తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Mark Boucher As Mumbai Indians Head Coach: ముంబై ఇండియన్స్‌ హెడ్‌ కోచ్‌గా మార్క్‌ బౌచర్‌

Mark Boucher as Mumbai Indians Head Coach: ముంబై ఇండియన్స్‌ హెడ్‌ కోచ్‌గా మార్క్‌ బౌచర్‌

Hari Prasad S HT Telugu

16 September 2022, 12:02 IST

    • Mark Boucher as Mumbai Indians Head Coach: ముంబై ఇండియన్స్‌ హెడ్‌ కోచ్‌గా మార్క్‌ బౌచర్‌ వచ్చేశాడు. ఈ రేసులో అతనే ముందు ఉన్నట్లు ఒక రోజు ముందే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మార్క్ బౌచర్
ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మార్క్ బౌచర్ (Action Images via Reuters)

ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మార్క్ బౌచర్

Mark Boucher as Mumbai Indians Head Coach: ఐదుసార్లు ఐపీఎల్‌ ఛాంపియన్స్‌ ముంబై ఇండియన్స్‌కు హెడ్‌ కోచ్‌గా సౌతాఫ్రికా మాజీ వికెట్‌ కీపర్‌, మాజీ కోచ్‌ మార్క్‌ బౌచర్‌ వచ్చేశాడు. అతన్ని హెడ్‌ కోచ్‌గా నియమిస్తున్నట్లు ముంబై ఇండియన్స్‌ శుక్రవారం (సెప్టెంబర్‌ 16) అధికారికంగా ప్రకటించింది. ట్విటర్‌ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

"మా కొత్త హెడ్‌ కోచ్‌ను పరిచయం చేస్తున్నాం. పల్టన్స్‌.. మన వన్‌ ఫ్యామిలీలోకి లెజెండ్‌ను స్వాగతించండి" అంటూ ముంబై ఇండియన్స్‌ ఈ ట్వీట్‌ చేసింది. వచ్చే ఐపీఎల్‌ సీజన్‌ నుంచి ముంబై ఇండియన్స్‌కు బౌచర్‌ హెడ్‌ కోచ్‌గా రానున్నాడు. ఇప్పటి వరకూ హెడ్‌ కోచ్‌గా ఉన్న మహేల జయవర్దనె సెంట్రల్‌ టీమ్‌కు ప్రమోట్‌ కావడంతో ఆ స్థానం ఖాళీ అయింది.

జయవర్దనెతోపాటు జహీర్‌ఖాన్‌ను కూడా ఆ టీమ్‌ సెంట్రల్‌ టీమ్‌కు ప్రమోట్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ ఐపీఎల్‌ టీమ్‌ అటు సౌతాఫ్రికా, యూఏఈ లీగ్స్‌లోనూ టీమ్స్‌ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడీ మూడు టీమ్స్‌ను కలుపుతూ ఓ సెంట్రల్‌ టీమ్‌ ఏర్పాటు చేశారు. వాటి బాధ్యతలను జయవర్దనె, జహీర్‌ఖాన్‌లకు అప్పగించారు.

"ముంబై ఇండియన్స్‌లోకి మార్క్‌ బౌచర్‌ను స్వాగతించడానికి సంతోషిస్తున్నాను. ఫీల్డ్‌లో ప్లేయర్‌గా, బయట కోచ్‌గా ఎంతో నైపుణ్యం సాధించి తన టీమ్‌ విజయాల్లో కీలకపాత్ర పోషించిన మార్క్‌ బౌచర్‌ రాకతో ముంబై ఇండియన్స్‌ బలోపేతమైంది. టీమ్‌ను విజయవంతంగా అతడు ముందుకు తీసుకెళ్తాడన్న నమ్మకం ఉంది" అని రిలయెన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ ఛైర్మన్‌ ఆకాశ్‌ అంబానీ అన్నారు.

అటు ముంబై ఇండియన్స్‌ హెడ్‌ కోచ్‌ పదవి దక్కడంపై బౌచర్‌ కూడా స్పందించాడు. "ముంబై ఇండియన్స్‌ హెడ్‌ కోచ్‌గా నియమితమవడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. ఆ టీమ్‌ చరిత్ర, వాళ్ల ఘనతలు ప్రపంచంలోని బెస్ట్‌ స్పోర్టింగ్‌ ఫ్రాంఛైజీల్లో ఒకదానిగా ముంబై ఇండియన్స్‌ను నిలబెడతాయి. ఈ సవాలుకు నేను సిద్ధంగా ఉన్నాను. గొప్ప నాయకత్వం, గొప్ప ప్లేయర్స్‌తో ముంబై బలంగా ఉంది. ఈ టీమ్‌కు నాదైన విలువను జోడించడానికి నేను ఆతృతగా ఉన్నాను" అని మార్క్‌ బౌచర్‌ అన్నాడు.

బౌచర్‌ ఈ మధ్యే సౌతాఫ్రికా కోచ్‌ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్‌తో టెస్ట్‌ సిరీస్‌ ఓటమితో బౌచర్‌ ఈ నిర్ణయం తీసుకున్నాడు. అయితే అతడు టీ20 వరల్డ్‌కప్‌ వరకూ ఆ టీమ్‌తో కొనసాగనున్నాడు. అతన్ని ముంబైకే చెందిన ఎంఐ కేప్‌టౌన్‌ కోచ్‌గా నియమిస్తారన్న వార్తలు వచ్చినా.. ఆ పదవి ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్‌ సైమన్‌ కాటిచ్‌కు దక్కింది.