పుజారా రిప్లయి ఇచ్చాడు.

10 నెలల క్రితం శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌కు జట్టులో స్థానంలో కోల్పోయిన పుజారా అద్భుతంగా కమ్ బ్యాక్ చేశాడు. ఇంగ్లాండ్ కౌంటీ ఛాంపియన్‌షిప్స్‌లో మెరుగైన ప్రదర్శన చేసిన అతడు తిరిగి జట్టులోకి వచ్చాడు. బంగ్లాతో జరిగిన తొలి టెస్టులో వేగంగా శతకం బాది అబ్బురపరిచాడు. 2019 తర్వాత పుజారా సెంచరీ చేయడం ఇదే తొలిసారి.